ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
భారత్ లో చికిత్స పొందుతున్నవారి సంఖ్య 5.5 లక్షలకు దిగువన
105 రోజుల తరువాత 38,310 కి పరిమితమైన కొత్త కోవిడ్ కేసులు
చికిత్సలో ఉన్నవారికంటే 70 లక్షలు అధికంగా కోలుకున్నవారు
Posted On:
03 NOV 2020 11:01AM by PIB Hyderabad
కోవిడ్ మీద పోరులో భారత్ అనేక కీలకమైన మైలురాళ్ళను అధిగమించింది. గడిచిన 24 గంటలలో కొత్తగా నిర్థారణ అయిన పాజిటివ్ కేసులు 40 వేల దిగువకు పడిపోయాయి. 105 రోజుల తరువాత మొదటిసారిగా ఇలా 38,310 కి తగ్గిపోయాయి. 15 వారాలకిందట గత జులై 22న 37,724 కేసులు మాత్రమే నమొదు కావటం గమనార్హం.
ప్రతిరోజూ పెద్ద సంఖ్యలో కోవిడ్ బాధితులు కోలుకుంటూ ఉండటంతో బాటు మరణాలు కూడా తగ్గుతూ ఉండటం వల్ల భారతదేశం వరుసగా చికిత్సపొందుతూ ఉన్నవారి సంఖ్యను తగ్గించుకుంటు వస్తోంది. ప్రస్తుతం చికిత్సలో ఉన్నవారి సంఖ్య 5.5 లక్షలకంటే తక్కువ స్థాయికి పడిపోవటం కూడా మరోమైలురాయి. ప్రస్తుతం 5,41,405 గా నమోదయ్యాయి. ఇది మొత్తం కేసులలో 6.55% మాత్రమే.
ఫలితాలు ఇలా ప్రోత్సాహకరంగా ఉండటానికి కారణం కేంద్ర ప్రభుత్వం నిర్దేశించిన విధంగా పరీక్షించటం, తగిన నిఘాపెట్టటం, ఆనవాళ్ళు పట్టుకొని వెంటనే ఆస్పత్రికి తరలించటం అనే వ్యూహాన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు సమర్థంగా అమలు చేయటమే. అదే విధంగా కేంద్ర ప్రభుత్వం రూపొందించిన ప్రామాణిక చికిత్సావిధానాలను అవలంబించటం కూడా సత్ఫలితాలకు దారితీసింది.
అదే సమయంలో డాక్టర్లు, పారామెడికల్ సిబ్బందితోబాటు ఈ వ్యవహారాలలో సేవలందించిన ఇతర యోధులు కూడా దేశవ్యాప్తంగా అంకిత భావంతో వ్యవహరించిన తీరు కూదా ఈ విజయానికి కారణమైంది. చికిత్సపొందుతున్నవారి సంఖ్య తగ్గటమంటే కోలుకుంటున్నవారు పెరగటమే. మొత్తం ఇప్పటిదాకా కోలుకున్నవారి సంఖ్య 76 లక్షలు దాటి 76, 03,121 కి చేరగా, కోలుకున్నవారికీ, చికిత్సపొందుతూ ఉన్నవారికీ మధ్య తేడా ఈ రోజు 70 లక్షలు దాటి 70,61,716 కు చేరింది.
గడిచిన 24 గంటలలో 58,323 మంది బాధితులు కోలుకొని డిశ్చార్జ్ అయ్యారు. జాతీయ స్థాయిలో కోలుకున్నవారి శాతం మరింత పెరిగి 91.96% అయింది. కొత్తగా కోలుకున్నవారిలో 80% మంది 10 రాష్ట్రాలలోనే ఉన్నట్టు తేలింది. అందులో మహారాష్ట ఒకే రోజు 10, 000కు పైగా కేసులు నమోదు చేసుకొని మొదటి స్థానంలో ఉండగా 8,000 కు పైగా కేసులతో కర్నాటక రెండో స్థానంలో ఉంది.
కొత్తగా నమోదైన కేసులలో 74% కేవలం పది రాష్ట్రాలకే పరిమితమయ్యాయి. కేరళ, ఢిల్లీ, మహారాష్ట్ర గరిష్ఠంగా 4,000 కేసుల చొప్పున నమోదు చేసుకున్నాయి. 3,000కు పైగా కేసులు వచ్చిన పశ్చిమబెంగాల్ నాలుగో స్థానంలో ఉంది.
గడిచిన 24 గంటలలో 490 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. వీరిలో 80% మంది కేవలం 10 రాష్ట్రాలలోనే కేంద్రీకృతమయ్యారు. మహారాష్ట్రలో అత్యధికంగా ఒక్క రోజులోనే 104 మరణాలు నమోదు కాగా దేశవ్యాప్తంగా కోవిడ్ కేసులలో మరణాలు 1.49 శాతానికి తగ్గాయి.
****
(Release ID: 1669710)
Visitor Counter : 252
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam