ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

భారత్ లో మరింత తగ్గి 4.8 లక్షలకు చేరిన కోవిడ్ బాధితుల సంఖ్య

కొత్త కేసులకంటే కోలుకుంటున్నవారు ఎక్కువవుతూ 93% కు చేరిక

Posted On: 14 NOV 2020 11:32AM by PIB Hyderabad

చికిత్సపొందుతున్నవారి సంఖ్య క్రమంగా తగ్గుతూ 5 లక్షల లోపే ఉండటం వరుసగా ఐదో రోజు కూడా కొనసాగింది. ఈరోజుకు భారత్ లో చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య మరింత తగ్గి 4,80,719 గా నమోదైంది. దీంతో మొత్తం పాజిటివ్ కెసులలో చికిత్సపొందుతున్నవారి వాటా  మరో 5.48% తగ్గింది.  ప్రతిరోజూ కొత్తగా నమోదవుతున్న కేసులకంటే కోలుకుంటున్నవారు పెరుగుతూ ఉండటం చూస్తున్నాం.  గత 24 గంటలలో 44,684 కొత్త పాజిటివ్ కేసులు రాగా,  47,992 మంది కోలుకున్నారు.

ప్రజలు కోవిడ్ కు తగినట్టు జాగ్రత్తలు తీసుకుంటూ నడుచుకుంటున్నారనటానికి, కేంద్ర ప్రభుత్వ మార్గదర్శకాలకు అనుగుణంగా రాష్ట్రాలు తీసుకుంటున్న నియంత్రణ చర్యలు పటిష్ఠంగా ఉన్నాయనటానికి  నిదర్శనంగా కొత్త కేసులు క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి. గడిచిన ఐదు వారాలకాలంలో కొత్త కేసుల సంక్య క్రమంగా తగ్గుతూ వస్తోంది.

ఈ ధోరణి కోలుకున్నవారి శాతం ఈరోజు 93% దాటటానికి దోహదపడింది. మొత్తం జాతీయ స్థాయిలో కోలుకున్నవారి శాతం 93.05% అయింది. మొత్తం కోలుకున్నవారి సంఖ్య 81,63,572 కు చేరింది. కోలుకున్నవారికి, చికిత్సలో ఉన్నవారికి మధ్య అంతరం క్రమంగాపెరుగుతూ ప్రస్తుతం 76,82,853 కు చేరింది. .

కొత్తగా కోలుకున్నవారిలో 75.38% మంది పది రాష్టాలకు చెందినవారే. వారిలో ఢిల్లీలో అత్యధికంగా  6,498 మంది, ఆ తరువాత కేరళలో 6,201 మంది, మహారాష్ట్రలో  4,543 మంది కోలుకున్నారు.

కొత్తగా నమోదైన కోవిడ్ కేసులలో 76.38% పది రాష్ట్రాలకు చెందినవే కాగా ఢిల్లీలో గత 24 గంటలలో  అత్యధికంగా  7,802 కేసులు, కేరళలో 5,804, మహారాష్ట్రలో  4,132 కేసులు నమోదయ్యాయి.

గత 24 గంటలలో 520 మంది కోవిడ్ బాధితులు మరణించారు. వీరిలో  79.23% మంది పది రాష్ట్రాలకు చెందినవారే ఉన్నారు.  తాజా మృతులలో 24.4% (127 మరణాలు) ఒక్క మహారాష్ట్రలోనే నమోదుకాగా 91 మందితో ఢిల్లీ, 51 మందితో పశ్చిమ బెంగాల్ ఆ తరువాత స్థానాల్లో ఉన్నాయి. 

 

***



(Release ID: 1672898) Visitor Counter : 138