నైపుణ్యాభివృద్ధి మంత్రిత్వ శాఖ
కాలానికి అణుగుణమైన నైపుణ్యాలను విస్తరించాలంటూ నైపుణ్య అభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రిత్వ శాఖ రాష్ట్రాలకు లేఖ రాసింది
6 నెలల నుండి రెండేళ్ల కాలపరిమితి కలిగిన 13 కొత్త కోర్సులు ప్రకటించబడ్డాయి
Posted On:
06 NOV 2020 4:38PM by PIB Hyderabad
యువతలో నైపుణ్యం పెంచడంతో పాటు రానున్న కాలానికి అవసరమైన నైపుణ్యాలను అందించేందుకు శిక్షణా కేంద్రాలను మరింత విస్తరించాలని దేశవ్యాప్తంగా ఉన్న రాష్ట్రాలను నైపుణ్య అభివృద్ధి మరియు వ్యవస్థాపక మంత్రిత్వ శాఖ (ఎంఎస్‌డిఇ) సూచించింది. రాష్ట్రంలో నైపుణ్యం కలిగిన శ్రామికశక్తిని తీర్చిదిద్దడం ద్వారా స్థానికంగా ఉన్న డిమాండ్ తీరడంతో పాటు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్‌లో మన భారతీయ ముద్రను బలంగా వేయగలుగుతాం. డిజిటల్ టెక్నాలజీ యుగానికి అనుగుణంగా భారత్‌ను తీర్చిదిద్దాలన్న ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యం అదే.
దేశవ్యాప్తంగా ఉన్న వృత్తి శిక్షణ సంస్థల అభివృద్ధి మరియు సమన్వయం కోసం ఎంఎస్‌డిఇకు చెందిన అత్యున్నత సంస్థ డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ ట్రైనింగ్ (డిజిటి) కొత్త ప్రతిపాదనలను సిద్ధం చేసింది. బోధకులకు / శిక్షకులకు శిక్షణ ఇవ్వడానికి రాష్ట్రాలకు సాధ్యమైనంత సాంకేతిక సహాయాన్ని ఇది అందించనుంది. ఆ మేరకు డిజిటి ఇప్పటికే 13 నేషనల్ స్కిల్స్ క్వాలిఫికేషన్ ఫ్రేమ్‌వర్క్ (ఎన్‌ఎస్‌క్యూఎఫ్) కంప్లైంట్ న్యూ-ఏజ్ కోర్సులను ప్రవేశపెట్టింది. అందులో డేటా ఎనలిస్ట్స్ అండ్ సైంటిస్ట్స్, టెక్నీషియన్ మెకాట్రోనిక్స్, స్మార్ట్ అగ్రికల్చర్, క్లౌడ్ కంప్యూటింగ్, ప్రాసెస్ ఆటోమేషన్ ఎక్స్‌పర్ట్స్, యూజర్ ఎక్స్‌పీరియన్స్ అండ్ హ్యూమన్-మెషిన్ ఇంటరాక్షన్ డిజైనర్లు, బ్లాక్‌చెయిన్ నిపుణులు, సాఫ్ట్‌వేర్ మరియు అప్లికేషన్స్ డెవలపర్లు, జియోఇన్ఫర్మేటిక్స్ అసిస్టెంట్, ఏఐ మరియు మెషిన్ లెర్నింగ్ స్పెషలిస్ట్‌లు, బిగ్ డేటా స్పెషలిస్ట్‌లు, ఇన్ఫర్మేషన్ సెక్యూరిటీ ఎనలిస్ట్స్, రోబోటిక్స్ ఇంజనీర్స్ మరియు ఇకామర్స్ మరియు సోషల్ మీడియా స్పెషలిస్ట్ వంటి కోర్టులు ఉన్నాయి. ఈ శిక్షణా కోర్సుల వ్యవధి 6 నెలల నుండి 2 సంవత్సరాల వరకు ఉంటుంది.
