రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
ఎన్.ఐ.పి.ఇ.ఆర్ -హైదరాబాద్ లో 14వ వ్యవస్థాపక దినోత్సవాలు
నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఫార్మసూటికల్ ఎడ్యుకేషన్, రిసెర్చి, హైదరాబాద్ ఈరోజు తన 14 వ వ్యవస్థాపక దినోత్సవాలను ఘనంగా నిర్వహించింది, ఈ సందర్భంగా నీతి ఆయోగ్ సభ్యుడు, జెఎన్‌యు ఛాన్సలర్, డిఆర్‌డిఒ మాజీ డిజి శ్రీ వి.కె.సారస్వత్ ముఖ్యఅతిథిగా హాజరయ్యారు.
Posted On:
10 NOV 2020 6:21PM by PIB Hyderabad
డిబిటి సెక్రటరీ, బిఐఆర్ ఎసి ఛైర్‌పర్సన్ డాక్టర్ రేణు స్వరూప్ గౌరవ అతిథిగా హాజరై ఆన్‌లైన్ ప్లాట్‌ఫారం ద్వారా తమ సందేశాన్ని అందించారు.


ఎన్ఐపిఇఆర్=హైదరాబాద్ డైరక్టర్ డాక్టర్ శశి బాలా సింగ్ ఆహ్వానితులకు, ప్రముఖులకు స్వాగతం పలికారు. ఆమె తమ స్వాగతోపన్యాసంలో సంస్థ గత 13 సంవత్సరాల ప్రగతి ప్రస్థానాన్ని , సాధించిన విజయాలను ప్రస్తావించారు. ఎన్.ఐ.పి.ఇ.ఆర్ -హైదరాబాద్ , నేషనల్ ఇన్‌స్టిట్యూషనల్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ (ఎన్.ఐ.ఆర్.ఎఫ్ ) 2020 కింద ఫార్మసీ కేటగిరీలో 5వ స్థానాన్ని సంపాదించినట్టు తెలిపారు. స్వల్పకాలంలోనే ఈ సంస్థ అంతర్జాతీయంగా ఫార్మసూటికల్ సైన్స్ రంగంలో సెంటర్ ఫర్ ఎక్సలెన్స్‌గా
ఎదిగిందన్నారు. కోవిడ్ -19 వంటి సవాలుతో కూడిన సమయంలోనూ సంస్థ ఐటి, ఐఒటి పరికరాలను ఉపయోగించి అన్ని అకడమిక్ కార్యకలాపాలను పూర్తి చేయగలిగిందని అన్నారు. అలాగే 2020 జూలై 24న ఈ కాన్వొకేషన్‌ను విజయవంతంగా జరుపుకోగలిగినట్టు తెలిపారు. దానికి తోడు సంస్థ పలు సెమినార్లు, వర్క్‌షాపులు,వెబినార్లు , ప్రసంగ కార్యక్రమాలు, శిక్షణ కార్యక్రమాలను ఆన్‌లైన్ ప్లాట్‌ఫారంలను ఉపయోగించి నిర్వహించినట్టు చెప్పారు. ఈ సంస్థ వైద్య పరికరాలకు సంబంధించిన(ఎం.టెక్) కోర్సును ప్రవేశపెడుతున్నది. ఇందులో బయాలజీ, కెమిస్ట్రీ, మాథమాటిక్స్, క్లినికల్ సైన్సు, క్లినికల్ సైన్సు, ఇంజినీరింగ్ అంశాలు ఉంటాయి . ఇవి వైద్య పరికరాల అభివృద్ధికి అవసరం.
ఈ వ్యవస్థాపక ఉత్సవాల సందర్భంగా 2019-20 వార్షిక నివేదికను ముఖ్య అతిథిచేత విడుదల చేయించారు.
