భారత పోటీ ప్రోత్సాహక సంఘం
భారతి ఆక్సా జనరల్ ఇన్సూరెన్స్ కొనుగోలుకు ఐసీఐసీఐ లాంబార్డ్‌కు సీసీఐ అనుమతి
Posted On:
02 NOV 2020 6:16PM by PIB Hyderabad
'భారతి ఆక్సా జనరల్ ఇన్సూరెన్స్ లిమిటెడ్' సాధారణ బీమా వ్యాపారాన్ని కొనుగోలు చేయడానికి 'ఐసీఐసీఐ లాంబార్డ్ జనరల్ ఇన్సూరెన్స్ కంపెనీ లిమిటెడ్'కు, 'కాంపిటీషన్ కమిషన్ ఆఫ్ ఇండియా' (సీసీఐ) అనుమతి ఇచ్చింది. పోటీ చట్టం-2002లోని సెక్షన్ 31(1) కింద ఈ అనుమతి లభించింది.
భారత బీమా నియంత్రణ, అభివృద్ధి ప్రాధికార సంస్థ (ఐఆర్‌డీఏఐ) నియమ, నిబంధనలకు లోబడి ఐసీఐసీఐ లాంబార్డ్ సంస్థ నమోదైంది. అనారోగ్యం, వాహన, అగ్ని, వ్యక్తిగత, జల, నిర్మాణ ప్రమాదాలు, అప్పులపై విభిన్న స్థాయుల్లో బీమాను ఈ సంస్థ అందిస్తోంది.
భారతి ఆక్సా కూడా ఐఆర్‌డీఏఐ నియమ, నిబంధనలకు లోబడి నమోదైన సంస్థ. భారతి జనరల్ వెంచర్స్ ప్రైవేట్ లిమిటెడ్ (51 శాతం వాటా), సొసైటీ బ్యూజోన్ (49 శాతం వాటా) జాయింట్ వెంచర్‌గా ఈ సంస్థ పని చేస్తోంది. అనారోగ్యం, వాహన, ప్రయాణ, పంట, గృహ ప్రమాద బీమాలను ఈ సంస్థ అందిస్తోంది.
ఐసీఐసీఐ లాంబార్డ్ నుంచి భారతి ఆక్సాకు వాటాల జారీ పద్ధతిలో, భారతి ఆక్సా సాధారణ బీమా వ్యాపారం మొత్తం ఐసీఐసీఐ లాంబార్డ్‌కు బదిలీ అవుతుంది.
***
(Release ID: 1669620)
Visitor Counter : 198