తయారీ మరియు సేవా రంగాల్లో ఆధునిక సాంకేతికత వేగంగా అభివృద్ధి చెందుతోంది. ఆయారంగాల్లో యాంత్రిక మరియు మానవుల జ్యోక్యాన్ని పరిమితం చేస్తూ క్రమంగా డిజిటల్, మరియు కృత్రిమ మేథస్సు రంగాలు అభివృద్ధి చెందుతున్నాయి. ఈ సరికొత్త సాంకేతిక పరిజ్ఞానాలపై ఐటిఐల్లో కార్మికులకు శిక్షణ ఇవ్వడం అత్యవసరం. అందుకనే పారిశ్రామిక నిపుణులతో సంప్రదింపులు వారి సూచనలు సలహాల మేరకు ఈ కోర్సులు రూపకల్పన చేయబడ్డాయి. తద్వారా ఈ కోర్సులకు విస్తృతమైన మరియు ఉన్నతమైన పాఠ్యాంశాలు రూపొందింపబడ్డాయి. ఆ మేరకు డిజిటి సాంకేతిక నైపుణ్య విద్యకు సంబంధించిన అడిషనల్ చీఫ్ / ప్రిన్సిపల్ సెక్రటరీలకు జూన్ 12, 2020న లేఖ రాసింది.
ఈ కార్యక్రమానికి సంబంధించి నైపుణ్య అభివృద్ధి మరియు వ్యవస్థాపకత మంత్రి డాక్టర్ మహేంద్ర నాథ్ పాండే మాట్లాడుతూ, “ సరికొత్త సాంకేతిక విప్లవం ఉద్యోగాల స్వభావాన్ని మార్చబోతోంది. మారుతున్న కాలానికి అనుగుణంగా సరికొత్త నైపణ్యాలను తీర్చిదిద్దాలి. పరిశ్రమల యొక్క భవిష్యత్తు డిమాండ్లను తీర్చడానికి సంబంధిత సాంకేతిక రంగాలలో భవిష్యత్ శ్రామిక శక్తిని అభివృద్ధి చేయాలి. పారిశ్రామిక విప్లవం 4.0లో కొత్త సాంకేతిక రంగాలలో డేటా అనలిటిక్స్, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ (ఐఒటి), ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, క్లౌడ్ కంప్యూటింగ్, బ్లాక్‌చెయిన్ మొదలైన వాటిలో మరింత బలమైన సాంకేతిక కార్యక్రమాలను అందించడానికి ఐటిఐల ప్రస్తుత విద్యా విధానాన్ని పునర్నిర్మించాల్సిన అవసరం ఉంది. ” అని చెప్పారు.
పరిశ్రమ అవసరాలకు అనుగుణంగా తాజా సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ ఇవ్వడానికి , ఇండస్ట్రీ 4.0 విప్లవం ప్రకారం 21 వ శతాబ్దపు డిజిటల్ స్కిల్‌పై శిక్షణా కార్యక్రమాలను రూపకల్పన చేయడానికి సాంకేతిక సంస్థలతో డిజిటి అవగాహన ఒప్పందాలు(ఎంవోయూ) కుదుర్చుకుంది. డిజిటితో జతకట్టిన కొన్ని ముఖ్యమైన సంస్థలు ఐబిఎం ఇండియా ప్రైవేట్. లిమిటెడ్, ఎస్‌ఏపీ ఇండియా, మైక్రోసాఫ్ట్ కార్పొరేషన్ (ఇండియా) లిమిటెడ్, నాస్కామ్, క్వెస్ట్ అలయన్స్, యాక్సెంచర్ మరియు సిస్కో మొదలైనవి ఉన్నాయి. ఈ అవగాహన ఒప్పందాలు ద్వారా దేశవ్యాప్తంగా అనేక టెక్ శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించబడతాయి.
***
(Release ID: 1670896)
Visitor Counter : 204