చట్ట, న్యాయ మంత్రిత్వ శాఖ
మరో మైలురాయిని చేరుకున్న 'టెలీ-లా'; సీఎస్‌సీల ద్వారా న్యాయ సలహాలు పొందిన 4 లక్షల మంది లబ్ధిదారులు
ఈ ఏడాది మార్చి 31 వరకు 1.95 లక్షల న్యాయ సలహాలు; ఏప్రిల్ నుంచి ఈ ఏడు నెలల్లో 2.05 లక్షల న్యాయ సలహాలు
Posted On:
03 NOV 2020 3:17PM by PIB Hyderabad
'టెలీ-లా' కొత్త మైలురాయిని చేరుకుంది. ఈ ఏడాది అక్టోబర్ 30 వరకు, సాధారణ సేవ కేంద్రాల (సీఎస్‌సీ) ద్వారా 4 లక్షల మంది లబ్ధిదారులు న్యాయ సలహాలు పొందారు. ఈ కార్యక్రమం ప్రారంభం నాటి నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు 1.95 లక్షల మంది లబ్ధి పొందగా, ఏప్రిల్ 1 నుంచి ఈ ఏడు నెలల్లో మరో 2.05 లక్షల మందికి న్యాయ సలహాలు అందాయి.
"డిజిటల్ ఇండియా విజన్"లో భాగంగా, అందరికీ న్యాయాన్ని అందుబాటులోకి తేవడానికి, కేంద్ర న్యాయ విభాగం వర్ధమాన, స్వదేశీ డిజిటల్ వేదికలను ఉపయోగిస్తోంది. ఈ లక్ష్య సాధనలో భాగంగా, కేసుల దాకా వెళ్లకుండా వివాదాలను పరిష్కరించేందుకు 'టెలీ-లా' కార్యక్రమాన్ని 2017లో ప్రారంభించింది. ఈ కార్యక్రమంలో భాగంగా; పంచాయతీ స్థాయిలో, సాధారణ సేవ కేంద్రాల ద్వారా వీడియో కాలింగ్ లేదా టెలిఫోన్ సదుపాయం అందుబాటులో ఉంటుంది. వీటి ద్వారా ప్రజలు న్యాయవాదులకు ఫోన్ లేదా వీడియో కాల్ చేసి సరైన సమయంలో విలువైన న్యాయ సలహా పొందవచ్చు.
న్యాయ వివాదాలను ముందుగానే గుర్తించి, చర్యలు తీసుకుని, పరిష్కరించడానికి 'టెలీ-లా'ను ప్రత్యేకంగా రూపొందించారు. నాల్సా, సీఎస్‌సీ-ఈ గోవ్ అందించే వాలంటీర్ల ద్వారా టెలీ-లా సేవ ముందుగానే ప్రజలకు అందుతుంది. క్షేత్ర స్థాయి కార్యక్రమానికి దరఖాస్తుదారుల ముందస్తు నమోదు, అపాయింట్‌మెంట్ ఖరారు కోసం వాలంటీర్లకు మొబైల్ యాప్ ఉంటుంది. ప్రజలకు నిరంతర న్యాయ సలహాలు అందించేందుకు నిబద్ధత గల న్యాయవాదుల బృందం అందుబాటులో ఉంటుంది. https://www.tele-law.in ద్వారా అభివృద్ధి పరిచిన ఐఈసీని యాక్సెస్ చేయవచ్చు. వాస్తవ సమయ సమాచారం, అందించిన సలహా తీరును చూసేందుకు ప్రత్యేక డాష్ బోర్డును వృద్ధి చేశారు. భవిష్యత్తులో జిల్లా స్థాయి సమాచారాన్ని నిర్ధరించడానికి, 'వీఎంవో ప్రయాస్ పోర్టల్'కు సమాచారాన్ని బదిలీ చేశారు.
***
(Release ID: 1669868)
Visitor Counter : 274