ప్రధాన మంత్రి కార్యాలయం

జాతీయ ఐక్యతా దినోత్సవం సందర్భంగా గుజరాత్‌లోని కెవాడియాలో జరిగిన కార్యక్రమంలో ప్రధాన మంత్రి ప్రసంగ పాఠం

Posted On: 31 OCT 2020 1:54PM by PIB Hyderabad

ఉక్కుమనిషి సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ ను వాణీప్రసాదం రూపంలో మనం ఇప్పుడే దర్శించాం. నేను మాట్లాడే ముందు, మీ అందరితో భారత్ మాతా కి జై జయఘోష నినాదాన్ని పలికిస్తాను, మీ అందరితో ,యూనిఫార్మ్ ధరించిన జవాన్లు, సుదూర పర్వతాలపై కూర్చున్న నా గిరిజన సోదర సోదరీమణులు సర్దార్ సాహెబ్‌ను పూర్తి శక్తితో స్మరించుకుంటూ ఒక చేయి పైకి ఎత్తి 'భారత్ మాతాకి జై' నినాదాన్ని పలకాలని కోరుతున్నాను. నేను మూడు సార్లు మీతో పలికిస్తాను. 
పోలీసు బలగానికి చెందిన ధైర్య వంతులైన కుమారులు, కుమార్తెల కోసం - భారత్ మాతా కి జై!
కరోనా కాలంలో సేవలను అందించిన కరోనా వారియర్స్ కోసం - భారత్ మాతా కి జై!
స్వావలంబన సాధించేందుకు తమ సంకల్పం తో కృషి చేస్తున్న బిలియన్ల మంది ప్రజల కోసం - భారత్ మాతా కి జై!
నేను సర్దార్ పటేల్ అని చెబుతాను, మీరు రెండు సార్లు అమర్ రహే- అమర్ రహే అని అనాలి.  
సర్దార్ పటేల్........ అమర్ రహే- అమర్ రహే
సర్దార్ పటేల్........ అమర్ రహే- అమర్ రహే
సర్దార్ పటేల్........ అమర్ రహే- అమర్ రహే
దేశ ప్రజలందరికీ సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ జయంతి శుభాకాంక్షలు.
దేశంలోని వందలాది సంస్థానాలను ఏకీకృతం చేసి, దేశ వైవిధ్యాన్ని స్వతంత్ర భారత శక్తిగా మార్చి సర్దార్ పటేల్ భారతదేశానికి ప్రస్తుత రూపాన్ని చ్చాడు...


2014 లో, మనమందరం ఆయన పుట్టినరోజును భారత ఐక్యత పండుగగా జరుపుకోవడం ప్రారంభించాము. ఈ 6 సంవత్సరాలలో, గ్రామాల నుండి మహానగరాల వరకు, తూర్పు నుండి పశ్చిమం  వరకు, కాశ్మీర్ నుండి కన్యాకుమారి వరకు, ప్రతి ఒక్కరూ 'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్' సంకల్పాన్ని సాకారం చేసేందుకు ప్రయత్నించారు. ఈ రోజు మరోసారి ఈ దేశం ఉక్కు మనిషి , భారతమాత గొప్ప కుమారుడికి భక్తి శ్రద్ధలతో నివాళులర్పిస్తోంది.

మరోసారి ఈ దేశం సర్దార్ పటేల్ ఆకాశహర్మ్యం విగ్రహం నీడలో దేశ ప్రగతికి మహాయజ్ఞ ప్రతిజ్ఞను తీసుకుంటోంది. మిత్రులారా, నేను నిన్న మధ్యాహ్నం కెవాడియా చేరుకున్నాను. కెవాడియాలో ప్రారంభమైనప్పటి నుండి, కెవాడియాలో జంగిల్ సఫారి పార్క్, ఏక్తా మాల్, చిల్డ్రన్ న్యూట్రిషన్ పార్క్, ఆరోగ్య వనం వంటి అనేక కొత్త ప్రదేశాలు ప్రారంభించబడ్డాయి. చాలా తక్కువ సమయంలో, సర్దార్ సరోవర్ ఆనకట్టతో అనుబంధించబడిన ఈ అద్భుతమైన నిర్మాణం 'ఏక్ భారత్ శ్రేష్ఠ భారత్' స్ఫూర్తితో నవ భారతదేశం పురోగతికి ఒక తీర్థయాత్రగా మారింది. రాబోయే కాలంలో, మా నర్మదా ఒడ్డున, ఈ ప్రదేశం భారతదేశం మాత్రమే కాకుండా మొత్తం ప్రపంచం యొక్క పర్యాటక పటంలో తనదైన స్థానాన్ని పొందబోతోంది. ఇది అందరికీ ఇష్టమైన ప్రదేశంగా మారబోతోంది.

