సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

మహారాష్ట్రలోని 100 కుమ్మరి కుటుంబాలకు విద్యుత్‌తో న‌డిచే కుమ్మ‌రి చ‌క్రాల‌ను పంపిణీ చేసిన కేంద్ర మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ

Posted On: 28 OCT 2020 3:56PM by PIB Hyderabad

మహారాష్ట్రలోని నాందేడ్, పర్భాని జిల్లాల్లోని 100 కుమ్మరి కుటుంబాలకు కేంద్ర సూక్ష్మ‌, చిన్న, మ‌ధ్య త‌ర‌హా ప‌రిశ్ర‌మ‌లు, రోడ్డు ర‌వాణా‌, జాతీయ ర‌హ‌దారుల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ విద్యుత్‌తో న‌డిచే కుమ్మ‌రి చ‌క్రాల‌ను పంపిణీ చేశారు. బుధ‌వారం వీడియో క‌న్ఫ‌రెన్సింగ్ ద్వారా జ‌రిగిన ఈ కార్య‌క్ర‌మంలో మంత్రి కుమ్మ‌రి చ‌క్రాల పంపిణీ చేప‌ట్టారు. ఖాదీ మరియు విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ (కేవీఐసీ) 'కుమ్మ‌ర స‌శక్తికరన్ యోజన'లో భాగంగా సాధికారత వైపుగా ఇది ప్రధాన అడుగు. ల‌బ్ధిదారుల‌కు కేవీఐసీ ద్వారా 10 రోజుల పాటు శిక్ష‌ణ ఇవ్వ‌బ‌డింది. విద్యుత్ కుమ్మ‌రి చ‌క్రాల‌ను పొందిన వారిలో.. 15 గ్రామాలకు చెందినవారు ఉన్నారు. నాందేడ్‌లో 10 గ్రామాలు, పర్భాని జిల్లాల్లో 5 గ్రామాలు  వారికి కుండల పరికరాలను పంపిణీ చేశారు. పరికరాల పంపిణీ సమాజంలోని కనీసం 400 మంది సభ్యులకు వారి ఉత్పాదకత, ఆదాయం పెంచడం ద్వారా మేటి ప్రయోజనం చేకూర్చ‌నుంది. ఇది ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ కల. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన తరువాత.. మ‌న‌ దేశంలో కుమ్మరుల జీవనాన్ని బలోపేతం చేయడానికి, మెరుగుపరచడానికి గాను తీసుకున్న మొట్టమొదటి ప్రయత్నం కేవీఐసీకి చెందిన 'కుమ్మ‌ర స‌శక్తికరన్ యోజన' అని మంత్రి శ్రీ గడ్కరీ ప్రశంసించారు. “అట్టడుగున ఉన్న‌ కుమ్మరుల సమాజాన్ని సాధికారపరచడం.. మరియు అంత‌రించుకుపోతున్న కుండలకు డైయింగ్ క‌ళను పునరుద్ధరించడం ప్రధానమంత్రి స్వ‌ప్నం. 'కుమ్మ‌ర స‌శక్తికరన్ యోజన' కింద అధునాతన పరికరాల పంపిణీ.. సరైన శిక్షణతో కుమ్మరుల ఉత్పాదకత, ఆదాయం ప‌లు రెట్లుగా పెరిగింది. ఈ పథకాన్ని మహారాష్ట్రలోని ప‌లు ఇతర మారుమూల ప్రాంతాల‌కు మరియు ఇతర రాష్ట్రాల్లో అమలు చేయనున్నారు” అని శ్రీ గడ్కరీ అన్నారు. ఈ సందర్భంగా  ప్రభుత్వ సహకారం అందుకున్నందుకు సంతోషం వ్యక్తం చేసిన కొంతమంది చేతివృత్తుల వారితో కేంద్ర మంత్రి ముచ్చ‌టించారు. విద్యుత్‌తో న‌డిచే కుమ్మ‌రి చ‌క్రం ఉప‌యోగించ‌డం వ‌ల్ల ఉత్ప‌త్తి పెర‌గ‌డంతో వారు ఇప్పుడు సంపాదించిన దానికంటే 3-4 రెట్లు ఎక్కువ సంపాదిస్తున్నారని చెప్పారు.


కార్య‌క్ర‌మంలో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న కేవీఐసీ చైర్మన్ శ్రీ వినాయ్ కుమార్ సక్సేనా మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా ఇప్పటివరకు 18,000కి పైగా ఎలక్ట్రిక్ కుమ్మ‌రి చ‌క్ర‌మాలు పంపిణీ చేయబడ్డాయని, ఇది దాదాపు 80,000 మందికి ప్రయోజనం చేకూరుస్తుందని అన్నారు. 'కుమ్మ‌ర స‌శక్తికరన్ యోజన'
మూలంగా కుమ్మరుల సగటు ఆదాయం నెలకు దాదాపు రూ.3000 నుండి రూ. 10,000 పెరిగిందని అన్నారు. "దేశంలోని ప్రతి కుమ్మరిని సాధికారపరచడం ఈ కార్యక్రమం యొక్క ఏకైక లక్ష్యం మరియు ఈ లక్ష్యాన్ని సాధించడంలో కేవీఐసీ ఎలాంటి ప్రయత్నాన్ని ఉపేక్షించ‌ద‌ని" అని ఆయన అన్నారు.
                               

****


(Release ID: 1668272) Visitor Counter : 248