ప్రధాన మంత్రి కార్యాలయం

ఉత్తరాఖండ్ స్థాప‌న ‌దినం సందర్బం లో ఆ రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు శుభాకాంక్షలు తెలిపిన ప్రధాన మంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 09 NOV 2020 9:44AM by PIB Hyderabad

ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఉత్త‌రాఖండ్ స్థాప‌న దినం సంద‌ర్భం లో ఆ రాష్ట్ర ప్రజల కు శుభాకాంక్షలు తెలిపారు.

‘‘ఉత్త‌రాఖండ్ స్థాప‌న దినం సంద‌ర్భం లో రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు  హృద‌యపూర్వ‌క శుభాకాంక్ష‌లు.  ప్రాకృతిక వనరులు, నైస‌ర్గిక సౌందర్యంతో స‌మృద్ధంగా ఉన్న ఈ రాష్ట్రం ప్ర‌గ‌తి ప‌థంలో పురోగ‌మిస్తోంది; ఇదే విధంగా ఈ రాష్ట్రం నిత్యం సరికొత్త అభివృద్ధి శిఖ‌రాల‌ను అందుకొంటూ ఉండుగాక’’ అని ప్ర‌ధాన మంత్రి అన్నారు.

****


(రిలీజ్ ఐడి: 1671366) సందర్శకుల సూచీ సంఖ్య : : 145