ఈ రోజు, సర్దార్ సరోవర్ నుండి సబర్మతి రివర్ ఫ్రంట్ వరకు సముద్ర-విమాన సర్వీసును కూడా ప్రారంభించబోతున్నారు.. ఇది దేశంలో మొట్టమొదటి, ప్రత్యేకమైన సముద్ర-విమానయాన సేవ. సర్దార్ సాహెబ్ దర్శనం కోసం, ఐక్యతా విగ్రహం చూడటానికి, దేశస్థులు ఇప్పుడు సముద్ర-విమాన సేవ యొక్క ఎంపికను కూడా పొందుతున్నారు. 

ఈ ప్రయత్నాలన్నిటితో, 
ఈ ప్రాంతంలో పర్యాటకాన్ని బాగా ప్రోత్సహించబోతున్నాయి.
ఇది ఇక్కడి ప్రజలకు, నా గిరిజన సోదరులకు కొత్త ఉపాధి అవకాశాలను ఇస్తుంది.
ఈ అవకాశాలను కల్పించినందుకు గుజరాత్ ప్రభుత్వాన్ని, గుజరాత్ పౌరులందరినీ, దేశంలోని 130 కోట్ల మంది ప్రజలను అభినందిస్తున్నాను.

మిత్రులారా, నిన్న నేను రోజంతా ఈ ప్రాంతం చుట్టూ తిరుగుతున్నప్పుడు మరియు చుట్టుపక్కల గ్రామాల నుండి నా కుమార్తెలు నన్ను గైడ్ల రూపంలో మార్గనిర్దేశం చేస్తున్నప్పుడు, అన్ని ప్రశ్నలకు విశ్వాసంతో , లోతైన సమాచారంతో సమాధానమిస్తున్నప్పుడు, నేను నిజాయితీగా చెప్పగలను, నేను చాలా గర్వపడ్డాను! నా దేశంలోని గ్రామాల్లోని గిరిజన అమ్మాయిల సామర్థ్యం,  క్షమత మనస్సును సంతోషపెట్టే విధంగా ఉన్నాయి. ఇంత తక్కువ వ్యవధిలో ఈ పిల్లలందరూ సాధించిన నైపుణ్యాలను చూసి నేను చాలా సంతృప్తిగా ఉన్నాను. ఇప్పుడు దానికి కొత్త రకమైన నైపుణ్యం జోడించబడింది. ఈ పనికి 'ప్రొఫెషనలిజం' జోడించారు. ఈ రోజు, నేను ఈ గిరిజన అమ్మాయిలందరినీ హృదయపూర్వకంగా అభినందిస్తున్నాను.

మిత్రులారా, మహర్షి వాల్మీకి జయంతి కూడా ఈ రోజు ఉండటం ఒక అద్భుతమైన యాదృచ్ఛికం. నేడు భారతదేశంలో మనం అనుభవిస్తున్న సాంస్కృతిక ఐక్యత, శతాబ్దాల క్రితం ఆదికవి మహర్షి వాల్మీకి మరింత ఉత్సాహంగా, శక్తివంతంగా చేశారు. శ్రీరామచంద్రప్రభువు ఆదర్శాలు, రాముని సంస్కారాలు, నేడు మనం భారతదేశం నలుమూలలా ఒకదానితో ఒకటి అనుసంధానం చేస్తున్నాం అంటే ఆ ఘనత అంతా వాల్మీకి మహర్షి కి చెందుతుంది. దేశాన్ని, మాతృభూమిని అన్నిటికంటే మిన్నగా పరిగణించాలన్న మహర్షి వాల్మీకి చెప్పిన  'జనని జన్మభూమి స్వర్గాదపి గరియసీ' (తల్లి, మాతృభూమి  స్వర్గం కంటే చాలా గొప్పవి) అనే మంత్రం నేడు దేశమే అన్నిటికంటే ప్రాధాన్యమైనది ( 'ఇండియా ఫస్ట్') ప్రతిజ్ఞకు బలమైన పునాది. 

