వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
పెట్టుబడులపై ఇండియా-యుఎయి ఉన్నతస్థాయి సంయుక్త టాస్క్‌ఫొర్స్ 8 వసమావేశం
Posted On:
03 NOV 2020 5:21PM by PIB Hyderabad
పెట్టుబడులపై ఇండియా-యుఎఇ ఉన్నతస్థాయి 8వ సంయుక్త సమావేశాన్ని
(జాయింట్ టాస్క్‌ఫొర్స్) ఇండియా నిన్న ఏర్పాటు చేసింది. కోవిడ్ -19 మహమ్మారి నేపథ్యంలో వర్చువల్ పద్ధతిలో దీనిని ఏర్పాటు చేశారు.
ఈ సమావేశానికి రైల్వేలు, వాణిజ్యం, పరిశ్రమలు, వినియోగదారుల వ్యవహారాలు, ప్రజాపంపిణీ శాఖ మంత్రి శ్రీ పియూష్ గోయల్ సహ ఛైర్మన్‌గా వ్యవహరించారు.ఎమిరేట్ ఆఫ్ అబుదాబి ఎక్సిక్యుటివ్ కౌన్సిల్ సభ్యుడు షేక్ హమెద్‌బిన్ జాయేద్ అల్‌నహ్యాన్, ఇతర సీనియర్ అధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.
ఈ జాయింట్ టాస్క్‌ఫోర్సును 2012లో ఏర్పాటు చేశారు. ఈ కీలక వేదిక ఇప్పటికే ఇండియా ,యుఎఇల మధ్యబలంగా ఉన్న ఆర్ధిక బంధాన్ని మరింత బలోపేతం చేస్తున్నది. ఇరు దేశాలూ 2017 జనవరిలో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య ఒప్పందంపై సంతకాలు చేయడంతో ఈ వ్యవస్థ మరింత ప్రాధాన్యతను సంతరించుకుంది.
జాయింట్ టాస్క్‌ఫోర్సు సాధించిన సానుకూల ఫలితం, ఈరోజు వరకు ద్వైపాక్షిక వాణిజ్యం,పెట్టుబడుల స్థాయిలో ఇరువైపులా సంతృప్తి వ్యక్తం అయింది ఇండియా, యుఎఇలలోని కీలక రంగాలలో పెట్టుబడులు పెట్టేందుకు మరిన్ని అవకాశాలను పరిశీలించేందుకు ఉభయపక్షాలూ అంగీకరించాయి. ఇది ఆర్ధిక ప్రగతికి,చర్చలు కొనసాగించడానికి,జాయింట్ స్టాక్ ఫోర్సుచెప్పుకోదగిన స్థాయిలో విజయాలు సాధించడానికి దోహదకారికానుంది.
ప్రస్తుత తాజా జాయింట్ టాస్క్‌ఫోర్స్ సమావేశంలో ఇరువైపులా కోవిడ్-19కుసంబంధించిన సవాలుతో కూడిన పరిస్థితులను కల్పించిచన విషయాన్ని ఉభయ పక్షాలూ అంగీకరించాయి. మరీ ముఖ్యమైన విషయం ఏమంటే ,పరస్పర ప్రయోజనకరమైన అంశాల విషయంలో సహరించుకోవాలని,పెట్టుబడులను ప్రోత్సహించాలని,ఆర్ధికవ్యవస్థ కార్యకలాపాలను వేగవంతం చేసేందుకు చర్యలు తీసుకోవాలని నిర్ణయించారు.
ఇందుకు సంబంధించి వివిధరంగాలకు సంబంధించిన అన్నిఅంశాలపై చర్చించారు. అలాగేపరస్పరం ఆసక్తిగల అంశాలు, 8 వ టాస్క్‌ఫోర్స్ సమావేశం సందర్భంగా భారతదేశం ప్రతిపాదించిన అంశాలపై చర్చజరిగింది.
ఇరుదేశాల మధ్య అద్బుత స్థాయిలో వాణిజ్య , ఆర్ధిక సంబంధాలు బలోపేతం చేసేందుకు, ఇరుదేశాల మధ్య వాణిజ్యపరమైన అడ్డంకులను తొలగించడంపై దృష్టిపెట్టాల్సిన విషయాన్నిపునరుద్ఘాటించారు. యాంటీ డంపింగ్ డ్యూలీలు,సంబంధిత చర్యలు, టారిఫ్, రెగ్యులేటరీ ఆంక్షలు తదితర అంశాలు ఇందులో ఉన్నాయి. ఈ దిశగా ఇరువైపులా తమ కృషిని సమన్వయం చేసుకోవాలని నిర్ణయించారు.పరస్పర సహకారానికి సంబంధించి ఉన్నతస్థాయిలో యాంటీ డంపింగ్ వంటి అంశాలపై పరస్పర సహకరాన్ని కొనసాగించడానికి , పరస్పర ప్రయోజనకరస్థాయిలో పరిష్కారాలు కనుగొనేందుకు ప్రయత్నించాలని నిర్ణయించారు.
ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడులను పెంపొందించడానికి సంబంధించి వివిధ రంగాలను యుఎఇ గుర్తించింది.
