యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
జర్మనీలో క్వారంటైన్‌లో ఉన్న బ్యాడ్మింటన్ క్రీడాకారుల ఖర్చులు భరించనున్న శాయ్
నాడు పోస్టు చేయడమైనది:
29 OCT 2020 8:47PM by PIB Hyderabad
జర్మనీలో క్వారంటైన్‌లో ఉన్న భారత బ్యాడ్మింటన్ క్రీడాకారులు అజయ్ జయరామ్, శుభాంకర్‌కు అయ్యే వసతి ఖర్చులను స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా (శాయ్) భరించనుంది. నేటి (అక్టోబర్ 30) నుంచి నవంబర్ 10 వరకు ఆ ఇద్దరు క్వారంటైన్‌లో గడుపుతారు. ఈ 12 రోజులు హోటల్‌లో వసతి, భోజనానికి అయ్యే మొత్తం ఖర్చు రూ.1.46 లక్షలను శాయ్ భరిస్తుంది. ఇందులో 90 శాతం మొత్తాన్ని తక్షణం విడుదల చేస్తుంది.
సార్‌బ్రూకెన్‌లో జరుగుతున్న సార్‌లార్‌లక్స్ ఓపెన్‌లో అజయ్ జయరామ్, శుభాంకర్ పాల్గొనాల్సి ఉంది. అయితే, డిపెండింగ్ ఛాంపియన్ లక్ష్యసేన్‌తో కలిసి ఈ ఇద్దరు శిక్షణలో పాల్గొన్నారు. లక్ష్యసేన్ కోచ్ డీకే సేన్‌కు కొవిడ్ పాజిటివ్ అని ఈనెల 27న తేలింది. టోర్నమెంట్‌కు, ఇతర ఆటగాళ్లకు ఇబ్బందులు రాకుండా వెంటనే టోర్నీ నుంచి లక్ష్యసేన్ వైదొలిగారు. జర్మనీలో దిగిన తర్వాత అజయ్ జయరామ్, శుభాంకర్ నెగెటివ్‌గా తేలినా, లక్ష్యసేన్‌తో కలిసి శిక్షణ తీసుకున్న కారణంగా వీరు కూడా టోర్నీ నుంచి తప్పుకున్నారు.
ఫ్రాంక్‌ఫర్ట్‌లోని భారత రాయబార కార్యాలయంతో సాయ్ ఎప్పటికప్పుడు మాట్లాడుతూ, అజయ్ జయరామ్, శుభాంకర్ ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీస్తోంది. వారికి ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తోంది.
****
(రిలీజ్ ఐడి: 1668753)
సందర్శకుల సూచీ సంఖ్య : : 163