ప్రధాన మంత్రి కార్యాలయం
నవంబర్ 7 న ఐఐటి దిల్లీ 51 వ వార్షిక స్నాతకోత్సవం లో ప్రసంగించనున్న ప్రధాన మంత్రి
Posted On:
05 NOV 2020 7:48PM by PIB Hyderabad
ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఐఐటి దిల్లీ 51 వ వార్షిక స్నాతకోత్సవం లో ముఖ్య అతిథి గా పాలుపంచుకోనున్నారు. ఈ స్నాతకోత్సవాన్ని ఉద్దేశించి శ్రీ మోదీ 2020 నవంబర్ 7 వ తేదీ ఉదయం 11 గంటలకు వీడియో కాన్ఫరెన్స్ మాధ్యమం ద్వారా ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమంలో కేంద్ర విద్య శాఖ మంత్రి, కేంద్ర విద్య శాఖ సహాయ మంత్రి కూడా పాల్గొంటారు.
ఇన్స్ టిట్యూట్ కు చెంది డోగ్ రా హాల్ లో కొంత మంది మాత్రమే స్వయంగా పాల్గొనే ఈ స్నాతకోత్సవాన్ని హైబ్రిడ్ మోడ్ లో నిర్వహించడం జరుగుతుంది. ఈ కార్యక్రమాన్ని గ్రాడ్యుయేట్ విద్యార్ధులందరితో పాటు వారి తల్లితండ్రులకు, ప్రముఖ పూర్వ విద్యార్ధులకు, ఆహ్వానిత అతిథులకు ఒక ఆన్‌లైన్ వెబ్ కాస్ట్ మాధ్యమం ద్వారా అందుబాటులోకి తీసుకురానున్నారు. స్నాతకోత్సవం లో పిహెచ్.డి., ఎమ్. టెక్, మాస్టర్స్ ఆఫ్ డిజైన్, ఎంబిఎ, బి.టెక్. విద్యార్థులు సహా 2 వేల మందికి పైగా స్నాతక విద్యార్ధులకు డిగ్రీలను ప్రదానం చేయడం జరుగుతుంది. గ్రాడ్యుయేశన్ పూర్తి చేసిన విద్యార్ధులకు రాష్ట్రపతి స్వర్ణ పతకాన్ని, డైరెక్టర్ స్వర్ణ పతకాన్ని, డాక్టర్ శంకర్ దయాళ్‌శర్మ స్వర్ణ పతకాన్ని, పది ఉత్తమ స్వర్ణ పతకాలను, అలాగే రజత పతకాలను కూడా ఇన్స్ టిట్యూట్ ప్రదానం చేయనుంది.
***
(Release ID: 1670490)
Read this release in:
Assamese
,
Bengali
,
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam