నీతి ఆయోగ్

అటల్ ఇన్నోవేషన్ మిషన్ మరియు సిరియస్ (రష్యా) ‘ఏ.ఐ.ఎం. - సిరియస్ ఆవిష్కరణ కార్యక్రమం 3.0’ ప్రారంభం

పాఠశాల విద్యార్థుల కోసం భారత-రష్యా ద్వైపాక్షిక యువ ఆవిష్కరణ కార్యక్రమం

భారత, రష్యా యువతలో వినూత్న సహకారాన్ని పెంపొందిస్తుంది

Posted On: 07 NOV 2020 7:30PM by PIB Hyderabad

అటల్ ఇన్నోవేషన్ మిషన్ (ఏ.ఐ.ఎం) మరియు రష్యాలోని సిరియస్ సంస్థలు సంయుక్తంగా, ఈ రోజు భారత, రష్యా పాఠశాల పిల్లల కోసం, 14 రోజుల వర్చువల్ కార్యక్రమం ‘ఏ.ఐ.ఎం.- సిరియస్ ఆవిష్కరణ కార్యక్రమం 3.0’ ను ప్రారంభించాయి. 

మొట్టమొదటి భారత-రష్యా ద్వైపాక్షిక యువ ఆవిష్కరణ కార్యక్రమం, ఏ.ఐ.ఎం. - సిరియస్ కార్యక్రమం, రెండు దేశాల సాంకేతిక (వెబ్ మరియు మొబైల్ ఆధారిత) పరిష్కారాలను అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తుంది.

రెండు వారాల పాటు నిర్వహించే ఈ కార్యక్రమంలో, 2020 నవంబర్, 7వ తేదీ నుండి 21వ తేదీ వరకు, 48 మంది విద్యార్థులు మరియు 16 మంది అధ్యాపకులు మరియు సలహాదారులు - సంస్కృతి, దూర విద్య, అనువర్తిత అభిజ్ఞా విజ్ఞానం, ఆరోగ్యం, శ్రేయస్సు, క్రీడలు, ఫిట్‌నెస్, ఆటల శిక్షణ, రసాయన శాస్త్రం, కృత్రిమ మేధస్సు, డిజిటల్ ఆర్థిక ఆస్తులు వంటి అనేక విషయాలలో, కోవిడ్ -19 మహమ్మారి నేపథ్యంలో ఎదురవుతున్న ప్రపంచ సవాళ్లను పరిష్కరించే 8 వర్చువల్ ఉత్పత్తులు మరియు మొబైల్ యాప్ లను రూపొందిస్తారు.

ఏ.ఐ.ఎం. మిషన్ డైరెక్టర్ ఆర్. రమణన్ మాట్లాడుతూ, “ఈ సంవత్సరం కార్యక్రమం శాస్త్ర, సాంకేతికత, డిజైన్ ప్రాజెక్టులలో సహకారం మరియు ఆవిష్కరణలను ప్రోత్సహిస్తుందని తెలియజేయడానికి నేను గర్విస్తున్నాను.  ఇది భారత, రష్యా దేశాల మధ్య మొట్టమొదటి వర్చువల్ ద్వైపాక్షిక విద్యార్థుల భాగస్వామ్య కార్యక్రమం. ఇది అటల్ టింకరింగ్ ప్రయోగశాలలు మరియు సిరియస్ బృందాల మధ్య అపారమైన నిబద్ధతను ప్రదర్శిస్తుంది.  ఏ.ఐ.ఎం. వద్ద మేము ఈ ప్రయాణంలో ఒక భాగమని సంతోషిస్తున్నాము, ” అని పేర్కొన్నారు.

విద్యార్థి బృందాలు అభివృద్ధి చేసిన- యాప్ అభివృద్ధి, కృత్రిమ మేధస్సు, బ్లాక్ చెయిన్చై, మెషిన్ లెర్నింగ్, సమాచార విశ్లేషణ, విజువలైజేషన్, యూ.ఐ./యూ.ఎక్స్, వర్చ్యువల్ వాస్తవికత, అనుబంధ వాస్తవికత,  3-డి. డిజైన్, వేగవంతమైన నమూనాల తో పాటు మరికొన్ని ఆవిష్కరణలు 21 వ శతాబ్దపు సాంకేతిక పరిజ్ఞానాన్ని ప్రభావితం చేస్తాయి. పరిశ్రమ మరియు విద్యాసంస్థలకు చెందిన ఏ.ఐ.ఎం. మరియు సిరియస్ సలహాదారులు ఈ బృందాలతో కలిసి పని చేస్తారు.

టాలెంట్ అండ్ సక్సెస్ ఫౌండేషన్ అధిపతి మరియు రష్యాలోని ప్రెసిడెన్షియల్ కౌన్సిల్ ఫర్ సైన్స్ అండ్ ఎడ్యుకేషన్ సభ్యురాలు ఎలెనా ష్మెలేవా, మాట్లాడుతూ, "అంతర్జాతీయ సహకారం లేకుండా ఆధునిక విజ్ఞానాన్ని ఊహించలేము. ఆవిష్కరణలు తరచూ వివిధ భాషలను మాట్లాడే శాస్త్రవేత్తల బృందాలచే రూపొందించబడినప్పటికీ, వారు చేసే పని ద్వారా ఐక్యమవుతారు. ఇలాంటి అవకాశాలను సృష్టించడానికి, సిరియస్ అంతర్జాతీయ కార్యక్రమాలు సహాయపడతాయి.  ప్రతిభావంతులైన పిల్లలు, యువ శాస్త్రవేత్తలు మరియు ఇంజనీర్లకు మేము విద్యను అందిస్తాము, వారు శాస్త్ర విజ్ఞానంతో పాటు సమాజం యొక్క అత్యంత ప్రతిష్టాత్మక సవాళ్లను సైతం పరిష్కరించగలుగుతారు.” అని తెలియజేశారు. 

ఈ సంవత్సరం కార్యక్రమంలో సిరియస్ సంస్థ నుండి ఉత్తమ రష్యన్ విద్యార్థులు, ఉత్తమ భారతీయ విద్యార్థులు మరియు 2019 ఏ.టి.ఎల్. మారథాన్ కు చెందిన మొదటి 150 బృందాల ఇంచార్జ్ లు ఉన్నారు.  గత సంవత్సరం నిర్వహించిన,  7 రోజుల పరిశోధన ఆధారిత కార్యక్రమంలో పాల్గొన్న,  25 మంది విద్యార్థులు, ఐదుగురు ఉపాధ్యాయులతో కూడిన భారత ప్రతినిధి బృందం, రష్యాలోని సిరియస్ సెంటర్‌ను సందర్శించింది. ఈ బృందాలు - రిమోట్ ఎర్త్ సెన్సింగ్, జీవ మరియు జన్యు పరిశోధన, స్వచ్ఛమైన శక్తి, డేటా విశ్లేషణలు, సరిహద్దు సాంకేతికతలు, డ్రోన్లు మరియు రోబోట్లు వంటి రంగాలలో  8 విభిన్న ఆవిష్కరణలను సృష్టించి, వీటిని, 2019 డిసెంబర్, 5వ తేదీన, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌ కు సమర్పించారు.

*****



(Release ID: 1671198) Visitor Counter : 224