నౌకారవాణా మంత్రిత్వ శాఖ

వి.ఓ.చిదంబరనార్ నౌకాశ్రయం వద్ద 'డైరెక్ట్ పోర్ట్ ఎంట్రీ సదుపాయాన్ని' ప్రారంభించిన - కేంద్ర మంత్రి శ్రీ మన్సుఖ్ మాండవీయ

వ్యాపారం మరియు ఆర్ధిక వృద్ధిని సులభతరం చేయడానికీ, సరుకు రవాణా వేగాన్ని పెంచడానికీ మరియు సరుకు రవాణా ఖర్చును తగ్గించే దిశగా డి.పి.ఈ. సౌకర్యం ఒక గుర్తించదగిన దశ : శ్రీ మాండవీయ

Posted On: 27 OCT 2020 1:18PM by PIB Hyderabad

వి.ఓ. చిదంబరనార్ నౌకాశ్రయం వద్ద ‘డైరెక్ట్ పోర్ట్ ఎంట్రీ (డి.పి.ఈ) సదుపాయాన్ని కేంద్ర షిప్పింగ్ శాఖ సహాయ మంత్రి (ఐ/సి) శ్రీ మన్సుఖ్ మాండవీయ, ఈ-ఫలకాన్ని ఆవిష్కరించడం ద్వారా, ప్రారంభించారు.

 

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image001OBQB.jpg

శ్రీ మన్సుఖ్ మాండవియా, ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో వీడియో కాన్ఫరెన్సు ద్వారా ప్రసంగిస్తూ, సరుకు రవాణా వ్యయాన్ని తగ్గించి, సరుకు రవాణా వేగాన్ని పెంచడం కోసం ఇది ఒక గుర్తించదగిన దశ అని పేర్కొన్నారు. ఎగుమతిదారుల వ్యాపారాన్ని సులభతరం చేయడానికి డి.పి.ఈ. సదుపాయం సహాయపడుతుందనీ, సామర్థ్యం మెరుగుపడుతుతుందనీ, రవాణా వ్యయం, రవాణా సమయం తగ్గడం వల్ల అంతర్జాతీయ వాణిజ్యంలో రవాణాదారుల పోటీతత్వం మెరుగుపడుతుందనీ ఆయన వివరించారు. 

 

http://static.pib.gov.in/WriteReadData/userfiles/image/image002EMD0.jpg

మధ్యలో ఏ సి.ఎఫ్.ఎస్ వద్ద సరుకును మార్చవలసిన అవసరం లేకుండా, కర్మాగారాల నుండి నేరుగా కంటైనర్లను తరలించడానికి, అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించబడిన ఈ డైరెక్ట్ పోర్ట్ ఎంట్రీ (డి.పి.ఈ) సౌకర్యం వీలు కల్పిస్తుంది.  అందువల్ల రవాణాదారులు వారి ఫ్యాక్టరీ నుండి బయలుదేరిన సరుకును 24x7 ప్రాతిపదికన నేరుగా కంటైనర్ టెర్మినల్‌ కు తరలించడానికి అవకాశం ఉంటుంది.  ట్రక్కులు నిలిపే స్థలం లో 18,357 చదరపు మీటర్ల విస్తీర్ణంలో ఈ సదుపాయాన్ని ఏర్పాటు చేశారు. ఫ్యాక్టరీ నుండి ఇ-సీల్డ్ చేసిన కంటైనర్ల ద్వారా ఎగుమతి చేసే సరుకు యొక్క కస్టమ్స్ క్లియరెన్స్ జారీ చేయడానికి, ‘సాగర్ మాలా’ పధకం క్రింద ఈ సదుపాయాన్ని అభివృద్ధి చేయడం జరిగింది.  ఇది నెలకు 18000 టీ.ఈ.యూ. లను నిర్వహించగలదు.  ఈ డి.పి.ఈ. సదుపాయం ద్వారా, భారత కస్టమ్స్ శాఖకు చెందిన సెంట్రల్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్, "లెట్ ఎక్స్‌పోర్ట్ ఆర్డర్ (ఎల్.ఈ.ఓ)" ను ఒకే ప్రదేశంలో, ఎటువంటి ఇబ్బంది లేకుండా జారీ చేస్తుంది.  సి.డబ్ల్యు.సి.  మరియు కస్టమ్స్ అధికారుల ప్రత్యేక బృందం, వి.ఒ.సి. పోర్టుతో కలిసి, టైర్-2, టైర్-3 (ఎ.ఇ.ఒ) ధృవీకరించిన ఎక్సిమ్ ఖాతాదారులకు సేవలు అందిస్తుంది.  