ప్రస్తుత యుఎఇ స్పెషల్ డెస్క్ (యుఎఇ ప్లస్), 2018లో పెట్టుబడులకు వీలుకల్పించడానికి, యుఎఇ ఇన్వెస్టర్లు ఇండియాలో పెట్టుబడులు పెట్టడంలో ఎదుర్కొంటున్న సవాళ్లను పరిష్కరించేందుకు ఏర్పాటు చేసిన ఫాస్ట్ ట్రాక్ మెకానిజం తదితరాలపై ఇరువైపులా సమీక్షనిర్వహించారు.ఈ యంత్రాంగాలను వీలైనంత సమర్ధంగా వినియోగించుకుంటూ, ద్వైపాక్షిక సహకారాన్ని మరింత ముందుకు తీసుకుపోవాలని ఇరువైపులా నిర్ణయించారు.
ఇరుదేశాల ఆర్ధిక వ్యవస్తలలో పౌరవిమానయానానికి గల కీలక ప్రాధాన్యతను గుర్తిస్తూ ,ఇరువైపులా గల పౌరవిమానయాన అధికారులు, ప్రాధాన్యతాప్రాతిపదికన , ఉభయ దేశాల ఉమ్మడి ప్రయోజనాలకు అనుగుణంగా ,రెండు దేశాల మధ్య రవాణా కార్యకలాపాలను త్వరగా సాధారణ స్థితికి తెచ్చేందుకు అంగీకరించారు.
యుఎఇ ఆధారిత ఫండ్‌లు ఇండియాలో పెట్టుబడులు పెట్టడానికి సంబంధించి ఉభయపక్షాలూ చర్చించాయి. అలాగే 2019 సెబి విదేశీ పోర్టుఫోలియొ ఇన్వెస్టర్ రెగ్యులేషన్ల నేపథ్యంలోవీటినిచర్చించారు. యుఎఇ ఫండ్‌లను నేరుగా ఇండియాలో పెట్టుబడులు పెట్టేలా చూసేందుకు ,ఈ విషయంలొ పరస్పరం ప్రయోజనకరమైన పరిష్కారాన్ని కనుగొనేందుకు , ఇందుకు సంబంధించిన అంశాలను పరిశీలించేందుకు ఇండియా అంగీకరించింది.
ఇండియాలో కీలక రంగాలలో పెట్టుబడులు,పరస్పర సహకారానికి గల అవకాశాలు వంటి ఇతర కీలక అంశాలపై ఈ సమావేశంలో చర్చించారు. అలాగే ఆరోగ్య సంరక్షణ, ఫార్మా పరిశ్రమ,రాకపోకలు, లాజిస్టిక్స్,ఆహారం,వ్యవసాయం,ఇంధనం,తదితర అంశాలపై ఈ సమావేశంలో దృష్టిపెట్టారు.
టాస్క్‌ఫోర్సు 8 వసమావేశంపై వ్యాఖ్యానిస్తూ కేంద్ర రైల్వే, వాణిజ్యం, పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ పియూష్ గోయల్,
“ ఈ జాయింట్ టాస్క్‌ఫొర్సు యుఎఇతో మన సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్యంలో అంతర్గతంగా భాగం.ఇండియా అద్భుతమైన ప్రగతిపథంలో ముందుకు సాగుతున్నది. దేశ ఆర్ధిక వ్యవస్తకు సంబంధించిన వివిధ రంగాలు చెప్పుకోదగని ముందంజలో ఉన్నాయి.యుఎఇ, భారతదేశ ఆర్ధికవ్యవస్థకు చ ఎందిన వివిధ రంగాలలో నిలకడగా పెట్టుబడులు పెడుతున్నదేశం. మన అభివృద్ధి ప్రయాణంలో యుఎఇ ఒక విలువైన భాగస్వామి. మనం యుఎఇ పెట్టుబడులకు అత్యధిక ప్రాధాన్యతను ఇస్తాం.యుఎఇ ఇన్వెస్టర్లకు మార్గం సుగమం చేసేందుకు అవసరమైన ప్రగతిదాయక చర్యలను మనం క్రమంతప్పకుండా తీసుకుంటూ వస్తున్నాం ”అని ఆయన అన్నారు.
సమావేశం ముగింపు సందర్భంగా హిజ్‌హైనెస్ షేక్ హమెద్ బిన్‌జాయెద్ అన్ నెహ్యాన్ తన అభిప్రాయం వ్యక్తం చేస్తూ, “ గడచిన దశాబ్దం యుఎఇ, ఇండియా ఆర్ధిక సంబంధాలలో సానుకూల పరివర్తన కనిపించింది. ఈ విజయానికి గత ఎనిమిది సంవత్సరాలుగా ఈ టాస్క్‌ఫోర్సుచేసిన కృషి ఎంతో కీలకమైనది. ఇటీవలి నెలలు అందరికీ ఎంతో క్లిష్టమైనవి అయినప్పటికీ, మేం ఈరోజు మా ఉభయదేశాల మధ్య పరస్పర సహకారానికి సంబంధించి తదుపరి దశ అజెండా కు ఆశావహ లక్ష్యాలను నిర్ణయించడం జరిగింది. రాగల సంవత్సరాలలో ఇరుదేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం, పెట్టుబడుల విషయంలో మేం తిరిగి చెప్పుకోదగిన వృద్ధిసాధించగలమన్నవిశ్వాసం నాకు ఉంది” అని ఆయన అన్నారు.
***
(Release ID: 1669953)
Visitor Counter : 231