ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ

“2020 నాటికి కోవిడ్‌కు ముగింపు ప‌లుకుదాం” కేంద్ర మంత్రి డాక్టర్ హ‌ర్ష‌వ‌ర్థ‌న్

- ఈ ఏడాది చివరి నాటికి కోవిడ్ అంతానికి ప్రధాన మంత్రి జ‌న్ ఆండోల‌‌న్‌ను విజయవంతంగా అమలు చేద్దామ‌ని పిలుపు

- ఆరు జిల్లాలలో పాజిటీవ్ కేసుల రేటు పెరుగుదల ప్ర‌ధానంగా ప‌రిగణించాల్సిన అంశమన్న‌మంత్రి

- ఆర్ఏటీ ప‌రిక్ష‌ల‌లో నెగ‌టీవ్ వ‌చ్చిన వ్య‌క్తులో ఐఎల్ఐ, ఎస్ఏఆర్ఐ ల‌క్ష‌ణాల‌ను అభివృద్ధి చెందిన‌ట్టుగా కనిపిస్తే వారు ప‌రీక్ష‌లు చేయించుకోవాల‌ని సూచించాలి

Posted On: 05 NOV 2020 5:17PM by PIB Hyderabad

ముఖ మాస్క్‌ల‌ను ధ‌రించ‌డం, శారీర‌క దూరం పాటించ‌డం, చేతుల్ని శ్ర‌భం చేసుకోవ‌డం వంటి సద్గుణాల‌ను గురించి స‌మాజంలోని చిట్ట‌చివ‌రి పౌరునికి కూడా తెలిసేలా గౌర‌వ ప్ర‌ధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ ప్రారంభించిన జ‌న్ ఆందోల‌న్ కార్య‌క్ర‌మాన్ని కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ
శాఖ మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ ప్ర‌శంసించారు. కేంద్ర మంత్రి డాక్టర్ హర్ష్ వర్ధన్ ఈరోజు ఢిల్లీ లెఫ్టెనెంట్ గ‌వ‌ర్న‌ర్ అనిల్ జైజాల్‌, ఢిల్లీ ఆరోగ్య మంత్రి సత్యేంద్ర కుమార్ జైన్, సీనియర్ అధికారులు, మేయర్లు, మునిసిపల్ కమిషనర్లు,ఢిల్లీ జిల్లా న్యాయాధికారులతో స‌మావేశ‌మై
ముచ్చ‌టించారు. కోవిడ్ సంక్షోభాన్ని సమర్థవంతంగా అరికట్టడానికి ప్రభుత్వ విధానం మొత్తం దేశానికి సహాయపడిందని డాక్టర్ హర్ష్ వర్ధన్ ప్ర‌ధానంగా తెలిపారు. కోవిడ్ చికిత్స‌లో ఉప‌యోగ‌
ప‌డేలా ఔష‌ధాల‌ను రీప‌ర్ప‌సింగ్‌ మరియు అటువంటి ఔష‌ధ బయో-రిపోజిటరీ ఏర్పటుకు గాను  శాస్త్రవేత్తల చేసిన‌ పాత్ర గురించి ఆయన వివరించారు. ప్రజలలో కోవిడ్ నియంత్ర‌ణ‌కు గాను అవ‌స‌ర‌మైన‌ తగిన ప్రవర్తనను కలిగించాలని, సంవత్సరాంతానికి అంటు వ్యాధి యొక్క వేగాన్ని మందగింప‌చేసేలా కృషి చేయాల‌ని అన్నారు. తద్వారా వైర‌స్‌ శక్తిని కోల్పోతుందని ఆయన అధికారులను తెలిపారు. 2021 మధ్య నాటికి ఫ్రంట్‌లైన్ హెల్త్‌కేర్‌లో పాల్గొన్న వారితో సహా దాదాపుగా 20-25 కోట్ల మంది పౌరులకు కోవిడ్ టీకాలు వేయాల‌న్న ప్రభుత్వ నిబద్ధతను ఆయన పునరుద్ఘాటించారు. ఢిల్లీలో కోవిడ్ వ్యాప్తిని దేశంతో కేంద్ర మంత్రి వివ‌రించారు. ఈ విష‌య‌మై డాక్టర్ హర్ష్ వర్ధన్ మాట్లాడుతూ “భారతదేశ రికవరీ రేటు ప్రస్తుతం 92% కంటే ఎక్కువగా ఉంది, ఢిల్లీలో ఇది 89 శాతంగా ఉంది. అదే విధంగా కోవిడ్ మ‌ర‌ణాలు దేశంలో