మహర్షి వాల్మీకి జయంతి సందర్భంగా నా దేశప్రజలందరికీ నా హృదయపూర్వక శుభాకాంక్షలు. తెలియజేస్తున్నాను. మిత్రులు, తమిళ భాష మహాకవి, స్వతంత్ర పోరాట యోధుడు సుబ్రమణ్యం భారతి ఇలా రాశారు: - మన్నం ఇమాయమలై యాంగిల్ మలైయే, మనీల్ మీధు ఇధు పోల్ పిరిదు ఇలలైయే, ఇన్నారు నీర్ గంగై అరేంగల్ ఆరే ఇగితాన్ మన్బీర్ ఎధీర్ధు వేరే, పన్నారుం  ఉపనిత్ నులేంగల్ నులే పర్ మిసాయి అధోరు నూలే ఇడు పోల్, పొన్నోలియార్ భారత్ నాదెంగల్ నాడే పాట్ రువోమ్ ఇగ్తాయ్ మ్కిల్లై ఐడే.

హిందీ అర్థంలో సుబ్రహ్మణ్యం భారతి కవిత యొక్క వివరణ, సుదూర ప్రాంతాల గురించి ఆయన వర్ణన కూడా చాలా స్పూర్తినిస్తుంది.

సుబ్రహ్మణ్యం భారతి వ్యక్తం చేసిన మనోభావాలు ప్రపంచంలోని పురాతన భాష అయిన తమిళంలో వ్యక్తీకరించబడ్డాయి. మరియు భారత మాత గురించి ఆయన ఎంత అద్భుతమైన వివరణ ఇచ్చారు. సుబ్రహ్మణ్యం భారతి ఆ కవితలో దేశ మనోభావాలను వ్యక్తం చేశారు-

శాశ్వతమైన హిమాలయాలు ప్రకాశిస్తాయి, ఇవి మన ఆస్తి .
ఈ భూమిపై దీనితో సమానమైనది ఏది లేదు , ఇది మన ఆస్తి .
గంగా నది ప్రవహించే తీపి ప్రవాహం ..
అలాంటి పవిత్ర ప్రవాహాలు ఎక్కడో ప్రవహిస్తాయా?
ప్రపంచమంతా గౌరవించబడే వేదాల మహిమ ఎంత గొప్పది,
ఇది అమర గ్రంధాల దేశం, ఇది మన ఉపనిషత్తుల దేశం.
మనమందరం ఈ దేశాన్ని ప్రశంసించాలి , ఈ బంగారు దేశం మనది.
మన దేశం కంటే గొప్పది  ఈ ప్రపంచంలో ఏదీ లేదు .
ముందంజలో ఉన్న భారతదేశం మనది !!
ఆలోచించండి, బానిసత్వ యుగంలో సుబ్రహ్మణ్యం భారతి వ్యక్తం చేసిన విశ్వాసాన్ని చూడండి, అతని భావాలు ఎలా వ్యక్తమయ్యాయో చూడండి.

నేడు, నర్మదా నది ఒడ్డున ఉన్న సర్దార్ సాహెబ్ అద్భుతమైన విగ్రహం నీడలో భారతదేశం ఈ అద్భుతమైన అనుభూతిని మనం మరింత దగ్గరగా అనుభవించవచ్చు.

