ప్రధాన మంత్రి కార్యాలయం
గుజరాత్‌లోని కెవాడియాలో ఆరోగ్య వన్, ఆరోగ్య కుటీర్, ఏక్‌తా మాల్, చిల్డ్రన్ న్యూట్రిషన్ పార్క్‌ను ప్రారంభించిన ప్రధాన మంత్రి
Posted On:
30 OCT 2020 2:16PM by PIB Hyderabad
గుజరాత్‌లో కెవాడియా ఇంటిగ్రేటెడ్ డెవలప్‌మెంట్ కింద ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ వివిధ ప్రాజెక్టులను ప్రారంభించారు. కెవాడియాలో ఆరోగ్య వన్, ఆరోగ్య కుటీర్‌లను శ్రీ మోడీ ప్రారంభించారు. ఏక్‌తా మాల్, చిల్డ్రన్ న్యూట్రిషన్ పార్కులను కూడా ఆయన ప్రారంభించారు.
ఆరోగ్య వన్ మరియు ఆరోగ్య కుటీర్ః
ఆరోగ్య వన్‌ను 17 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. ఇక్కడ 380 జాతుల 5 లక్షల మొక్కలు ఉన్నాయి. ఆరోగ్య కుటిర్‌లో శాంతిగిరి వెల్నెస్ సెంటర్ అనే సాంప్రదాయ చికిత్సా సౌకర్యం ఏర్పాటు చేశారు. ఇది ఆయుర్వేదం, సిద్ధ, యోగా మరియు పంచకర్మల విధానాల ద్వారా ఆరోగ్య సంరక్షణను అందిస్తుంది.
ఏక్‌తా మాల్ః
భారతదేశం నలుమూలల నుండి విభిన్నమైన హస్తకళలు మరియు సాంప్రదాయ వస్తువులను ఈ మాల్‌లో ప్రదర్శిస్తారు. మాల్ వైవిధ్యంలో ఐక్యతను సూచించేలా
హస్తకళలు, సాంప్రదాయ వస్తువులను ఈ మాల్‌లో ప్రదర్శిస్తారు. దీనిని 35000 చదరపు అడుగుల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. ఈ మాల్ భారతదేశంలో నిర్దిష్ట రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించేలా 20 ఎంపోరియాల్ని కలిగి ఉంది. ఈ మాల్‌ను కేవలం 110 రోజుల్లో నిర్మించబడింది.
చిల్డ్రన్ న్యూట్రిషన్ పార్క్ & మిర్రర్ మేజ్ః
పిల్లల కోసం ప్రపంచంలోనే మొట్టమొదటి టెక్నాలజీ ఆధారితంగా ఏర్పాటు చేసిన న్యూట్రిషన్ పార్క్ ఇది. దాదాపు 35000 చదరపు అడుగుల విస్తీర్ణంలో దీనిని ఏర్పాటు చేశారు. ఇందులో ఏర్పాటు చేసిన న్యూట్రీ రైలు పార్కులో ‘ఫల్షాకా గృహం’, ‘పయోనగరి’, ‘అన్నపూర్ణ’, ‘పోషన్ పురాన్’, మరియు ‘స్వస్త భారతం’ వంటి వివిధ ఉత్తేజకరమైన థీమ్ ఆధారిత స్టేషన్ల గుండా ప్రయాణిస్తుంది. మిర్రర్ మేజ్, 5 డీ వర్చువల్ రియాలిటీ థియేటర్ మరియు ఆగ్మెంటెడ్ రియాలిటీ గేమ్స్ వంటి వివిధ ఎడ్యుటైన్మెంట్ కార్యకలాపాల ద్వారా పోషకాలపై అవగాహన పెంచుతుంది.
****
(Release ID: 1668863)
Visitor Counter : 329
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Manipuri
,
Bengali
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam