సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

ప్రమిదల తయారీదారులకు ముందుగానే దీపావళి తెచ్చిన కెవిఐసి ఈ-పోర్టల్

Posted On: 05 NOV 2020 4:06PM by PIB Hyderabad

ఖాదీ ఆన్‌లైన్ అమ్మకాలు ఈ దీపావళికి ప్రమిదల తయారీ దారులకు మంచి అదృష్టాన్ని తెచ్చిపెట్టాయి. రాజస్థాన్‌లోని జైసల్మేర్ మరియు హనుమన్‌ఘడ్‌ ప్రాంతాల్లో తయారైన మట్టి ప్రమిదలు ఖాదీ ఇండియా ఈ-పోర్టల్‌ ద్వారా దేశంలోని ప్రతిమూలకు చేరుతున్నాయి.

 

    

ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (కెవిఐసి), ఈ ఏడాది మొదటిసారిగా మట్టి ప్రమిదలను ఆన్‌లైన్ మరియు దుకాణాల ద్వారా విక్రయించాలని నిర్ణయించింది. అందులో భాగంగా కెవిఐసి అక్టోబర్ 8న దియాల ఆన్‌లైన్ అమ్మకాన్ని ప్రారంభించింది. ఆన్‌ లైన్ ద్వారా నెలరోజల్లోపే దాదాపు 10,000 దియాలు అమ్ముడయ్యాయి. అమ్మకాలు ప్రారంభించిన మొదటి రోజు నుండే మట్టి ప్రమిదలకు మంచి డిమాండ్ కనిపించింది. అధిక భాగం డిజైనర్ ప్రమిదలు ఇప్పటికే పూర్తిగా అమ్ముడుపోయాయి.

ఈ అమ్మకాల కారణంగా కెవిఐసి కొత్త సెట్ డిజైనర్ డియాస్‌ను కూడా విడుదల చేసింది. వాటికి కూడా భారీ డిమాండ్‌ ఉంది. దీపావళి దగ్గరగా ఉండటంతో డియాస్ అమ్మకాలు రోజురోజుకు మరింతగా పెరుగుతున్నాయి.

8 రకాల డిజైనర్ దియాస్‌ను కెవిఐసి ఆన్‌లైన్‌ పోర్టల్‌లో అందుబాటులో ఉంచింది. అందరికీ అందుబాటులో ఉండేలా 12 దియాలు సెట్లను 84 రూపాయలు, 108 రూపాయలుగా నిర్ణయించింది.వీటిపై కెవిఐసి 10% తగ్గింపును కూడా అందిస్తోంది. ప్రతి దియా అమ్మకం ద్వారా తాము రూ .2 నుండి 3 రూపాయలు సంపాదిస్తున్నామని కెవిఐసి కుమ్మరులు సంతోషం వ్యక్తం చేశారు. ఖాదీ డిజైనర్ దియాలు www.khadiindia.gov.in లో అందుబాటులో ఉన్నాయి.

దియాలతో పాటు లక్ష్మి, గణేష్ వంటి దేవతల మట్టి విగ్రహాలు, ఇతర అలంకరణ వస్తువులను ఢిల్లీ మరియు ఇతర నగరాల్లోని తన అవుట్లెట్ల ద్వారా
కెవిఐసి విక్రయిస్తోంది. ఈ విగ్రహాలను వారణాసి, రాజస్థాన్, హర్యానా మరియు ఇతర రాష్ట్రాల్లోని కుమ్మరులు తయారు చేస్తున్నారు. వీటి ద్వారా వారు మంచి ఆదాయాన్ని పొందగలుగుతున్నారు. దియాలను రాజస్థాన్‌ పోఖ్రాన్‌లోని  కెవిఐసి యూనిట్లతో పాటు హనుమన్‌ఘడ్,రావత్‌సర్‌నుండి కొనుగోలు చేస్తున్నారు.  వివిధ ఖాదీ అవుట్లెట్ల ద్వారా ఇప్పటివరకూ 10,000 కి పైగా దియాలు అమ్ముడయ్యాయి.

కెవిఐసి చైర్మన్ శ్రీ వినాయ్ కుమార్ సక్సేనా మాట్లాడుతూ ఆన్‌లైన్ మట్టి వస్తువుల అమ్మకం ద్వారా కెవిఐసి పొట్టర్లకు నిజమైన సాధికారత లభించిందని చెప్పారు. గతంలో వారంతా ఒక నిర్దిష్ట ప్రాంతంలో స్థానికంగా మాత్రమే తమ వస్తువులను విక్రయించడానికి అవకాశం ఉండేదని..కానీ ఖాదీ ఈ-పోర్టల్ ద్వారా ఆ ఉత్పత్తులు ఇప్పుడు దేశంలోని అన్ని ప్రాంతాల్లో అమ్ముడవుతున్నాయని చెప్పారు. రాజస్థాన్‌లో తయారైన దియాలను కెవిఐసి ఈ-పోర్టల్ ద్వారా  అరుణాచల్ ప్రదేశ్, జమ్ము కశ్మీర్, కేరళ, అస్సాం, మహారాష్ట్ర, అండమాన్ & నికోబార్ దీవుల్లోని మారుమూల ప్రాంతాల్లో కూడా కొనుగోలు చేస్తున్నారని చెప్పారు. తద్వారా ఉత్పత్తిలో పెరుగుదలతో పాటు తయారీదారులు అధిక ఆదాయాన్ని ఆర్జించడానికి అవకాశం లభించిందని సక్సేనా అన్నారు."కుమ్మరులను శక్తివంతం చేయడంతో పాటు ఆ కళకు పునరుజ్జీవనాన్ని కల్పించడం ప్రధానమంత్రి కల" అని సక్సేనా తెలిపారు.

పోఖ్రాన్‌లోని పిఎమ్‌ఇజిపి యూనిట్‌కు చెందిన కుమ్మరి మదన్ లాల్ ప్రజాపతి మాట్లాడుతూ.. తాను తన గ్రామం వెలుపల దియాలను విక్రయించడం ఇదే తొలిసారి అని చెప్పారు. తమకు ఈ దీపావళి అమ్మకాలు పెరిగాయని..తాము ఢిల్లీలోని ఖాదీ భవన్‌కు తమ వస్తువులను సరఫరా చేస్తున్నామని తెలిపారు. అక్కడి నుండి ఆ ఉత్పత్తులు దేశవ్యాప్తంగా ఆన్‌లైన్‌లో విక్రయిస్తున్నారని..ఇది తనకు మంచి ఆదాయాన్ని అందిస్తోందని అన్నారు.

కెవిఐసి ఈ కుమ్మరులకు శిక్షణ ఇవ్వడంతో పాటు కుమ్హార్ శశక్తికరన్ యోజన పథకం కింద ఎలక్ట్రిక్ కుమ్మరి చక్రాలు ఇతర పరికరాలను అందించింది. అది వారి ఉత్పత్తి మరియు ఆదాయాన్ని 5 రెట్లు పెంచింది. ఇప్పటివరకు కెవిఐసి 18,000 ఎలక్ట్రిక్ కుమ్మరి చక్రాలను పంపిణీ చేసింది.  ఇది కుమ్మరి వృతికి చెందిన 80,000 మందికి ప్రయోజనం చేకూరుస్తుంది.

***



(Release ID: 1670469) Visitor Counter : 168