ఇది భారతదేశ బలం, ప్రతి ఆపదను , ప్రతి విపత్తునూ జయించడమూ నేర్పిస్తుంది. గత స౦వత్సర౦, మేము ఈ రోజున ఐక్యతా పరుగులో పాల్గొన్నప్పటి ను౦డి, మానవజాతి మొత్త౦ కరోనా వ౦టి ప్రప౦చ వ్యాప్త మహమ్మారిని ఎదుర్కొ౦టు౦దని ఎవరూ ఊహి౦చలేదు. అకస్మాత్తుగా విపత్తు వచ్చింది. ఇది ప్రపంచవ్యాప్తంగా మానవ జీవితంపై ప్రభావం చూపింది, ఇది మన వేగాన్ని ప్రభావితం చేసింది. కానీ ఈ మహమ్మారి ని ఎదుర్కొంటున్న ప్పుడు, దేశం, 130 కోట్ల మంది దేశప్రజలు తమ సమిష్టి బలాన్ని, వారి సమిష్టి సంకల్పాన్ని నిరూపించిన తీరు అపూర్వం. చరిత్రలో ఎక్కడా లేదు.

కరోనా వారియర్స్ గౌరవార్థం 130 కోట్ల మంది దేశస్థులు ఐక్యమయ్యారు, కాశ్మీర్ నుండి కన్యాకుమారి, లేహ్ నుండి లక్షద్వీప్, అటక్ నుండి కటక్, కచ్ నుండి కొహిమా, త్రిపుర నుండి సోమనాథ్ వరకు 130 కోట్ల మంది దేశస్థులు ఐక్యతా భావాన్ని చూపించారు, ఐక్యతా సందేశం  ఎనిమిది నెలలుగా సంక్షోభాన్ని ఎదుర్కొనేందుకు మాకు బలాన్ని ఇచ్చింది మరియు విజయపథంలో ముందుకు సాగడానికి మాకు శక్తిని ఇచ్చింది. వారి గౌరవార్థం దేశ ప్రజలు దీపాలను వెలిగించారు. దేశం తమ గౌరవాన్ని చాటింది. మన కొరోనా వారియర్స్, మన పోలీసుల సహచరులు, ఇతరుల ప్రాణాలను కాపాడటానికి తమ ప్రాణాలను త్యాగం చేశారు. స్వాతంత్ర్యం తరువాత మానవ సేవ కోసం భద్రత కోసం ప్రాణాలివ్వడం ఈ దేశ పోలీసు దళం ప్రత్యేకత . నా పోలీసు దళానికి చెందిన దాదాపు 35 వేల మంది జవాన్లు స్వాతంత్య్రానంతరం అమరులైనారు. కానీ ఈ కరోనా యుగంలో, సేవ కోసం, ఇతరుల ప్రాణాలను కాపాడటానికి, నా పోలీసు సోదరులు, చాలామంది సేవ చేయడానికి తమను తాము అంకితం చేసుకున్నారు.  ఈ బంగారు క్షణాలను చరిత్ర ఎన్నటికీ మరిచిపోదు.పోలీసు దళానికి చెందిన జవాన్లు మాత్రమే 130 కోట్ల మంది దేశప్రజలలో స్ఫూర్తిని నింపనున్నారు.పోలీసు దళాల వీరగాథలను ఎప్పటికీ మరిచిపోలేరు.

మిత్రులారా, ప్రపంచంలోని గొప్ప గొప్ప దేశాలను బాధపెట్టిన మహమ్మారిని భారత్ ఎదుర్కొంది. నేడు, దేశం కరోనా సంక్షోభం నుండి బయటపడుతోంది అంటే కారణం, దేశం యొక్క ఐక్యతే, అదే నిజమైన బలం. . ఇప్పుడు మనం ఐక్యంగా ఉండి ముందుకు వెళ్తున్నాం. ఇటువంటి ఐక్యతను ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్ భావించారు. ఈ కరోనా సంక్షోభంలో మనందరి ఐక్యత ఉక్కు మనిషి సర్దార్ వల్లభాయ్ పటేల్‌కు నిజమైన నివాళి.

