ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
భారత్ లో 1.5% కంటే తక్కువ స్థాయిలో కోవిడ్ మరణాలు
23 రాష్ట్రాలలో జాతీయ సగటు కంటే తక్కువ మరణాల శాతం
Posted On:
31 OCT 2020 11:24AM by PIB Hyderabad
ప్రపంచవ్యాప్తంగా ఉన్న కోవిడ్ సంక్షోభం విషయంలో భారత్ ఉమ్మడిగా పోరాడి తగిన ఫలితాలు సాధించింది. మరణాల శాతం క్రమంగా తగ్గుతూ ఈరోజు 1.5 కంటే దిగువకు పడిపోయి 1.49% గా నమోదైంది. ప్రతి పదిలక్షల జనాభాలో కరోనామరణాల సంఖ్య కూడా 88 కి తగ్గింది.
పరీక్షించు, ఆనవాలు పట్టు, చికిత్స అందించు అనే కేంద్ర ప్రభుత్వ వ్యూహాన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు సమర్థంగా అమలు చేయటంతోబాటు నియంత్రణ మీద ప్రత్యేక దృష్టి సారించి పెద్దఎత్తున పరీక్షలు జరపి ప్రామాణిక చికిత్స అందించటం వలన ఈ ఫలితాలు సాధ్యమయ్యాయి. ఎక్కువ పరీక్షల వలన తొలిదశలోనే బాధితులను గుర్తించటం, సకాలంలో ఐసొలేషన్ కి పంపటం, తీవ్రలక్షణాలున్నవారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందించటం వెంటవెంటనే జరిగాయి. అందువల్లనే కోవిడ్ మరణాల సంఖ్య చాలా పరిమితంగా ఉంటూ వచ్చింది.
ప్రపంచంలో అతి తక్కువ స్థాయిలో కోవిడ్ మరణాలు నమోదైన దేశాల్లో ఒకటిగా భారత్ నిలిచింది. గత 24 గంటలలో దేశంలో 551 మరణాలు నమోదయ్యాయి. రోజువారీ మరణాలు అదే పనిగా క్రమంగా తగ్గుతూ వస్తున్నాయి.
కోవిడ్ కి తగిన చికిత్స అందించే క్రమంలో ఐసియు విభాగాలలో చికిత్స అందించే డాక్టర్ల సామర్థ్యాన్ని పెంచటం కూడా ముఖ్యమని ప్రభుత్వం భావించింది. ఆ విధంగా మరణాలను బాగా తగ్గించటానికి వీలున్నదని అంచనా వేసింది. అందుకే ఢిల్లీలోని ఎయిమ్స్ సంస్థ ఈ-ఐసియు ఏర్పాటు చేసింది. వారానికి రెండు సార్లు- మంగళ, శుక్రవారాల్లో రాష్టాల్లో ఐసియు విభాగాలు నిర్వహించే డాక్టర్లకు టెలీ/వీడియో సంప్రదింపులకు అవకాశం కల్పించింది. 2020 జులై 8న మొదలైన ఈ సంప్రదింపుల ఫలితంగా 23 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కోవిడ్ మరణాలు జాతీయ సగటు కంటే తక్కువ ఉండటానికి దారితీశాయి.
దేశవ్యాప్తంగా నమోదైన మరణాలలో 65% కేవలం ఐదు రాష్ట్రాల్లోనే నమోదయ్యాయి. అందులో మహారాష్ట్రలో అత్యధికంగా 36% మరణాలు సంభవించాయి.
మొత్తం మరణాలలో 85% కేవలం 10 రాష్టాలు, కేంద్రపాలితప్రాంతాలలోనే నమోదయ్యాయి.
6 రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలలో మొత్తం మరణాలు 100 కు లోపే నమోదయ్యాయి. 8 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో మొత్తం 1000 లోపు మరణాలు నమోదయ్యాయి. 16 రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలలో 10,000 లోపు నమోదయ్యాయి.
గడిచిన 24 గంటలలో 59,454 మంది తాజాగా కోవిడ్ నుంచి కోలుకొని బయట పడ్డారు. అదే సమయంలో కొత్త పాజిటివ్ కేసులు 48,268 నమోదయ్యాయి. ఇప్పటివరకు కోలుకున్న కోవిడ్ బాధితుల సంఖ్య 74 లక్షలకు (7,432,829) చేరింది. రోజువారీ కోలుకున్నవారి సంఖ్య క్రమంగా పెరుగుతూ ఉండటం వలన జాతీయబ్ స్థాయిలో కోలుకున్నవారి శాతం ప్రస్తుతం 91.34% కి చేరింది.
దేశంలో కోవిడ్ బారిన పడి ఇంకా చికిత్సపొందుతూ ఉన్నవారి సంఖ్య వేగంగా తగ్గుతూ వస్తోంది. ప్రస్తుతం మొత్తం బాధితులలో చికిత్సలో ఉన్నవారు 5,82,649 మంది (7.16%) మాత్రమే. వరుసగా రెండో రోజు కూడా చికిత్సలో ఉన్న కోవిడ్ బాధితుల సంఖ్య 6 లక్షల లోపే కొనసాగింది.
కొత్తగా కోలుకొని బైటపడినవారిలో 79% మంది కేవలం 10 రాష్టాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లోనే ఉన్నట్టు తేలింది. అందులో కర్నాటక, మహారాష్ట్ర ఒక్కొక్కటీ గరిష్ఠంగా 8,000 కు పైగా నమోదు చేసుకోగా 7,000 కేసులతో కేరళ ఆ తరువాత స్థానంలో ఉంది.
గడిచిన 24 గంటలలో దేశవ్యాప్తంగా 48,268 తాజా కోవిడ్ కేసులు తేలాయి. అందులో 78% కేసులు పది రాష్ట్రాలలోనే కేంద్రీకృతమయ్యాయి. కేరళ, మహారాష్ట గరిష్ఠంగా ఒక్కొక్కటే 6,000 కు పైగా కొత్త కేసులు జోడించాయి. 5,000 కు పైగా కేసులతో ఢిల్లీ ఆ తరువాత స్థానంలో ఉంది.
గత 24 గంటలలో 551 కోవిడ్ మరణాలు నమోదయ్యాయి. వీటిలో దాదాపు 83% కేవలం పది రాష్ట్రాల్లో కేంద్రీకృతమయ్యాయి. కొత్త కేసుల్లో 23% పైగా మరణాలు (127) మహారాష్ట్రలోనే నమోదయ్యాయి.
****
(Release ID: 1669030)
Visitor Counter : 184
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Gujarati
,
Odia
,
Tamil
,
Malayalam