శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
ముప్పై మీటర్ల టెలిస్కోప్ ప్రాజెక్టుపై నోబెల్ గ్రహీతతో కలిసి పనిచేసిన భారతీయ ఖగోళశాస్త్రవేత్తలు
Posted On:
10 NOV 2020 2:22PM by PIB Hyderabad
30 మీటర్ల టెలిస్కోపు (టిఎంటి) ప్రాజెక్టు, కాల్‌టెక్, అలాగే కాలిఫోర్నియా, కెనడా, జపాన్, చైనా, ఇండియా విశ్వవిద్యాలయాల
మధ్య అంతర్జాతీయ భాగస్వామ్యంగల ప్రాజెక్టు.
2020 సంవత్సరంలో ఫిజిక్స్‌లో నోబెల్ బహుమతి పొందిన ప్రొఫెసర్ ఆండ్రియా ఘెజ్ భారతీయ ఖగోళ శాస్త్రవేత్తలతో అత్యంత సన్నిహితంగా కలిసి టెలిస్కోపు సంకేతాలను ప్రాసెస్‌లేదా సంఘటితపరిచే పరికరాలరూపకల్పనలో సన్నిహితంగా కలిసి పనిచేశారు. హవాయిలోని మౌనకియాలో ఈ 30 మీటర్ల టెలిస్కోపు ఏర్పాట కానుంది. ఇది ఖగోళరహస్యాలను కనుగొనడంలో విప్లవాత్మకం కానుంది.
దీనితోపాటు , ప్రొఫెసరె ఘెజ్ , ప్రొఫెసర్ రోజెర్ పెన్‌రోజ్, ప్రొఫెసర్ రీన్‌హార్డ్ గెన్‌జెల్‌తో కలిసి ఒక అదృశ్య భారీ వస్తువు మన గెలాక్సీ మధ్యలో ఉన్న నక్షత్రాల కక్ష్యలను నియంత్రిస్తుందని గుర్తించారు. ఈ ఆవిష్కరణలకు ఈ ఏడాది వీరు నోబెల్ పురస్కారానికి ఎంపికయ్యారు. ప్రొఫెసర్‌ఘెజ్ ఇందుకు సంబంధించిన పరికరాల అభివృద్ధిలో , టిఎంటి సైన్సు అభివృద్ధిలో భాగస్వామ్యం వహించారు.ఈ టిఎంటి అబ్జర్వేటరీ తదుపరి తరం అబ్జర్వేటరీగా చెప్పుకోవచ్చు. అడాప్టివ్ ఆప్టిక్స్ వంటి సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి ఇందుకు అవసరమైన సాంకేతిక పరిజ్ఞానాల అభివృద్ధి కృషిలో ప్రొఫెసర్ ఘెజ్ పాలుపంచుకుంటూ వస్తున్నారు.
30 మీటర్ల విశాలమైన ఈ టెలిస్కోపు (టిఎంటి)ప్రాజెక్టుకు కాల్‌టెక్, కాలిఫోర్నియా, కెనడా, జపాన్, చైనా, ఇండియా విశ్వవిద్యాలయాలతో అంతర్జాతీయ భాగస్వామ్యం పెట్టుకుంది. ఇండియాలో ఇది డిపార్టమెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ (డిఎస్‌టి), డిపార్టమెంట్ ఆఫ్ అటామిక్ ఎనర్జీ (డిఎఇ)ద్వారా భాగస్వామ్యం కలిగి ఉంది. భారతదేశానికి చెందిన ఖగోళ శాస్త్రవేత్తలైన ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ ఆస్ట్రోఫిజిక్స్ డైరక్టర్ డాక్టర్ అన్నపూర్ణి సుబ్రమణియం, ఆర్యభట్ట రిసెర్చ్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ అబ్జర్వేషనల్ సైన్స్ (ఎఆర్ఐఇఎస్)కు చెందిన డాక్టర్ శశిభూషణ్ పాండే, అలాగే ఎంతో మంది ఖగొళ శాస్త్రవేత్తలు టిఎంటి ప్రాజెక్టు అభివృద్ధికి సంబంధించిన పరిశొధన కార్యకలాపాలలో పాలుపంచుకున్నారు.
ఫలిలతంగా పలు ఇతర పత్రాలతోపాటు ప్రాముఖ్యతగల రెండు పత్రాలు రూపుదిద్దుకున్నాయి. శాస్త్రీయ అవకాశాలు
TMT కోసం ఇన్ఫ్రారెడ్ ఇమేజింగ్ స్పెక్ట్రోగ్రాఫ్ (IRIS) అని పిలువబడే మొదటి తరం పరికరం శాస్త్రీయ అవకాశాలు, అనుకరణలు, 2016 లో SPIE ప్రొసీడింగ్స్‌లో ఒకదానిలో వివరించడం జరిగింది.విశాల విశ్వంలోని ఎన్నో తెలియని రహస్యాలను తెలుసుకునేందుకు ప ఐఆర్ఐఎస్, టిఎంటిల పరిశోధన సామర్ధ్యాన్ని ఇది తెలియజేస్తుంది.శాస్త్రవేత్తలు అధునాతన డాటా మేనేజ్‌మెంట్ వ్యవస్థ అవసరాన్ని , డాటాతగ్గింపు పైప్‌లైన్ గురించి ఇందులో ప్రముఖంగా ప్రస్తావించారు.
ఇలాగే మరో జర్నల్ అస్ట్రానమీ , ఆస్ట్రోఫిజిక్స్‌లో 2015లో ప్రచురితమైన వ్యాసంలో , టిఎంటి ని ఉపయోగించి వివిధ గాలాక్టిక్, ఎక్స్ట్ ట్రా గెలాక్టిక్ పదార్ధాలను టిఎంటి ని ఉపయోగించి భవిష్యత్ మల్టీ మెసింజర్ అస్ట్రానమీని అత్యద్భుతంగా ఉపయోగించుకోవడం గురించి కూడా ప్రస్తావించడం జరిగింది.ప్రొఫెసర్ ఘెజ్‌తో కలసి ఎందరో భారతీయ శాస్త్రవేత్తలు ఇందులో భాగస్వాములుగా ఉన్నారు.
ముప్పై మీటర్ల టెలిస్కోపు శస్త్రీయ విజ్ఞానాన్ని మరింత ముందుకు తీసుకుపోయేందుకు ఉద్దేశించినది. అలాగే భాగస్వామ్య దేశాలతో, ప్రజలతో మరింత సన్నిహిత సంబంధాలను పెంపొందించేందుకు ఉద్దేశించినది. ఇందులో భారతీయ ఖగోళ శాస్త్రవేత్తలు ప్రొఫెసర్ ఆండ్రెస్ ఘెజ్ తో సన్నిహితంగా కలిసి పనిచేశారు. ఈ టెలిస్కోపు ఖగోళ విజ్ఞానంలో,భౌతిక శాస్త్రంలో వినూత్నప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి అవసరమైన పరిశీలనలను సేకరించడానికి ఇంకా ఎక్కువ సామర్థ్యాలతో సౌకర్యాలను అందిస్తుందని భావిస్తున్నారు.
(మరిన్ని వివరాలకు డాక్టర్ శశిభూషణ్ పాండే ((shashi@aries.res.in ), Mob: 9557470888 ని సంప్రదించవచ్చు)
***
(Release ID: 1671797)
Visitor Counter : 281