మిత్రులారా, ప్రతికూలతలు, సవాళ్ళ మధ్య కూడా, దేశం అసాధ్యమని భావించిన అనేక పనులను సాధించింది. ఈ క్లిష్ట సమయంలో ఆర్టికల్ 370 ను ఉపసంహరించుకున్న తరువాత, కాశ్మీర్ విలీనం అయి ఒక సంవత్సరం గడిచింది. ఈ సవరణ ఏడాది క్రితం అక్టోబర్ 31 నుంచి అమల్లోకి వచ్చింది. సర్దార్ సాహెబ్ జీవించి ఉన్నప్పుడు ఇతర రాచరిక రాష్ట్రాలను ఏకం చేయడంతో పాటు ఈ బాధ్యత ఇవ్వబడి ఉంటే, స్వాతంత్య్రం వచ్చిన చాలా సంవత్సరాల తరువాత నేను దీన్ని చేయనవసరం లేదు. ఆ పని అసంపూర్ణంగా ఉంది, ఆయన ప్రేరణ తో , 130 కోట్ల మంది దేశస్థులకు ఆ పనిని కూడా పూర్తి చేసే అదృష్టం లభించింది. కాశ్మీర్ ఇప్పుడు దాని అభివృద్ధికి అడ్డంకిగా ఉన్న అడ్డంకులను అధిగమించి అభివృద్ధి యొక్క కొత్త మార్గంలో ముందుకు సాగుతోంది. ఈశాన్యంలో శాంతిని నెలకొల్పే పని అయినా, ఈశాన్య అభివృద్ధికి తీసుకున్న చర్యలు అయినా, నేడు దేశం ఐక్యతకు కొత్త కోణాన్ని ఏర్పాటు చేస్తోంది. సోమనాథ్‌ను పునర్నిర్మించడం ద్వారా, భారతదేశ సాంస్కృతిక వైభవాన్ని పునరుద్ధరించడానికి సర్దార్ పటేల్ చేసిన ప్రారంభించిన యజ్ఞం అయోధ్యకు విస్తరించింది. ఈ రోజు, దేశం రామ్ ఆలయంపై సుప్రీంకోర్టు తీర్పుకు సాక్ష్యంగా మారింది మరియు ఇప్పుడు అక్కడ ఒక గొప్ప రామ ఆలయ నిర్మాణానికి సాక్ష్యమిస్తోంది.

మిత్రులారా, నేడు, 130 కోట్ల మంది దేశస్థులు కలిసి బలమైన, సమర్థవంతమైన దేశాన్ని నిర్మించడానికి కృషి చేస్తున్నాం, ఇందులో సమానత్వం తో పాటు అవకాశాలు కూడా ఉండాలి. సర్దార్ సాహెబ్ కూడా సర్దార్ సాహెబ్ చెప్పిన మాటలు గుర్తుంచుకోండి-  “ప్రపంచం మొత్తానికి ఆధారం రైతు మరియు కార్మికుడు. రైతులు పేదలుగా, దుర్బలంగా ఉండకుండా ఉండటానికి ఏమి చేయవచ్చో నేను ఆలోచిస్తున్నాను. నేను రైతులను బలోపేతం చేయాలనుకుంటున్నాను, వారిని గౌరవంగా నడిపించాలని అనుకుంటున్నాను. వారిని తల ఎత్తుకొని తిరిగేలా చేస్తాను”. 

మిత్రులారా, రైతులు, పేదలు, కార్మికులు మొదలైన వారు స్వావలంబన పొందినప్పుడే స్వయం సమృద్ధి సాధిస్తారు.  సర్దార్ సాహెబ్ కల ఇది, రైతులు, పేదలు, కార్మికులు తాము స్వయం సమృద్ధి చెందినప్పుడే బలంగా మారుతారని, అప్పుడే దేశం స్వావలంబన సాధిస్తుందని సర్దార్ సాహెబ్  చెప్పేవారు. మిత్రులారా, స్వయం సమృద్ధిగల దేశం మాత్రమే దాని పురోగతిపై , దాని భద్రతపై నమ్మకంగా ఉంటుంది. అందువల్ల, రక్షణ రంగంలో కూడా దేశం స్వయం సమృద్ధి సాధించే దిశగా పయనిస్తోంది. ఇది మాత్రమే కాదు, సరిహద్దుల విషయంలో భారత్ దృక్పథం, వైఖరులు కూడా మారిపోయాయి. ఈ రోజు మన ధైర్య సైనికులకు భారత భూమిని ఆక్రమించుకోవాలని చూస్తున్న  వారికి తగిన సమాధానం చెప్పే ధైర్యం ఉంది. నేటి భారతదేశం సరిహద్దుల వెంట వందల కిలోమీటర్ల పొడవైన రోడ్లు, డజన్ల కొద్దీ వంతెనలు మరియు అనేక సొరంగాలను నిర్మిస్తోంది. ఈ రోజు, భారతదేశం కూడా మన సార్వభౌమత్వాన్ని మరియు గౌరవాన్ని కాపాడటానికి పూర్తిగా సన్నద్ధమైంది, నిబద్ధత తో  పూర్తిగా సిద్ధంగా ఉంది.

