శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

'ఇన్‌స్పైర్‌' ఉపకారవేతనాలకు సంబంధించి డీఎస్‌టీ ప్రకటన

Posted On: 10 NOV 2020 2:34PM by PIB Hyderabad

‘ఢిల్లీలోని లేడీ శ్రీరామ్‌ కాలేజ్ ఫర్‌ ఉమెన్‌ విద్యార్థిని జి. ఐశ్వర్య రెడ్డి మరణం పట్ల కేంద్ర శాస్త్ర, సాంకేతిక విభాగం (డిఎస్‌టి) తీవ్ర విచారం వ్యక్తం చేసింది. డిఎస్‌టి పథకమైన "ఇన్నోవేషన్‌ ఇన్‌ సైన్స్‌ ఫర్స్యూట్‌ ఫర్‌ ఇన్‌స్పైర్డ్‌ రీసెర్చ్‌" ‍(ఇన్‌స్పైర్‌) కింద 'ఉన్నత విద్య ఉపకారవేతనాన్ని' (షి) ఐశ్వర్య ఆకాక్షించారు. దేశంలోని ప్రతిభావంతమైన విద్యార్థుల్లో ఆమె ఒకరు. అందుకే ఉన్నత విద్య ఉపకారవేతనంజాబితాలో ఆమె పేరు చేరింది. గతంలో మాదిరే, ఈ ఏడాది ఆగస్టులోనూ 9762 మంది విద్యార్థులకు తాత్కాలిక ఉపకారవేతన లేఖలు పంపాము. బ్యాంకు ఖాతా వివరాలు, మార్కుల జాబితా, కళాశాల నుంచి తీసుకున్న బోనఫైడ్‌/పనితీరు పత్రాలను అప్‌లోడ్‌ చేయమని కోరాం. ఆ తర్వాత, సంవత్సర ఉపకారవేతనం విడుదల అవుతుంది. దురదృష్టవశాత్తు, ఆ పత్రాలు ఐశ్వర్య నుంచి అందలేదు’’ అని డిఎస్‌టి పేర్కొంది.

‘‘ఎంపికైన విద్యార్థులు వేగంగా లాంఛనాలన్నీ పూర్తి చేస్తే, ఉపకారవేతనం సాధ్యమైనంత త్వరగా అందుతుందని, ఈ విషయంలో విద్యార్థులకు సహకరించాలని అన్ని సంస్థలకు ప్రత్యేకంగా అభ్యర్థిస్తున్నాం’’ అని డిఎస్‌టి తెలిపింది.

****



(Release ID: 1671702) Visitor Counter : 167