జల శక్తి మంత్రిత్వ శాఖ

రాజస్థాన్ లో " జల్ జీవన్ మిషన్" అమలుపై సమీక్ష

థార్ ఎడారి ముఖద్వారమైన చురు జిల్లాలో ఈ ఏడాదిలోనే " జల్ జీవన్ మిషన్" కింద శత శాతం నీటి సరఫరా

Posted On: 28 OCT 2020 4:11PM by PIB Hyderabad

 

దేశంలోని గ్రామీణ ప్రాంతాలలో ప్రతి గృహానికి 2024 నాటికి రోజుకు మనిషికి 55 లీటర్ల నీటిని కొళాయిల ద్వారా సరఫరా చేయాలన్న లక్ష్యంతో కేంద్రప్రభుత్వం రూపొందించిన బృహత్తర పథకం " జల్ జీవన్ మిషన్" ను అమలు చేయడానికి రాజస్థాన్ రాష్ట్రం కార్యాచరణ పథకాన్ని సిద్ధం చేసింది. గ్రామీణ ప్రాంత ప్రజలు ముఖ్యంగా మహిళలు, ఆడపిల్లల జీవనస్థితిగతులను మెరుగు పరచాలన్న ఆశయంతో కేంద్రం " జల్ జీవన్ మిషన్" పథకానికి రూపకల్పన చేసింది. మహిళలు , ఆడపిల్లలకు చాకిరీ నుంచి విముక్తి కల్పించాలన్న లక్ష్యంతో " జల్ జీవన్ మిషన్" మార్గదర్శకాలను రూపొందించడం జరిగింది. దీనిని అమలు చేయడానికి అవసరమైన నిధులను కేంద్ర ప్రభుత్వం, రాష్ట్రాలు విడుదల చేస్తాయి. మంజూరు చేసిన కొళాయి కనెక్షన్ ల సంఖ్యపై ఆధారపడి కేంద్ర ప్రభుత్వం విడుదల చేసే నిధులకు తోడుగా రాష్ట్రాలు మ్యాచింగ్ నిధులను సమకూర్చడం జరుగుతుంది. తమ రాష్ట్రంలో " జల్ జీవన్ మిషన్" అమలు జరుగుతున్న తీరును, దీనిని అమలు చేయడానికి రూపొందించిన కార్యాచరణ కార్యక్రమాన్ని రాజస్థాన్ రాష్ట్ర అధికారులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాతీయ జల్ జీవన్ మిషన్ కు 2020 అక్టోబర్ 27వ తేదీన వివరించారు.

2023-24 నాటికి గ్రామీణ ప్రాంతాలలో ప్రతి ఇంటికి కొళాయి కనెక్షన్ ఇచ్చి దాని ద్వారా నీరు సరఫరా చెసి " జల్ జీవన్ మిషన్" లక్ష్యాలను 100 శాతం సాధించాలని నిర్ణయించారు. ప్రస్తుతం రాజస్థాన్ గ్రామీణ ప్రాంతాలలో దాదాపు 1. 01 కోట్ల గృహాలు ఉన్నాయి. అయితే, వీటిలో 88.57 లక్షల ఇళ్లకు కొళాయి కనెక్షన్ లు లేవు. "జల్ జీవన్ మిషన్"లో గ్రామీణ ప్రాంతంలో ప్రతి ఇంటికి కొళాయి కనెక్షన్ ఇవ్వాలన్న లక్ష్యంలో భాగంగా 2020-21లో 20.69 లక్షల గృహాలకు కొళాయి కనెక్షన్ ఇవ్వాలని నిర్ణయించారు. చురు జిల్లాలో అన్ని గృహాలకు కొళాయి కనెక్షన్ ఇవ్వాలని లక్ష్యంగా నిర్ణయించుకున్నారు.

పథకం అమలు జరుగుతున్న తీరుపై నిర్వహించిన సమావేశంలో ​ప్రస్తుత పరిస్థితిని సమీక్షించడం జరిగింది. పైపుల ద్వారాల నీటిని సరఫరా చేయడానికి రూపొందించిన పథకంలో ఇంతవరకు 44,641 నివాస ప్రాంతాలకు ఒక్క కనెక్షన్ కూడా ఇవ్వలేదని, అదేవిధంగా 20,172 గ్రామాలలో ఒక్క కొళాయి కూడా లేదని వెల్లడయింది. 2020 డిసెంబర్ నాటికి 8. 74 లక్షల జనాభా కలిగి ఫ్లోరైడ్ బారిన పడిన 1,545 నివాస ప్రాంతాలకు సురక్షిత మంచి నీరు సరఫరా చేయాలని రాజస్థాన్ లక్ష్యంగా నిర్ణయించుకుంది. నీటి కొరత ఎదుర్కొంటున్న ప్రాంతాలు, షెడ్యూల్ కులాలు/ తెగలకు చెందినవారు ఎక్కువగా నివసిస్తున్న ప్రాంతాలు , నీరు అవసరమైన ప్రాంతాలు , సంసద్ ఆదర్శ్ గ్రామ్ యోజన పధకం కిందకి వచ్చే గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి పని చేయాలని రాష్ట్ర అధికారులకు సూచనలు జారీ అయ్యాయి.

