నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ

33వ వార్షిక సాధారణ సమావేశం నిర్వహించిన ఇరెడ

స్థూల ఆదాయం 17% పెరిగి రూ. 2019-20 ఆర్థిక సంవత్సరంలో రూ.2372 కోట్లకు చేరుకుంది

ఇరేడా రూ. 12,696 కోట్లు రుణాలు మంజూరు చేసింది, రూ.8,785 కోట్ల పంపిణీ తో 2019-20లో 5673 మెగావాట్ల అదనపు సామర్థ్యానికి ఊతం ఇచ్చింది

Posted On: 12 NOV 2020 12:30PM by PIB Hyderabad

న్యూ ఢిల్లీ లోని ఇండియా ఇంటర్నేషనల్ సెంటర్‌లో నూతన పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ పరిధిలోని పిఎస్‌యు, ఇండియన్ రెన్యూవబుల్ ఎనర్జీ డెవలప్‌మెంట్ ఏజెన్సీ లిమిటెడ్ (ఇరెడ) 33 వ వార్షిక సాధారణ సమావేశం (ఎజిఎం) నిన్న జరిగింది. 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వార్షిక ఖాతాలను ఎజిఎం లో ఆమోదించారు.

 

 

డైరెక్టర్లు, వాటాదారులను ఉద్దేశించి, , ఇరేడా సిఎండి శ్రీ ప్రదీప్ కుమార్ దాస్, 2019-20 ఆర్ధిక సంవత్సరం పనితీరును వివరించారు.  సంస్థ స్థూల ఆదాయం రూ. 2,372.38 కోట్లు, 17.32% వృద్ధిని నమోదు చేసింది. ఇరేడా రూ. 12,696 కోట్లు రుణాలు మంజూరు చేసి, రూ. 8,785 కోట్లు పంపిణీ చేసింది. కోఫైనాన్షియల్ ప్రాజెక్టులు / స్వాధీన రుణాలు సహా సంవత్సరంలో మంజూరు చేసిన రుణాలు 5673 మెగావాట్ల సామర్థ్యాన్ని అదనంగా పెరగడానికి ఊతం ఇచ్చాయి. గత సంవత్సరంలో ఇది 3266 మెగావాట్లు.

భవిష్యత్ వ్యూహాల గురించి మాట్లాడుతూ, దేశం గ్రీన్ ఎనర్జీ పోర్ట్‌ఫోలియో పరిమాణం మరియు నాణ్యత రెండింటిలోనూ స్థిరంగా పెరుగుతోందని సిఎండి నొక్కిచెప్పారు; పీఎం-కుసుమ్ పథకం, సౌర & వాయు హైబ్రిడ్ టెక్నాలజీస్, ఇథనాల్ మరియు కంప్రెస్డ్ బయో గ్యాస్ (సిబిజి) వంటి జీవ ఇంధనాలు, ఇ-మొబిలిటీ మరియు అనుబంధ మౌలిక సదుపాయాలు వంటి ప్రభుత్వ వివిధ విధాన కార్యక్రమాలతో మరింత ఊతాన్ని పొందవచ్చని భావిస్తున్నారు. షోర్ విండ్ ఎనర్జీ, సోలార్ రూఫ్-టాప్ ప్రోగ్రామ్ మొదలైనవి. పునరుత్పాదక ఇంధన రంగం యొక్క వనరుల అవసరాలను తీర్చడానికి కొత్త రుణాల కోసం వివిధ అంతర్జాతీయ మరియు బహుపాక్షిక రుణదాతలతో ఇరేడా తన ప్రయత్నాలను కొనసాగిస్తుందని ఆయన అన్నారు. ఇరేడా ఇతర వనరుల నుండి నిధుల సేకరణలో తన ప్రయత్నాలను కొనసాగిస్తుంది మరియు వివిధ ప్రత్యామ్నాయ ఆర్థిక సాధనాల తయారీకి కృషి చేస్తుంది.

***



(Release ID: 1672256) Visitor Counter : 109