గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
ట్రైబ్స్ ఇండియా ఉత్పత్తుల శ్రేణిలో అదనంగా మరో 100 సహజ తాజా అటవీ, సేంద్రీయ ఉత్పత్తులు
Posted On:
02 NOV 2020 3:52PM by PIB Hyderabad
ట్రైబ్స్ ఇండియా ఉత్పత్తుల శ్రేణిలో అదనంగా మరో 100 సహజమైన తాజా అటవీ, సేంద్రీయ ఉత్పత్తులు ఆన్‌లైన్ ద్వారా అందుబాటులోకి వచ్చాయి. అక్టోబర్ 26, 2020 నుండి ట్రైబ్స్ ఇండియా వారానికి 100 కొత్త ఉత్పత్తులను చేర్చడం ద్వారా తన ఉత్పత్తుల పరిధిని మరియు జాబితాను విస్తరిస్తూ వస్తోంది. ఈ ఉత్పత్తులు/ ఉత్పదకాలు 125 ట్రైబ్స్ ఇండియా అవుట్లెట్లు, ట్రైబ్స్ ఇండియా మొబైల్ వ్యాన్లు మరియు ట్రైబ్స్ ఇండియా ఈ-మార్కెట్ ప్లేస్ (ట్రైబ్సిండియా. కామ్) మరియు ఈ-టైలర్స్ వంటి ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్‌లలో లభిస్తాయి. ఈ సందర్భంగా టీఆర్ఐఎఫ్ఈడీ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ప్రవీర్ కృష్ణ మాట్లాడుతూ “మా కేటలాగ్‌లో చేర్చబడిన 10099 సేంద్రీయ, అవసరమైన సహజ రోగనిరోధక శక్తిని పెంచే ఉత్పత్తులలో ఇది రెండవ సెట్. దేశవ్యాప్తంగా గిరిజనులను (చేతివృత్తులవారు మరియు అటవీ నివాసులను) ప్రోత్సహించడం మరియు సాధికారతనివ్వడం, ఆత్మనిర్బర్ భారత్‌ను సృష్టించడం మా నిరంతర ప్రయత్నం.” అని అన్నారు. ఈ రోజు అందుబాటులోకి తెచ్చిన కొత్త ఉత్పత్తులలో దేశంలోని వివిధ ప్రాంతాల నుండి సమీకరించిన ఉత్పత్తులు ఉన్నాయి. ఇందులో జార్ఖండ్ తెగల వారి నుంచి సమీకరించిన గోరా బియ్యం, కాల్చిన మరియు సాదా కుర్తీ పప్పు; దక్షిణ భారతదేశ తెగలు సమీకరించే
తేనె టీగల నుంచి చ్చే సౌందర్య ఉత్పత్తుల యొక్క కొత్త శ్రేణి, రాగి ఉత్పత్తుల శ్రేణి; అస్పాం మరియు ఈశాన్య భారతానికి చెందిన వారి సమీకరణలైన పొడి మిరపకాయ, నల్ల బియ్యం, మేజిక్ బియ్యం, అస్సాం టీ; ఉత్తరాఖండ్ గిరిజనుల ఉత్పత్తులైన ఫ్లోర్ లాంప్స్, టేబుల్ మాట్స్, కొన్ని రకాల బుట్టలు వంటి అందమైన వెదురు ఉత్పత్తులు, గుల్కండ్ తేనె తదితర ఉత్పత్తులు ఉన్నాయి. హిమచల్ ప్రదేశ్ లోని కిన్నౌర్ తెగల నుండి కిన్నౌరి వాల్నట్, బాదం మరియు రాజ్మా వంటి తాజా ఉత్పత్తులు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. భారతదేశంలోని వివిధ తెగల నుండి సమీకరించిన వివిధ రకాల బియ్యాన్ని (మేజిక్, ఎరుపు, గోరా, నలుపు) కూడా ఇప్పడు అందుబాటులోకి తేవడం జరిగింది. వారానికొకసారి ఈ కొత్త ప్రత్యేకమైన ఉత్పత్తులను మార్కెట్ చేసేలా అందుబాటులోకి తేవడంతో వినియోగదారులకు మరియు గిరిజన జనాభాకు సానుకూల ప్రయోజనం లభించనుంది. దీనికి తోడు మరోవైపు ప్రకృతి బహుమతి అయిన స్వచ్ఛమైన సహజ ఉత్పత్తులు, దేశవ్యాప్తంగా కుటుంబాలకు చేరువకానుంది. ఇది గిరిజన జీవనోపాధికి తోడ్పడుతుంది. ఈ సమస్యాత్మక సమయంలో స్థానిక గిరిజనుల కోసం 'గో వోకల్ ఫర్ లోకల్' అనే మంత్రం (నినాదం) స్వీకరించడమైంది. ట్రిఫెడ్ అనేక కొత్తకొత్త కార్యక్రమాలను ప్రారంభించడం ద్వారా బాధిత మరియు బాధిత గిరిజన ప్రజల పరిస్థితిని చక్కదిద్దేందుకు గాను ప్రయత్నిస్తోంది.టీఆర్ఐఎఫ్ఈడీ తన ప్రధాన కార్యక్రమాల అమలులతో పాటుగా ఆయా వినూత్న కార్యక్రమాల్ని చేపడుతూ బాధితులకు ఉపశమనం కల్పిస్తోంది.
****
(Release ID: 1669615)
Visitor Counter : 141