అంతకుముందు, ఫ్యాక్టరీ నుండి సరుకుతో బయలుదేరిన (సెల్ఫ్-సీల్డ్) కంటైనర్లను టుటికోరిన్ లోని ఏదైనా ఒక  కంటైనర్ ఫ్రైట్ స్టేషన్లు (సి.ఎఫ్.ఎస్) / దేశీయ కంటైనర్ డిపో (ఐ.సి.డి) కి తీసుకువెళ్ళవలసి వచ్చేది.  ఈ సి.ఎఫ్.ఎస్. లు పని రోజులలో మాత్రమే ఉదయం 10 గంటల నుండి రాత్రి 8 గంటల మధ్య పనిచేస్తాయి.  ఆ కారణంగా, సెల్ఫ్ సీల్ చేసిన ఎగుమతి కంటైనర్లను కంటైనర్ టెర్మినల్స్‌లో ప్రవేశపెట్టదానికి చాలా జాప్యం జరిగేది. అందువల్ల, 24x7 ప్రాతిపదికన ఫ్యాక్టరీ సరుకు ఈ-సీల్డ్ కంటైనర్లలో ఎగుమతి క్లియరెన్స్‌ ను ప్రారంభించడానికి నౌకాశ్రయం ఈ డి.పి.ఈ. సదుపాయాన్ని అభివృద్ధి చేసింది.  దీని ఫలితంగా వేగంగా మరియు తక్కువ ఖర్చుతో ఎగుమతులు చేయడానికి అవకాశం కలిగింది.  సెంట్రల్ వేర్ ‌హౌసింగ్ కార్పొరేషన్ (సి.డబ్ల్యు.సి) తో నౌకాశ్రయం 30 సంవత్సరాలకు ఒక అవగాహనా ఒప్పందం చేసుకుని, ఈ సదుపాయాన్ని నిర్వహిస్తోంది.  నౌకాశ్రయంలో డి.పి.ఈ. సదుపాయాన్ని నిర్వహించడానికి కస్టమ్స్ విభాగం కూడా ఆమోదం తెలిపింది.

షిప్పింగ్ మంత్రిత్వ శాఖ కార్యదర్శి, డాక్టర్ సంజీవ్ రంజన్ ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఓడరేవులలో ఐ.టి. ఆధారిత మౌలిక సదుపాయాలు ఖచ్చితంగా మన ఓడరేవులను, షిప్పింగ్ మంత్రిత్వ శాఖ యొక్క ‘మారిటైమ్ విజన్-2030’ కి అనుగుణంగా, ప్రపంచ స్థాయి ఓడరేవులుగా తీర్చిదిద్దుతాయని పేర్కొన్నారు. 

ఆన్-లైన్ మాధ్యమం ద్వారా జరిగిన ఈ ప్రారంభోత్సవ కార్యక్రమంలో - షిప్పింగ్ మంత్రిత్వ శాఖకు చెందిన సీనియర్ అధికారుల తో పాటు, వి.ఓ. చిదంబరనార్ పోర్ట్ ట్రస్ట్ చైర్మన్, శ్రీ టి.కె. రామచంద్రన్; సెంట్రల్ వేర్‌హౌసింగ్ కార్పొరేషన్ మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ అరుణ్ కుమార్ శ్రీవాస్తవ;  నౌకాశ్రయ అధికారులు పాల్గొన్నారు. 

*****


(Release ID: 1667884) Visitor Counter : 242