కానీ మిత్రులారా, ఈ పురోగతి ప్రయత్నంలో, చాలా సవాళ్లు కూడా ఉన్నాయి. భారతదేశం మరియు ప్రపంచం నేడు వాటిని ఎదుర్కొంటున్నాయి. కొంతకాలంగా ప్రపంచంలోని అనేక దేశాలలో ఏర్పడిన పరిస్థితి… ఉగ్రవాదానికి కొంతమంది బహిరంగంగా మద్దతు ఇచ్చిన విధానం మానవత్వం పట్ల, ప్రపంచానికి, శాంతి ప్రియులకు ప్రపంచ ఆందోళన కలిగించే విషయం. ప్రస్తుతం ఉన్న ఈ వాతావరణంలో, ప్రపంచంలోని అన్ని దేశాలు, అన్ని ప్రభుత్వాలు, అన్ని మతాలు ఉగ్రవాదానికి వ్యతిరేకంగా ఐక్యంగా ఉండవలసిన అవసరం ఉంది. శాంతి, సోదరభావం మరియు పరస్పర గౌరవం అనే భావన మానవత్వం యొక్క నిజమైన గుర్తింపు. శాంతి, ఐక్యత మరియు సామరస్యం దాని మార్గం. ఉగ్రవాదం మరియు హింస నుండి ఎవరూ ప్రయోజనం పొందలేరు. భారతదేశం దశాబ్దాలుగా ఉగ్రవాదంతో బాధపడుతోంది. భారతదేశం వేలాది మంది వీరోచిత సైనికులను కోల్పోయింది. మన వేలాది మంది అమాయక పౌరులను కోల్పోయాము. చాలా మంది తల్లులు తమ కుమారులను కోల్పోయారు, చాలా మంది సోదరీమణులు తమ సోదరులను కోల్పోయారు. భారతదేశం ఉగ్రవాదంతో చాలా బాధపడింది. ఈ రోజు, ప్రపంచం అంతటినీ ఇటువంటి ఉగ్రవాద శక్తులను ఏకం చేసి ఓడించాలని కోరుకుంటుంది. ఉగ్రవాదానికి సహకరిస్తున్న వారు, ఉగ్రవాదాన్ని సమిష్టిగా ప్రోత్సహించే ప్రతి శక్తులను ఓడించాలి అని కోరుకుంటోంది.


మిత్రులారా, భారతదేశం ఎప్పుడూ ఐక్యతా భావాలకు ప్రాముఖ్యత ఇచ్చింది. "సర్వే భవంతు సుఖినః" మనం ("అందరూ సుభిక్షంగా, సంతోషంగా ఉండాలి") అనే ఆలోచన నుండి స్ఫూర్తిని పొందిన వ్యక్తులం మనం. "వసుధైవ కుటుంబకం" ("ప్రపంచమే ఒక కుటుంబం") సూత్రాన్ని పాటించే వారు మనవాళ్ళు. ఇది మన జీవన విధానం. బుద్ధభగవానుడి నుంచి మహాత్మాగాంధీ వరకు భారతదేశం యావత్ ప్రపంచానికి శాంతి, ఐక్యత అనే సందేశాన్ని ఇచ్చింది. 


