యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ

విలువిద్య క్రీడాకారుల సహయక సిబ్బందిలో ఒకరికి కొవిడ్‌ పాజిటివ్‌, శిక్షణ శిబిరం తాత్కాలిక రద్దు

Posted On: 03 NOV 2020 5:01PM by PIB Hyderabad

పుణెలోని సైనిక క్రీడాకేంద్రంలో శిక్షణలో ఉన్న జాతీయ విలువిద్య బృందానికి కేటాయించిన సహాయక సిబ్బందిలో ఒకరు కరోనా పాజిటివ్‌గా నిర్ధరణ అయ్యారు. గతనెల 30వ తేదీన ఈ విషయం వెల్లడైంది. కరోనా విషయం తెలియగానే ఆ ఉద్యోగిని 14 రోజుల క్వారంటైన్‌కు పంపారు. సదరు ఉద్యోగి అక్టోబర్‌ 7వ తేదీన శిక్షణ శిబిరానికి వచ్చారు. 9 రోజులపాటు శిక్షణ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. భారత క్రీడా ప్రాధికార సంస్థ సూచించిన ప్రామాణిక కార్యచరణ విధానాల ప్రకారం, క్వారంటైన్‌ సమయంలో ఆ ఉద్యోగికి రెండుసార్లు ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షలు నిర్వహించారు. శిబిరంలో చేరకముందు ఆ ఉద్యోగి చేయించుకున్న పరీక్షల్లో నెగెటివ్‌ వచ్చింది. పుణెలోని ప్రత్యేక కొవిడ్‌ ఆసుపత్రిలో ఆయనకు చికిత్స అందిస్తున్నారు.

    సహాయక ఉద్యోగికి కొవిడ్‌ నేపథ్యంలో, శిబిరాన్ని అక్టోబర్‌ 31, నవంబర్‌ 1వ తేదీల్లో రద్దు చేశారు. ఆ రెండు రోజులపాటు అన్ని జాగ్రత్తలు తీసుకున్నారు. క్యాంపునకు వచ్చినవారిని వారి గదులకే పరిమితం చేశారు. ఉష్ణోగ్రత పర్యవేక్షణ సహా అన్ని జాగ్రత్తల తర్వాత నవంబర్‌ 2వ తేదీ నుంచి శిబిరం పునఃప్రారంభమైంది. జాతీయ క్రీడాకారులందరికీ శాయ్‌ ఆర్టీ-పీసీఆర్‌ పరీక్షలు చేయిస్తోంది.

***


(Release ID: 1669901) Visitor Counter : 157