ఉక్కు మంత్రిత్వ శాఖ

తిరిగి పుంజుకుని రెండవ త్రైమాసికంలో నికర లాభం నమోదు చేసిన సెయిల్

టర్నోవర్‌లో 20% కంటే ఎక్కువ అభివృద్ధి నమోదు

Posted On: 07 NOV 2020 4:32PM by PIB Hyderabad

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం 2020-21 (క్యూ 2  ఎఫ్‌వై 21)లో రెండవ త్రైమాసికంలో ఆర్థిక ఫలితాలను  స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (సెయిల్) ప్రకటించింది. ఈ ఫలితాల్లో మంచి వృద్ధిని సెయిల్‌ ప్రతిబించింది. 2021 ఆర్ధిక సంవత్సంలోని రెండో త్రైమాసికంలో కంపెనీ 610.32 కోట్ల రూపాయలు(పన్ను చెల్లింపులకు ముందు(పిబిటీ) నమోదు చేయగా పన్ను అనంతరం (పిఎటి) లాభం 393.32 కోట్ల రూపాయలు. అదే క్రిందటి ఏడాది 523.03 కోట్ల నష్టం (పిబిఏ) 342.84 కోట్లరూపాయలు (పిఏటి)గా ఉంది. తద్వారా 2021 ఆర్ధిక సంవత్సరం సాధించిన లాభం ఆర్ధిక వ్యవస్థలో పెరుగుదలను  మరియు దేశీయ మార్కెట్లో కంపెనీ స్థితిస్థాపకత మరియు దృడమైన పనితీరును ప్రతిబింబిస్తుంది. ఈ ఏడాది ప్రారంభంలో కరోనా మహమ్మారి కారణంగా నెలకున్న ఆర్ధి సంక్షోభంతో కంపెనీ పోరాడింది. అయితే క్రమంగా పనితీరు మరియు కార్యకలాపాలలో వృద్ధిని కంపెనీ నమోదు చేస్తోంది. ఎఫ్‌వై 21 క్యూ 2 లో సెయిల్ టర్నోవర్ కూడా సిపిఎల్‌వై కంటే 20% కంటే ఎక్కువ అభివృద్ధిని నమోదు చేసి 16834.1 కోట్ల రూపాయలగా ఉంది.క్యూ2 ఎఫ్‌వై 21కు సంబంధించిన వడ్డీ, పన్నులు, తరుగుదల మరియు రుణ విమోచన (ఈబిఐటిడిఏ) సిపిఎల్‌వై కంటే 58.7% ఆశ్చర్యకరమైన వృద్ధిని నమోదు చేసి 2098.09 కోట్ల రూపాయలుగా ఉంది. కోవిడ్ ప్రారంభం ద్వారా ఎదురైన ప్రతికూల ఫలితాలను సమర్ధవంతంగా ఎదుర్కోవాలని దృడంగా నిశ్చయించుకున్న కంపెనీ ఆ మేరు అనూహ్యమైన పనితీరును కనబరిచింది. అలాగే జూన్ 20 నుండి అమ్మకాల వృద్ధి వేగాన్ని కొనసాగించింది. మహమ్మారి ద్వారా ప్రభావితమైన ఎఫ్‌'21  మొదటి రెండు నెలల తరువాత, అప్పటి నుండి స్థిరమైన పనితీరును కనబరుస్తోంది. సిపిఎల్‌వై కంటే క్యూ 2 ఎఫ్‌వై 21 సమయంలో సెయిల్ అమ్మకాలలో 31.3% వృద్ధిని నమోదు చేసింది.

ఉక్కు ఉత్పత్తిని పెంచడంపై వ్యూహాత్మక దృష్టి పెట్టిన కంపెనీ క్యూ 2 ఎఫ్‌వై 21 లో 3.752 మెట్రిక్ టన్నుల  అమ్మకపు స్టీల్ క్యూ 2 ఉత్పత్తిని క్యూ 2 ఎఫ్‌వై 21 లో సాధించింది.  క్యూ2 ఎఫ్‌వై 21  అమ్మగలిగే ఉక్కు ఉత్పత్తి సిపిఎల్‌వై కంటే 5% పెరిగింది. కార్యాచరణ సామర్థ్యంపై దృష్టి కేంద్రీకరించడం వలన క్యూ2 ఎఫ్‌వై'21 సమయంలో కీలకమైన టెకో-ఎకనామిక్ పరిమితులు మరింత మెరుగయ్యాయి. కోక్ రేట్ (4%), బ్లాస్ట్ ఫర్నేస్ ఉత్పాదకత (9%) మరియు నిర్దిష్ట శక్తి వినియోగం (1%) సిపిఎల్‌వై కంటే మెరుగుపడ్డాయి.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం రెండవ త్రైమాసికంలో కంపెనీ పనితీరుపై  సెయిల్ చైర్మన్ శ్రీ అనిల్ కుమార్ చౌదరి మాట్లాడుతూ, “ఉహించని సవాళ్లతో ఈ సంవత్సరం ప్రారంభమైంది. ప్రపంచం మొత్తం అదే సవాళు ఎదుర్కోంది. అయితే మా పనితీరును ప్రోత్సహించడానికి మరియు అడ్డంకులను అధిగమించడానికి , సామర్థ్యాన్ని నిరూపించడానికి మన శక్తిపై దృష్టి కేంద్రీకరించడాని ఆ సమయం మమ్మల్నిప్రోత్సహించింది. అయితే దానిని సెయిల్ ధైర్యంగా ఎదుర్కోంది. కంపెనీ అన్ని అసమానతలను ధైర్యంగా ఎదుర్కోని పనితీరులో గణనీయమైన వృద్ధిని ప్రదర్శించడం ద్వారా క్యూ2 ఎఫ్‌వై 21 లో లాభాలను నమోదు చేసింది. భవిష్యత్తులో మెరుగైన పనితీరు కనబరచాలని కంపెనీ నిశ్చయించుకుంది. అలాగే ఆత్మనిభర్ భారత్ నిర్మాణానికి ప్రపంచ స్థాయి దేశీయ ఉక్కు ఉత్పత్తిదారుగా ఉండటానికి అవసరమైన అన్ని చర్యలు తీసుకోవడానికి సిద్ధంగా ఉంది ”.అని చెప్పారు.
                                                                                 

*******



(Release ID: 1671196) Visitor Counter : 172