సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
ఉత్తర ముంబైలో దివ్యాంగులకు సహాయక పరికరాల ఉచిత పంపిణీ ఎడిఐపి శిబిరాన్ని దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించిన తావర్‌చంద్ గెహ్లాట్ రానున్న 3 రోజుల్లో 1035 లబ్ధిదారులు 1740 సహాయక పరికరాలను అందుకోనున్నారు
Posted On:
05 NOV 2020 5:38PM by PIB Hyderabad
దివ్యాంగులకు అవసరమైన తోడ్పడే పరికరాల ఉచిత పంపిణీ కోసం తూర్పు ముంబైలో నిర్వహించిన ఎడిఐపి శిబిరాన్ని సామాజిక న్యాయం, సాధికారత మంత్రి తావర్‌చంద్ గెహ్లాట్ గురువారం దృశ్య మాధ్యమం ద్వారా ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి తూర్పు ముంబై లోక్‌సభ నియోజకవర్గ పార్లమెంటు సభ్యుడు గోపాల్ శెట్టి అధ్యక్షత వహించారు. కోవిడ్ 19 సంక్షోభ నేపథ్యంలో అన్ని నివారణ చర్యలను అనుసరించి ఈ శిబిరాన్ని ఉత్తర ముంబైలోని కాండివలి(పశ్చిమ)లోని పోయినసర్ జింఖానాలో నిర్వహించారు.
ఈ సందర్భంగా మాట్లాడుతూ, దివ్యాంగులకు, ఈ కార్యక్రమానికి హాజరైన వారికీ, ఆన్‌లైన్ వెబ్ కాస్ట్ ద్వారా ఈ కార్యక్రమంలో పాలు పంచుకున్నవారికీ మంత్రి గెహ్లాట్ దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. దివ్యాంగులకు సంబంధించి ప్రభుత్వం సాధించిన విజయాల గురించి మాట్లాడుతూ, వికలాంగుల సాధికారత విభాగం (డిఇపిడబ్ల్యుడి) దాదాపు 16.70 లక్షల మంది దివ్యాంగులకు లబ్ధి చేకూరుస్తూ ఇటువంటి 9265 శిబిరాలను ఎడిఐపి కింద నిర్వహించిందని వివరించారు. అంతేకాకుండా, కోవిడ్-19 సంక్షోభం నేపథ్యంలో సోషల్ డిస్టెన్సింగ్, శానిటైజేషన్ ప్రోటోకాల్‌ని అనుసరించి ప్రస్తుత పరిస్థితుల్లో శిబిరాల నిర్వహణకు కోసం సవరించిన ప్రామాణీకరించిన కార్యకలాపాల పద్ధతికి మంత్రిత్వ శాఖ ఆమోదాన్నిచ్చిందని ఆయన తెలిపారు. అలాగే ఎంపిలాడ్ నిధుల ద్వారా 33 మోటరైజ్డ్ త్రిచక్ర వాహానాలను అందించిన ఉత్తర ముంబై ఎంపీ గోపాల్ శెట్టికి ఆయన కృతజ్ఞతలు తెలిపారు. ఈ వాహనాలను ఉత్తర ముంబైలో గుర్తించిన దివ్యాంగులకు పంపిణీ చేశారు.
తన నియోజకవర్గంలో ఈ శిబిర నిర్వహణకు సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ అందించిన మద్దతుకు కృతజ్ఞతలు తెలుపుతూ, దేశవ్యాప్తంగా ఉన్నదృష్టి దోషమున్న వ్యక్తులకు పెన్షన్ లేక తగిన వ్యవస్థలను ఏర్పాటు చేయవలసిందిగా కోరారు.
ఈ ఏడాది జనవరి, ఫిబ్రవరి నెలల్లో ఉత్తర ముంబైలోని ఆరు ప్రాంతాలలో మొత్తం 1035మంది లబ్ధిదారులను గుర్తించడం జరిగింది. రానున్న మూడు రోజులలో ముందుగా గుర్తించిన లబ్ధిదారులకు దహిసాగర్, కాందివలి (పశ్చిమ), కాందివలి ( తూర్పు), బోరివలి (తూర్పు), బోరివలి (పశ్చిమ), పోయిన్‌సర్ జింఖానాలలో రూ. 87.96 లక్షల విలువైన మొత్తం 1740 సహాయక పరికరాలను పంచనున్నారు.
ఈ శిబిరాన్ని సామాజిక న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖకు అనుబంధమైన వికలాంగ వ్యక్తుల సాధికారత విభాగం కింద పని చేస్తున్న కృత్రిమ అంగాల ఉత్పత్తి కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, కాన్పూర్, జిల్లా పరిపాలనా శాఖతో కలిసి నిర్వహించింది. ఈ శిబిరాన్ని భారత ప్రభుత్వం అమలు చేస్తున్న ఎడిఐపి పథకం కింద నిర్వహించారు. ఈ శిబిరాన్ని ప్రామాణిక కార్యకలాపాల ప్రక్రియకు అనుగుణంగా నిర్వహించారు.
