శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
తలస్సేమియా, కండరాల బలహీనత,
రక్తస్రావం జబ్బులకు కొత్త జన్యు చికిత్స
పరిశోధనల్లో స్వర్ణజయంతి ఫెలోషిప్ గ్రహీత ముందడుగు
Posted On:
18 NOV 2020 2:03PM by PIB Hyderabad
డుషేన్ మస్కులార్ డిస్ట్రఫీ అనేది తీవ్రమైన కండరాల బలహీనతతో వచ్చే రుగ్మత. బాల్యంలోనే సోకి, ఆ తర్వాత మరింత తీవ్రంగా విషమించే ఈ రుగ్మతకు జన్యుపరమైన చికిత్సావ్యూహం త్వరలోనే అందుబాటులో రాబోతోంది.
డుషేన్ మస్కులార్ డిస్ట్రఫీ రుగ్మతకు ఇప్పటివరకూ నివారణ మార్గం తెలియదు. రోగి జీవితకాలాన్ని మెరుగుపరిచేందుకు మాత్రమే ఈ వ్యాధి లక్షణాలకు ఇప్పటివరకూ చికిత్స అందిస్తూ వస్తున్నారు.
అయితే, ఈ వ్యాధి కారక కణాలను జన్యుచికిత్సా ప్రక్రియతో అదుపు చేయవచ్చని బెంగళూరులోని ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐ.ఐ.ఎస్.సి.)కి చెందిన అసిస్టెంట్ ప్రొఫెసర్ సందీప్ ఈశ్వరప్ప చెబుతున్నారు. విజ్ఞాన శాస్త్ర పరిశోధనలో ప్రతిభకు గుర్తింపుగా కేంద్ర సైన్స్-టెక్నాలజీ శాఖనుంచి ఈ ఏడాదికి స్వర్ణజయంతి ఫెలోషిప్ అందుకున్న 21మంది శాస్త్రవేత్తల్లో సందీప్ ఈశ్వరప్ప కూడా ఉన్నారు. సాధారణంగా మానవుల్లో, శిలీంద్రాలు, బాక్టీరియా, ఈగలకు సంబంధించిన జన్యుకణాల్లో జన్యువుల కోడ్.లపై పరిశోధన ద్వారా,. కండరాల బలహీనత అనే రుగ్మతను పరిష్కరించేందుకు ఆయన కృషి చేస్తున్నారు.
జన్యువుల్లో ప్రొటీన్ తీవ్రంగా పరివర్తనం చెందేందుకు, లేదా అంతమయ్యేందుకు కారణమయ్యే డి.ఎన్.ఎ., తద్వారా తలెత్తే జన్యుపరమైన వ్యాధులపై అధ్యయనం ద్వారా పలు చికిత్సా వ్యూహాలను రూపొందించేందకు ప్రొఫెసర్ సందీప్ బృందం గత కొంతకాలంగా పనిచేస్తోంది. ప్రయోగశాలలో జరిగిన ఈ కృషిలో వారు విజయం సాధించారు. ఇప్పటికే తలస్సేమియా వ్యాధి విషయంలో చికిత్సా వ్యూహాన్ని కనుగొన్న శాస్త్రవేత్తల బృందం ఇపుడు ఇతర నమూనాలపై చికిత్సకోసం పనిచేస్తున్నారు. ఇప్పటివరకూ జరిగిన పరిశోధనా వివరాలు, ఇటీవల ‘బయోకెమిస్ట్రీ’ అనే విజ్ఞాన శాస్త్ర అంశాల ప్రత్యేక సంచికలో ప్రచురితమయ్యాయి. తమ పరిశోధనలకు ఇటీవల స్వర్ణజయంతి ఫెలోషిప్ గుర్తింపు లభించడంతో డుషేన్ మస్కులార్ డిస్ట్రఫీ రుగ్మతకు అందించే చికిత్సకు కూడా వారు తమ పరిశోధనను విస్తరించబోతున్నారు. ఈ కృషి విజయవంతమైన పక్షంలో, ఇక తలస్సేమియా, డుషెన్ మస్కులార్ డిస్ట్రఫీ, రక్తస్రావం వంటి జన్యుపరమైన వ్యాధులకు త్వరలో కొత్త తరహా జన్యు చికిత్స అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
జన్యు ఉత్పరివర్తనాన్ని దెబ్బతీసి, ఎం.ఆర్.ఎన్.ఎ. అనే ప్రొటీన్ కణాలను ముందస్తుగానే నిలిపివేసి. ప్రొటీన్ పనిచేయకుండా ఆటంక పరచడంతో కండరాల బలహీనత అనే వ్యాధి తలెత్తుతుంది. బెంగళూరులోని ఐ.ఐ.ఎస్.సి.లో ప్రొఫెసర్ ఈశ్వరప్ప నాయకత్వంలోని బృందం సాగించిన పరిశోధనలతో దీర్ఘకాల వ్యవధి కలిగిన ప్రొటీన్ల స్థిరత్వం, పనితీరుపై ఆశాభావం ఏర్పడింది. “మేం ఇప్పటికే మా ప్రయోగాల ద్వారా సాధించిన విజ్ఞానంతో డుషెన్ మస్కులార్ డిస్ట్రఫీ అనే కండరాల బలహీనత, రక్తస్రావం, తదితర జన్యుపరమైన వ్యాధులకు అనూహ్యమైన చికిత్సా పరిష్కారం కనుగొనేందుకు అవకాశం ఏర్పడింది” అని ప్రొఫెసర్ సందీప్ ఈశ్వరప్ప అన్నారు.
[ప్రచురణ కోసం లింక్: DOI: 10.1021/acs.biochem.9b00761
మరిన్ని వివరాలకు ప్రొఫెసర్ సందీప్ ఈశ్వరప్పను ఈ మెయిల్ ద్వారా సంప్రదించండి.. (sandeep[at]iisc[dot]ac[dot]in).]
**********
(Release ID: 1673759)
Visitor Counter : 243