1.49 శాతంగా ఉంటే.. ఢిల్లీలో ఇది 1.71 శాతంగా న‌మోదు అయింది." అని ఆయ‌న వివ‌రించారు. ఢిల్లీలోని ఉత్తర, మధ్య, ఈశాన్య, తూర్పు, నార్త్ వెస్ట్ మరియు సౌత్ ఈస్ట్ జిల్లాల్లో కేసుల సంఖ్య పెరగడం. అధిక పాజిటివ్ రేటు న‌మోదు అవుతుండ‌డం ప‌ట్ల‌ డాక్టర్ హర్ష్ వర్ధన్ ప్రత్యేక ఆందోళన వ్యక్తం చేశారు. ఢిల్లీలో ఆర్ఏటీ, ఆర్టీ-పీసీఆర్ నిష్పత్తికి అధిక స్కీవ్‌ను క‌లిగి ఉంద‌ని అన్నారు. 77 శాతం పరీక్షలు రాట్ ఆధారితమైనవి, ఆర్‌టీ-పీసీఆర్ మొత్తం పరీక్షలలో 23 శాతం మాత్రంగానే ఉన్నాయ‌ని  తెలిపారు. కోవిడ్‌ సోకిన వారిలో తప్పుడు నెగ‌టీవ్ ఫ‌లితాలు వారి ఆత్మసంతృప్తికి దారి తీయవచ్చని పేర్కొన్న అతను తరువాత ఐఎల్ఐ, ఎస్ఏఆర్ఐ లక్షణాలు పెరుగుతున్న‌ట్టుగా క‌నిపిస్తే ఆర్ఏటీ ప‌రీక్ష‌ల‌లో నెగ‌టీవ్ వ‌చ్చిన వ్య‌క్తుల‌ను కూడా త‌ప్ప‌నిస‌రిగా కోవిడ్  ఆర్‌టీ పీసీఆర్ పరీక్ష‌లు చేయించుకోవాల్సిందిగా ఒత్తిడి చేయాల‌ని కోరారు. కోవిడ్ ప‌థంలో ఉన్న‌ ప్ర‌తి ఒక్క‌రిని గురించి నేష‌న‌ల్ సెంట‌ర్ ఫ‌ర్ డిసీజ్ కంట్రోల్ (ఎన్‌సీడీసీ) డైరెక్ట‌ర్ డాక్ట‌ర్ సుర్జీత్ సింగ్ ఈ సంద‌ర్భంగా వివ‌రించారు. ఢిల్లీలోని వివిధ ఆసుపత్రుల్లో కోవిడ్ మరణాల యొక్క సూక్ష్మ విశ్లేషణను కూడా ఆయన ఈ సంద‌ర్భంగా సమర్పించారు. రానున్న పండుగలు,శీతాకాలం నేప‌థ్యంలో రాష్ట్ర ఆరోగ్య అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆయన ఈ సంద‌ర్భంగా హెచ్చరించారు. కోవిడ్‌ రోగుల మెరుగైన వైద్య నిర్వహణ కోసం వైద్య నిపుణుల కమిటీని ఏర్పాటు చేయాలని ఆయన అభ్యర్థించారు. ప్ర‌స్తు‌తం పండుగల‌ సీజన్, అంతర్రాష్ట్ర రవాణాను సులభతరం చేయడం కార‌ణంగా కేసులు పెరిగే అవ‌కాశం ఉందంటూ.. నిపుణులు హెచ్చ‌రించిన నేప‌థ్యంలో ఢిల్లీ పరిపాలన వ్య‌వ‌స్థ‌ను అప్ర‌మ‌త్తం చేయాల‌న్న అంశాన్ని అనిల్ బైజ‌ల్ గుర్తించారు. కోవిడ్ విష‌యంలో ప్ర‌జ‌ల ప్ర‌వ‌ర్త‌న తీరును మార్చ‌డంలో ప్ర‌భుత్వం చేప‌ట్టిన ఐఈసీ ప్ర‌చారం విజ‌య‌వంతం కావా‌ల‌ని ఆయ‌న ఆశాభావం వ్య‌క్తం చేశారు. కోవిడ్‌ను మ‌రింత స‌మ‌ర్థంగా క‌ట్ట‌డి చేయ‌డం, వైర‌స్ వ్యాప్తి నివార‌ణ‌కు గాను స్టాండ‌ర్ట్ ఆప‌రేటింగ్ ప్రొసీజ‌ర్‌లో మార్పు‌ల‌ను జొప్పించే దిశ‌గా ప‌రిపాల వ్య‌వ‌స్థ ప‌ని చేస్తోంద‌ని అన్నారు. ప్ర‌స్తుత ప‌రిస్థితిలో ఒత్త‌డి నెల‌కొన్న నేప‌థ్యంలో న్యూఢిల్లీ  ఎయిమ్స్‌తో పాటు ఇత‌ర కేంద్ర ప్ర‌భుత్వం ద‌వాఖానాల్లో ఐసీయూ ప‌డ‌క‌ల సంఖ్య‌ను పెంచాల‌ని ఆయ‌న కోరారు. కేంద్ర ఆరోగ్య శాఖ కార్య‌ద‌ర్శి శ్రీ రాజేశ్ భూష‌ణ్ మాట్లాడుతూ స‌మ‌ర్థ‌మంత‌మైన‌ కాంటాక్ట్‌ల‌ గుర్తింపు అనేది కేవ‌లం కాంటాక్ట్ అయిన వారిని పెద్ద సంఖ్యంలో గుర్తిస్తే స‌రిపోద‌ని.. ఈ మొత్తం ప్ర‌క్రియ మొద‌టి 72 గంట‌ల్లోపు పూర్తి చేయాల‌ని ఆయ‌న అన్నారు. క్రిటిక‌ల్ కేర్ అవ‌స‌ర‌మైన కోవిడ్ రోగుల‌ను దౌల‌త్‌-కాన్‌లో ఉన్న డెఫెన్స్ మెడిక‌ల్ హాస్పిట‌ల్ ఫెసిలిటీకి త‌ర‌లించాల‌ని సూచించారు. ఇక్కడ 125 ఐసీయూ ప‌డక‌లు అందుబాటులో ఉన్నాయ‌ని తెలిపారు. ఢిల్లీ చీఫ్ సెక్ర‌ట‌రీ శ్రీ విజ‌య్ కుమార్ దేవ్ ఈ స‌మావేశానికి త‌న కార్యాల‌యం వ‌ర్చువ‌ల్ విధానంలో హాజ‌ర‌య్యారు. ఈ స‌మావేశంలో కేంద్ర ఆరోగ్య శాఖ అద‌న‌పు కార్య‌ద‌ర్శి శ్రీ‌మతి ఆర్తి అహుజా మంత్రిత్వ శాఖ ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.

 

****


(Release ID: 1670558) Visitor Counter : 139