మిత్రులారా, జాతీయ కవి రామ్‌ధారి సింగ్ దింకర్ జీ ఇలా రాశారు: "భారతదేశం ఒక ఆలోచన, స్వర్గాన్ని భూమికి తీసుకువస్తుంది. భారతదేశం ప్రజలను మేల్కొల్పే వ్యక్తీకరణ." మన ఆలోచనలు, మన భావాలు, మన చైతన్యం, మన ప్రయత్నాల ద్వారా మన దేశం ఉనికి తెలుస్తుంది . భారతదేశ వైవిధ్యం దాని అతిపెద్ద బలం. ఏ ఇతర దేశంలోనైనా ఇన్ని మాండలికాలు, భాషలు, రకరకాల దుస్తులు, రకరకాల ఆహారపు అలవాట్లు, చాలా భిన్నమైన ఆచారాలు, నమ్మకాలు దొరకడం చాలా కష్టం. 
మన వేదాలలో ఇలా చెప్పబడింది - జనమ్ బిబ్రాతి బహుధ వివాచసం నానధర్మాణం పృథ్వీవి యథౌకాసం. సహస్త్రామ్ ధారా ద్రవినస్య మే దుహా ధ్రువేవ్ ధేనురాన్ పస్ఫురంతి.

అంటే, మా మాతృభూమి ఒక కుటుంబం లాగా వివిధ భాషలు, విభిన్న నీతులు, ఆలోచనలు, ప్రవర్తనలు కలిగిన వ్యక్తులను కలిగి ఉంటుంది. కాబట్టి, మన వైవిధ్యం మన గుర్తింపు. వైవిధ్యం ఉన్నప్పటికీ ఈ ఐక్యతను సజీవంగా ఉంచడం మన దేశం పట్ల మన కర్తవ్యం. మనం ఐక్యంగా ఉంటే మనం అజేయంగా ఉన్నామని గుర్తుంచుకోవాలి. మనం ఐక్యంగా ఉంటే అసాధారణం ఉంటాం. మనం ఐక్యంగా ఉంటే మనం ప్రత్యేకంగా ఉంటాం. 
మన ఐక్యత, బలం ఇతరులకు నచ్చక పోవచ్చు అనే విషయాన్ని  గుర్తుంచుకోవాలి. ఈ వైవిధ్యాన్ని మన బలహీనతగా మార్చాలనుకుంటారు . ఈ భిన్నత్వం ఆధారంగా ఒకరి మధ్య విభజన ను సృష్టించాలని వారు కోరుకుంటున్నారు. ఈ శక్తులను గుర్తించడం చాలా అవసరం మరియు ప్రతి భారతీయుడు అటువంటి శక్తుల పట్ల అప్రమత్తంగా ఉండాలి.! 

మిత్రులారా, ఈ రోజు పారామిలిటరీ దళాల కవాతును చూస్తున్నప్పుడు, మీ అద్భుతమైన నైపుణ్యాలను చూస్తూ నా మనస్సులో మరో చిత్రం మెదిలింది . పుల్వామా దాడి కి సంబంధించిన చిత్రం ఇది. ఆ దాడిలో అమరులైన మన ధైర్యసాహసాలు గల సైనికులు పారామిలటరీ దళాలకు చెందినవారు.. ఈ సంఘటనను దేశం ఎప్పటికీ మరచిపోదు. దేశం మొత్తం తన ధైర్య కుమారులు కోల్పోయినందుకు బాధపడుతుండగా, కొంతమంది ఆ బాధలో పాలుపంచుకోలేదు. పుల్వామా దాడిలో తమ రాజకీయ లాభాల కోసం వారు వెతుకుతున్నారు. ఎవరు ఏమి మాట్లాడుతున్నారో, ఏ ఏ  ప్రకటనలు చేస్తున్నారో , ఆ బాధ్యతారహితమైన ప్రకటనలను దేశం ఎన్నటికీ మర్చిపోదు. దేశం ఇంత తీవ్రంగా గాయపడినప్పుడు స్వార్థం, అహంకారం అనే వికృత రాజకీయాల తీవ్రత ను దేశం మరిచిపోలేకపోయింది. ఆ సమయంలో ఆ హీరోల వైపు చూస్తూ ఆ వివాదాలకు దూరంగా ఉండి ఆ ఆరోపణలు వింటూ నే ఉన్నాను. అమరులైన సైనికుల వల్ల నా గుండె తీవ్రంగా గాయపడింది. కానీ గత కొన్ని రోజులుగా పొరుగు దేశం నుండి వస్తున్న వార్తలు, అక్కడి పార్లమెంటులో సత్యాన్ని అంగీకరించిన విధానం ఈ వ్యక్తుల నిజమైన స్వభావాన్ని దేశం ముందు తీసుకువచ్చింది. పుల్వామా దాడి తరువాత చేసిన రాజకీయాలు ఈ వ్యక్తులు తమ రాజకీయ ప్రయోజనాలను మరింత పెంచుకోవటానికి ఎంత తక్కువ స్థాయికి చేరుకోగలరో చాలా పెద్ద ఉదాహరణ. అలాంటి రాజకీయ పార్టీలను, అలాంటి వారిని ఈ మహామనిషి విగ్రహం ముందు నేను ఒక ప్రత్యేక అభ్యర్థన చేస్తున్నాను. సర్దార్ సాహెబ్‌పై మీకు నమ్మకం ఉంటే, దేశ భద్రత కోసం, దేశ భద్రత దృష్ట్యా మన భద్రతా దళాల మనోధైర్యాన్ని పెంచడానికి ఇలాంటి రాజకీయాలు చేయవద్దని నేను మిమ్మల్ని కోరుతున్నాను. ఇలాంటి వాటికి దూరంగా ఉండండి. మీ స్వంత స్వలాభం కోసం, తెలిసి లేదా తెలియకుండా, మీరు దేశ వ్యతిరేక శక్తుల చేతిలో బంటుగా మారడం ద్వారా దేశానికి గానీ , మీ పార్టీ ప్రయోజనాలకు ఎలాంటి  సేవ చేయలేరు.


మిత్రులారా, మనదేశ ప్రయోజనాలే మనఅందరి అత్యున్నత మైన ఆసక్తి గా ఉండాలని మనం ఎప్పుడూ మనసులో ఉంచుకోవాలి. అందరి ప్రయోజనాల గురించి ఆలోచించినప్పుడు మాత్రమే మనం పురోగతి సాధిస్తాం. సోదర సోదరీమణులారా, ఈ రోజు ధృడమైన, గొప్ప వ్యక్తిత్వం కలిగిన  సర్దార్ వల్లభాయ్ పటేల్ చరణాల సాక్షిగా ఆయన కలలు కన్న అదే భారతదేశాన్ని నిర్మించాలనే దృఢ సంకల్పాన్ని మనం పునరావృతం చేస్తున్నాం. సాధికారత, సంపన్న మరియు స్వావలంబన కలిగిన భారతదేశం నిర్మిద్దాం. కాబట్టి, ఈ శుభ సందర్భంగా, దేశానికి మన అంకితభావాన్ని పునరుద్ఘాటిద్దాం. దేశ గర్వాన్ని, వైభవాన్ని పెంపొందించి, దేశాన్ని కొత్త శిఖరాలకు తీసుకెళ్తామని, సర్దార్ పటేల్ ముందు తలవంచి ప్రతిజ్ఞ చేద్దాం.

ఈ ప్రతిజ్ఞతో, దేశ ప్రజలందరికీ ఐక్యతా దినోత్సవం సందర్భంగా మరోసారి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. సర్దార్ సాహెబ్‌ను స్మరిస్తూ, సర్దార్ సాహెబ్‌కు శ్రద్ధతో నివాళులర్పిస్తూ, దేశ ప్రజలందరూ సంతోషంగా వాల్మీకి జయంతిని జరుపుకోవాలని కోరుకుంటున్నాను. సర్దార్ సాహెబ్ జయంతి సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలుపుతూ నా ప్రసంగాన్ని ముగిస్తున్నాను.


చాలా చాలా ధన్యవాదాలు !


(Release ID: 1669530) Visitor Counter : 247