మంత్రిమండలి

ఖ‌గోళశాస్త్ర రంగంలో విజ్ఞానశాస్త్ర ప‌ర‌మైన, సాంకేతిక విజ్ఞాన‌ సంబంధమైన స‌హ‌కారానికి ప్రోత్స‌ాహాన్ని ఇచ్చేందుకు భార‌త‌దేశాని కి, స్పెయిన్ కు మ‌ధ్య ఓ అవ‌గాహ‌న పూర్వ‌క ఒప్పందంపై సంతకాలు చేయడానికి ఆమోదం తెలిపిన మంత్రిమండ‌లి

Posted On: 04 NOV 2020 3:37PM by PIB Hyderabad

ఖ‌గోళశాస్త్ర రంగంలో విజ్ఞానశాస్త్ర ప‌ర‌మైన, సాంకేతిక విజ్ఞాన సంబంధమైన స‌హ‌కారాన్ని ప్రోత్స‌హించ‌డానికి బెంగ‌ళూరు లోని ఇండియ‌న్ ఇన్స్ టిట్యూట్ ఆఫ్ ఏస్ట్రోఫిజిక్స్ (ఐఐఎ) కు,  స్పెయిన్ కు చెందిన ఇన్స్ టిట్యూటో డీ ఏస్ట్రోఫిజికా డీ కాన‌రియాస్ (ఐఎసి), గ్రానటికాన్‌, ఎస్‌.ఎ (జిటిసి) ల‌కు మ‌ధ్య ఒక అవ‌గాహ‌నపూర్వ‌క ఒప్పందం (ఎమ్ఒయు)పై సంతకాలు చేయడాన్ని గురించి ప్ర‌ధాన మంత్రి శ్రీ న‌రేంద్ర మోదీ అధ్య‌క్ష‌త‌న జ‌రిగిన కేంద్ర మంత్రివ‌ర్గ స‌మావేశం దృష్టికి తీసుకు రావ‌డ‌మైంది.

ఈ ఎమ్ఒయు లో భాగం గా చేప‌ట్టే కార్య‌క‌లాపాలు ఈ కింది విధంగా ఉన్నాయి:

(i) కొత్త విజ్ఞాన శాస్త్ర సంబంధ ఫ‌లితాల‌ు; 
(ii) నూత‌న సాంకేతిక‌త‌లు; 
(iii) విజ్ఞాన‌శాస్త్ర ప‌ర‌మైన చర్చలను, శిక్షణను పెంచడం ద్వారా సామ‌ర్ధ్యాల‌ నిర్మాణం; 
(iv) సంయుక్త విజ్ఞానశాస్త్ర ప‌థ‌కాలు మొదలైనవి.

ఈ ఎమ్ఒయు లో భాగం గా అమ‌లుచేసే సంయుక్త ప‌రిశోధ‌న ప‌థ‌కాలు, శిక్ష‌ణ కార్య‌క్ర‌మాలు, స‌మ్మేళనాలు, చ‌ర్చాస‌భ‌లు మొద‌లైన వాటిలో పాలుపంచుకొనేందుకు అర్హులైన శాస్త్రవేత్త‌లు, విద్యార్థులు, సాంకేతిక నిపుణులు అందరికీ అవ‌కాశాల‌ను ఇవ్వ‌డం జ‌రుగుతుంది.  దీనికిగాను విజ్ఞాన‌శాస్త్ర సంబంధ ప్ర‌తిభ‌ను, అనుభ‌వాన్ని ఏకైక ప్రాతిప‌దిక‌ గా తీసుకోనున్నారు. ఈ విధమైన భాగస్వామ్యం లో సెగ్మెంటెడ్ టెలిస్కోప్ టెక్నాల‌జీస్ ను, అలాగే రోబోటిక్ టెలిస్కోప్ ను అభివృద్ధి చేయ‌డం సహా భ‌విష్య‌త్తు లో ఇతర నిర్ధిష్ట స‌హ‌కారాలకు ఉన్న సంభావ్య‌త‌లను లెక్క‌ లోకి తీసుకోవ‌డం జ‌రుగుతుంది.
 

***


(Release ID: 1670052) Visitor Counter : 228