వికేంద్రీకృత పద్దతిలో అవసరాలకు అనుగుణంగా సామాజిక పధకంగా " జల్ జీవన్ మిషన్" అమలు జరుగుతున్నందున పథకం రూపకల్పన, అమలు, నిర్వహణలో స్థానిక గ్రామాలు / గ్రామపంచాయతీలు లేదా వినియోగదారులు కీలక పాత్ర పోషించవలసి ఉంటుంది. పథకాన్ని సమర్ధంగా లోపాలు లేకుండా దీర్ఘకాలం అమలు చేసే భాధ్యతను వీరు తీసుకోవలసి ఉంటుంది. " జల్ జీవన్ మిషన్" ప్రజా కార్యక్రమంలా అమలు జరిగేలా చూడడానికి అన్ని గ్రామాలలో ప్రజలను సమీకరించి వారికి IEC కార్యక్రమాల ద్వారా చైతన్యవంతులను చేయాలని నిర్ణయించారు. గ్రామాలలో నీటి సరఫరా వ్యవస్థను నెలకొల్పి దాని ద్వారా నీరు సరఫరా చేయడం, వ్యవస్థను నిర్వహణకు మహిళా స్వయం సహాయక బృందాలు , స్వచ్చంద సేవా సంస్థల సహకారాన్ని తీసుకోవాలని అధికారాలకు సూచనలు జారీ అయ్యాయి .

​ప్రతి ఇంటికి సురక్షిత నీరు సరఫరా కావాలన్న లక్ష్యానికి కట్టుబడి ఉన్న కేంద్ర ప్రభుత్వం దీనిని సాధించడానికి రాష్ట్రాలకు పూర్తి సహాయసహకారాలను అందించడానికి సిద్ధంగా ఉంది . "జల్ జీవన్ మిషన్" కింద కేంద్రం రాజస్థాన్ కు 2024-21లో 2,522 కోట్ల రూపాయలను కేటాయించింది.ఇవి కాకుండా నీటి కొరతను ఎదుర్కొంటున్న ప్రాంతాలలో

​సరఫరాలను మెరుగుపరచడానికి అమలు జరుగుతున్న ఉప ప్రణాళిక కింద రాష్ట్రాన్ని 89 కోట్ల రూపాయలు అందుబాటులో ఉన్నాయి . కేంద్ర గ్రాంటులను కోల్పోకుండా చూసుకోడానికి అందుబాటులో ఉన్న నిధులను పూర్తిగా వినియోగించడానికి చర్యలు తీసుకోవాలని రాష్ట్ర అధికారులను కోరడం జరిగింది.

దీనితో పాటు 15వ ఆర్ధిక సంఘం నీటి సరఫరా, పారిశుధ్య కార్యక్రమాల కోసం రాష్ట్రానికి 2020-21లో FC గ్రంతుగా ,862 కోట్ల రూపాయలను కేటాయించింది .MGNREGS, JJM లాంటి పథకాల కింద రాష్ట్రం నిధులను సమీకరించి పధకాన్ని సమగ్రంగా అమలు చేయవలసి ఉంటుంది .

2020 అక్టోబర్ రెండవ తేదీన ప్రారంభించిన 100 రోజుల కార్యాచరణ కార్యక్రమంలో భాగంగా విద్యార్థుల ఆరోగ్య సంరక్షణకు రాష్ట్రంలోని అన్ని అంగన్వాడీ కేంద్రాలు, పాఠశాలలకు కొళాయిల ద్వారా నీరు సరఫరా చేసి వీటిలో తాగునీరు సౌకర్యాన్ని కల్పించడంతో పాటు చేతులను షర్బరం చేసుకోవడానికి, మరుగుదొడ్లలో ఉపయోగించడానికి , మధ్యాహ్న భోజన పధకం అమలకు అవసరమైన నీరు అందుబాటులో ఉండేలా చూడాలని రాష్ట్రాన్ని ఆదేశించడం జరిగింది.

***

 



(Release ID: 1668270) Visitor Counter : 182