ఈ శిబిరంలో వివిధ వర్గాలకు చెందిన 150 మంది దివ్యాంగులకు 21 మోటరైజ్డ్ త్రిచక్ర వాహనాలు సహా పలు పరికరాలను పంపిణీ చేశారు. ఉత్తర ముంబై లోక్‌సభ సభ్యుడు గోపాల్ శెట్టి ఎంపిలాడ్ నిధుల నుంచి అందించిన రూ.396000తో మొత్తం 33 మోటరైజ్డ్ త్రిచక్ర వాహనాలను పంపిణీ చేశారు. ఒక త్రిచక్రవాహనం ధర రూ. 37000/-. భారత ప్రభుత్వ పథకమైన ఎడిఐపి కింద అర్హత కలిగిన లబ్ధిదారులకు రూ. 25000 సబ్సిడీ వస్తుంది. కాగా, ఒక్కొక్క త్రిచక్రవాహనానికి మిగిలిన రూ.12000 మొత్తాన్ని ఎంపిలాడ్ నిధుల నుంచి ఇవ్వడం జరిగింది.
కోవిడ్-19 సంక్షోభ సమయంలో మహమ్మారి మరింత వ్యాప్తి చెందకుండా తగిన జాగ్రత్త చర్యలు, వ్యక్తిగత ఆరోగ్య భద్రత చర్యలను సహాయక పరికరాల పంపిణీ సమయంలో తీసుకున్నారు. ప్రతి వ్యక్తికి థర్మల్ స్ర్కీనింగ్, తప్పనిసరిగా మాస్కును ఉపయోగించడం, శానిటైజసర్లు, చేతికి గ్లోవ్స్ , పిపిఇ కిట్లను లబ్ధిదారులను సంప్రదించే సమయంలో అందుబాటులో ఉంచడం జరిగింది. పంపిణీ కోసం శిబిర స్థలం, తరచుగా అంటుకునే ప్రాంతాన్ని కూడా నూతన ప్రామాణీకరణ కార్యకలాపాల ప్రక్రియ కింద శానిటైజేషన్ చేయడం జరిగింది. పరికరాలనుపరికరాలను విడుదల చేసేముందు, రవాణా వాహనాన్ని శానిటైజ్ చేయడం తెరిచిన/ మూసి ఉంచిన నిల్వ ఉంచే ప్రాంతాల శానిటైజేషన్ సహా బహుళ స్థాయి శానిటైజేషన్, సహాయ పరికరాల రీశానిటైజేషన్ ను పంపిణీకి ముందు నిర్వహించడం జరిగింది.
కార్యక్రమంలో పాల్గొనడానికి వచ్చిన లబ్ధిదారులు, వారికి సహాయకులుగా వచ్చిన వారికి సోషల్ డిస్టెన్సింగ్ ఉండేలా కుర్చీల ఏర్పాటు చేయడం జరిగింది. అలాగే నిర్ధిష్ట సమయంలో ఒక బ్యాచీలో 40మంది లబ్ధిదారుల చొప్పున వచ్చేందుకు, వెళ్ళేందుకు ప్రత్యేక ద్వారాలను ఏర్పాటు చేయడం జరిగింది.
ఉత్తర ముంబైలో దశలవారీగా నిర్వహించనున్న పంపిణీ శిబిరాలలో 33 మొటరైజ్డ్ త్రిచక్రవాహనాలు, 75 చేతితో నడిపే త్రిచక్రవాహనాలు, 169 వీల్ చైర్, 12 సిపి చైర్, 178 క్రచెస్, 116 వాకింగ్ స్టిక్స్, అంధులకు 136 స్మార్ట్ కేన్, 23 ఫోల్డింగ్ కేన్, 18 స్మార్ట్ ఫోన్, 5 డైజీ ప్లేయర్, 02 బ్రెయిలీ కిట్, 11 రొలాటర్, 822 వినికిడి పరికరాలు, 30 ఎంఎస్ ఐఇడి కిట్, 6 డైలీ లింగ్ అసిస్టెన్స్ ఫర్ లెప్రసీ కిట్, 102 కృత్రిమ అవయవాలు, కాలిపర్లను పంపిణీ చేయనున్నారు.
మహారాష్ట్ర శాసన మండలి ప్రతిపక్ష నాయకుడు, ఎమ్మెల్సీ ప్రవీణ్ దరేకర్, ఎమ్మెల్సీ విజయ్ (భాయ్) గిర్కర్, చర్కోప్ ఎమ్మెల్యే యోగేష్ సాగర్,కాందివలీ ఎమ్మెల్యే అతుల్ భట్కల్కర్, దహిసాగర్ నియోజకవర్గ ఎమ్మెల్యే శ్రీమతి మనీషా చౌదరి, బోరివలి నియోజకవర్గ ఎమ్మెల్యే సునీల్ రాణె, ఇతర ప్రజా ప్రతినిధులు, డిఇపిడబ్ల్యుడి డిప్యూటీ కార్యదర్శి బీనా ఇ. చక్రవర్తి,, ఎఎల్ ఐఎంసిఒ జిఎం లెఫ్టనెంట్ కల్నల్ (రిటైర్డ్) పికె దూబే, జాతీయ అవార్డు గ్రహీత డాక్టర్ యోగేష్ దూబే, జిల్లాకు చెందిన సీనియర్ అదికారులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
***
(Release ID: 1670461)
Visitor Counter : 185