ఆర్థిక మంత్రిత్వ శాఖ
బ్యాంకులు విధించిన సర్వీసు ఛార్జీలకు సంబంధించి వాస్తవ స్థితి
Posted On:
03 NOV 2020 2:59PM by PIB Hyderabad
కొన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు సర్వీసు ఛార్జీలను పెంచనున్నాయని పలు పత్రికలలో వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో, వాస్తవాలను బ్యాంకులు వివరించాయిః
జన్‌ధన్ ఖాతాలతో సహా బేసిక్ సేవింగ్స్ బ్యాంకు డిపాజిట్ల (BSBD) విషయంలో- పేదలు, సమాజంలోని బ్యాంకు అకౌంట్లు లేని వర్గాలు తెరిచిన 41.13 కోట్ల జనధన్ అకౌంట్లు సహా ప్రస్తుతం ఉన్నమొత్తం 60.04 కోట్ల బిఎస్‌బిడి అకౌంట్లకు రిజర్వు బ్యాంకు ఆఫ్ ఇండియా పేర్కొన్న ఉచిత సేవల ప్రకారం సర్వీసు ఛార్జీలు వర్తించవు.
ఇక సాధారణ పొదుపు ఖాతాలు, ప్రస్తుత ఖాతాలు (కరెంట్ అకౌంట్లు), క్యాష్ క్రెడిట్ అకౌంట్లు, ఓవర్‌డ్రాఫ్ట్ అకౌంట్లకు వస్తే - చార్జీలు పెంచనప్పటికీ, బ్యాంక్ ఆఫ్ బరోడా నవంబర్ 1, 2020 నుంచి నెలవారీగా వేసే ఉచిత నగదు డిపాజిట్లు, ఉపసంహరణల సంఖ్యకు సంబంధించి కొన్ని మార్పులు చేసింది. నెలకు 5గా ఉన్న నగదు డిపాజిట్లు, ఉపసంహరణల సంఖ్యను 3కు కుదించింది. అయితే, ఈ ఉచిత లావాదేవీలను మించి చేసే లావాదేవీలపై చార్జీలలో ఎటువంటి మార్పు చేయలేదు.
ప్రస్తుతం కోవిడ్ కు సంబంధించిన పరిస్థితుల నేపథ్యంలో, తాము ఈ మార్పులను ఉపసంహరించుకోవాలనుకుంటున్నట్టు బ్యాంక్ ఆప్ బరోడా వెల్లడించింది. అంతేకాదు, ఇటీవలి కాలంలో పిఎస్‌బి అటువంటి ఛార్జీలను ఏ విధంగానూ పెంచలేదు.
ఆర్‌బిఐ మార్గదర్శకాల ప్రకారం ప్రభుత్వ రంగ బ్యాంకులు సహా అన్ని బ్యాంకులు తమ సేవలకు ఛార్జీలను నిజాయితీగా, పారదర్శకంగా, ఎటువంటి వివక్షలేని విధంగా ఖర్చుల ఆధారంగా వసూలు చేసేందుకు అనుమతి ఉంది. కాగా, ఇతర ప్రభుత్వ రంగ బ్యాంకులు కోవిడ్ సంక్షోభాన్ని దృష్టిలో ఉంచుకుని సమీప భవిష్యత్తులో బ్యాంకు చార్జీలు పెంచే ప్రతిపాదన చేయబోమని వెల్లడించాయి.
***
(Release ID: 1669767)
Visitor Counter : 326
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam