ఆయుష్

ఆయుర్వేదంతో కంటి నిండా నిద్ర ఆయర్వేదంతో నిద్రలేమికి దూరం

Posted On: 03 NOV 2020 12:31PM by PIB Hyderabad

కంటినిండా నిద్ర లేకపోవడం... నిపుణులు చెబుతున్న విధంగా రోజుకి కనీసం ఏడు నుంచి ఎనిమిది గంటలపాటు సుఖంగా నిద్ర పోవకపోవడం వల్ల ప్రతి ఒక్కరూ దాదాపుగా సమస్యలను ఎదుర్కొంటున్నారు. నిద్ర లేమి వల్ల అనేక సమస్యలతో సతమతమవుతున్నారు. ఇలాంటి వార్తలు ఇటీవల కాలంలో ఎక్కువగా వస్తున్నాయి. ఇవన్నీ అన్ని వర్గాలకు చెందిన ప్రజలకు ఆందోళన కలిగిస్తున్నాయి. అయితే, భారత సాంప్రదాయ వైద్య ప్రక్రియలలో ఒకటైన ఆయర్వేద వైద్యం ఒక శుభవార్తను వినిపించింది. ఆయుర్వేదంలో నిద్రలేమి తనానికి చికిత్స ఉందని వెల్లడయింది. ఆయుర్వేద వైద్యశాస్త్రంలో నిద్రలేమిని ' అనిద్ర' అని వ్యవహరిస్తారు. షిల్లాంగ్ కేంద్రంగా పనిచేస్తున్న నార్త్ ఈస్ట్రన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద అండ్ హోమియోపతి ప్రచురిస్తున్న ఆయుహమ్ పరిశోధనా జర్నల్ లో నిద్రలేమికి ఆయర్వేదంలో లభిస్తున్న పరిష్కారమార్గాలను సహేతుకంగా ప్రచురించారు. జైపూర్ కేంద్రంగా పనిచేస్తున్న నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద (ఎన్ ఐ ఎ ) లోని పంచకర్మ పీజీ విభాగాధిపతి గోపేష్ మంగళ్, ఇదే సంస్థలో పీజీ స్కాలర్లు నిధి గుప్త, ప్రవేశ్ శ్రీవాస్తవాలతో కలసి నిద్రలేమి అంశంపై పరిశోధన జరిపారు.

నిద్రలేమి వల్ల ఊబకాయం, రోగనిరోధక శక్తి తగ్గిపోవడం లాంటి ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయి. మానవుని ఆరోగ్యంలో నిద్ర కీలక పాత్ర పోషిస్తుందని వైద్య నిపులులు స్పష్టంగా చెబుతున్నారు. జీవితంలో మూడు కీలక అంశాలలో నిద్ర ఒకటిగా గుర్తింపు పొందింది. మనిషి ఆరోగ్యంగా, సంతోషంగా, ఉల్లాసంగా ఆనందంగా జీవించాలంటే అతనికి తగినంత నిద్ర తప్పనిసరిగా ఉండాలని ఆయర్వేద శాస్త్రం గుర్తించింది. ప్రస్తుతం నిద్రలేమి ( అనిద్ర) ప్రపంచవ్యాపిత ఆరోగ్యసమస్యగా మారిపోయింది.

ప్రజల ఆరోగ్యరంలో నిద్ర ప్రధాన పాత్ర పోషిస్తుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ స్పష్టంగా చెబుతున్నది. తగినంత నిద్రలేని మనిషి శారీకంగా, మానసికంగా దృఢంగా ఉండలేదని ప్రపంచ ఆరోగ్య సంస్థ వివరించింది. అస్తవ్యస్తమైన జీవన విధానాలు , పర్యావరణ అంశాలు, ఒత్తిడి వల్ల అనేకమంది ప్రజలు సుఖనిద్రకు దూరం అవుతున్నారు. అమెరికాకు చెందిన నేషనల్ స్లీప్ ఫౌండేషన్ ఇటీవల నిద్రపై సర్వేను నిర్వహించింది. ప్రపంచంలో 1/3వ వంతు ప్రజలు నిద్రపరమైన సమస్యలను ఎదుర్కొంటున్నారని వెల్లడయింది.

ఈ నేపథ్యంలో అనిద్ర సమస్యను ఆయర్వేదంలో ఒకటైన పంచకర్మ వైద్య చికిత్స ద్వారా పరిష్కరించవచ్చునని వెల్లడయింది. అనిద్రకు ఆయుర్వేదంతో వైద్యాన్ని అందించవచ్చునని ఎన్ ఐ ఎ పరిశోధకులు వెల్లడించారు. ఆయర్వేద చికిత్స ద్వారా అనేక మంది నిద్రలేమికి దూరం అయ్యారని వారు వివరించారు. చికిత్సకు ముందు చికిత్స తరువాత వీరు పరిశోధనలు నిర్వహించారు. ఆవలింతలు, మగత, అలసట,నిద్ర లాంటి అంశాలపై వీరు పరిశోధనలు చేపట్టారు. చికిత్స అందించిన వారందిరిలొ ఈ లక్షణాలు ఆశించిన విధంగా ఉన్నాయని అన్నారు. శమన చికిత్సతో పాటు అశ్వగంధ తైలంతో స్నానం ఆచరిస్తే అనిద్రకు దూరం కావచ్చునని వీరి పరిశోధనల్లో తేలింది.

మూలం :: నార్త్ ఈస్ట్రన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఆయుర్వేద అండ్ హోమియోపతి, షిల్లాంగ్ , మేఘాలయ-793018 ప్రచురించిన ఆయుహమ్ వార్షిక పరిశోధనా జర్నల్ (ISSN 2349-2422)( Vol 6, Issue 1)

***



(Release ID: 1669757) Visitor Counter : 757