బిఐఆర్ ఎ సి ఛైర్‌పర్సన్, డిపార్టమెంట్ ఆఫ్ బయోటెక్నాలజీ కార్యదర్శి డాక్టర్ రేణు స్వరూప్ ఎన్.ఐ.పి.ఇ.ఆర్- హైదరాబాద్ 14వ వ్యవస్థాపక దినోత్సవంలో గౌరవ అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆమె, ఫార్మారంగం పోషిస్తున్న కీలక పాత్ర గురించి ప్రముఖంగా ప్రస్తావించారు. అలాగే ప్రస్తుతం ఈరంగంలో పరిశోధన, అభివృద్ధిలో, అది ఏ రకంగా పరివర్తన చెందుతున్నదీ వివరించారు.ఆరొగ్యరంగానికి ప్రత్యేకించి ప్రస్తుత కోవిడ్ -19 వంటి సవాలుతో కూడిన సమయంలో ఎన్.ఐ. పి.ఇ.ఆర్, ఇతర పరిశోథన సంస్థలు అందించిన తమ వంతు పాత్రను ఆమె ప్రస్తావించారు. దేశాన్ని నూరుశాతం స్వావలంబన సాధించేలా (ఆత్మనిర్భర భారత్) చేయడంలో పరిశ్రమ, అకడమిక్ కొలాబరేషన్ కు ఎంతో ప్రాముఖ్యత ఉందన్నారు. ఎన్.ఐ.పి.ఇ.ఆర్-హైదరాబాద్ వైద్యపరికరాలకు సంబంధించిన కోరు్సు, ఫార్మకో ఇన్ఫర్మాటిక్స్, నాచురల్ ప్రాడక్ట్స్‌లను ఆఫర్ చేస్తున్నందుకు , ఎన్.ఐ.పి.ఇ.ఆర్-హైదరాబాద్ సాధించిన విజయాలకు అభినందనలు తెలిపారు.
శ్రీ వి.కె.సారస్వత్ తన ప్రసంగంలో మాట్లాడుతూ, ఎన్.ఐ.పి.ఇ.ఆర్-హైదరాబాద్ 14 వ వ్యవస్థాపక దినోత్సవానికి తనను ఆహ్వానించినందుకు సంతోషం వ్యక్తం చేశారు. అంతర్జాతీయంగా ఫార్మాసూటికల్ నిపుణులకు ఆరోగ్య రంగంలో కీలక పాత్ర ఉందన్నారు. భారతీయ ఫార్మాసూటికల్ సంస్థలు, పరిశ్రమలు అంతర్జాతీయ ఫార్మా మార్కెట్‌లో ముఖ్యభూమిక పోషించారన్నారు. అలాగే కోవిడ్ -19 మహమ్మారి సమయంలో బయోఫార్మా రంగానికి గల అంతర్గతశక్తి గురించి ఆయన ప్రస్తావించారు. బల్క్‌డ్రగ్, ఇంటర్‌మీడియేట్ ఎగుమతులకు సంబంధించి, అలాగే కీలక స్టార్టింగ్ మెటీరియల్, ఎపిఐలకు సంబంధించి విదేశీ మార్కెట్లపై ఆధారపడడం, సప్లయ్‌చెయిన్‌లో సమస్యలను ఎదుర్కోవడంలో వివిధ సంస్థల కృషిని ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు.
దేశాన్ని స్వావలంబన సాధించేలా చేయడానికి సంబంధించిన ఫార్మా 4.0 గురించి ఆయన తెలిపారు. ఆరోగ్య రంగానికి సంబంధించి ఫలితాలను మెరుగుపరిచేందుకు డిజిటల్ రంగంలో పురోగతికి సంబంధించిన మార్గనిర్దేశాన్ని ఆయన ప్రస్తావించారు.బల్క్ కెమికల్స్, గ్రీన్ టెక్నాలజీలతోపాటు ఫార్మాసూటికల్స్ విషయంలో కనీసస్థాయిలో ఆధారపడేందుకు ఫెర్మెంటేషన్ పరిశ్రమలను పునరుద్ధరించాలన్నారు. భవిష్యత్ అవసరాలకు ఇండియాలో ఫైటో ఫార్మూసూటికల్ రిసెర్చ్ ప్రాధాన్యతను ఆయన ప్రముఖంగా ప్రస్తావించారు. అలాగే వివిధ రంగాలలో కృత్రిమ మేధను ఉపయోగించి డాటా మేనేజ్‌మెంట్‌గురించీ తెలిపారు. చివరగా ఆయన ఎన్.ఐ.పి.ఇ.ఆర్-హైదరాబాద్ పరిశోధన కేంద్రాలను సందర్శించారు.అలాగే పరిశోధనలకు సంబంధించి విద్యార్ధులకు శిక్షణగురించి తెలిపారు.
***
(Release ID: 1671803)