గిరిజన వ్యవహారాల మంత్రిత్వ శాఖ
గిరిజన సంక్షేమం కోసం రెండు సెంటర్స్ ఫర్ ఎక్సలెన్స్‌ను మంగళవారం ప్రారంభించనున్న అర్జున్ ముండా
ఎఒఎల్ భాగస్వామ్యంతో రెండు సిఇఒలను ప్రారంభచనున్నారు
Posted On:
26 OCT 2020 2:39PM by PIB Hyderabad
గిరిజన సంక్షేమ కోసం సెంటర్స్ ఫర్ ఎక్సలెన్్సను మంగళవారం వీడియో కాన్ఫరెన్్స ద్వారా ప్రారంభించనున్నారు. ఆర్ట్ ఆఫ్ లివింగ్ భాగస్వామ్యంతో గిరిజన సంక్షేమ శాఖ ఈ కేంద్రాలను నిర్వహించనున్నది. ఈ కార్యక్రమంలో ఆర్ట్ ఆఫ్ లివింగ్ అధిపతి గురుదేవ్ శ్రీశ్రీ రవిశంకర్ పాల్గొననున్నారు.
గిరిజనుల కోసం ఉద్దేశించిన వివిధ గిరిజన చట్టాలు, నిబంధనలతో పాటుగా సంక్షేమ పథకాలగురించి ఎన్నికైన ప్రతినిధులలో చైతన్యాన్ని తీసుకువచ్చేందుకు జార్ఖండ్‌లోని 5 జిల్లాలలోని 30 గ్రామ పంచాయతీలలోని 150 గ్రామాలలో పిఆర్ైలను బలోపేతం చేసేందుకు ప్రారంభించిన తొలి చొరవ ఇది. తద్వారా గిరిజనులకు ఈ పథకాలను అందుబాటులోకి తీసుకురావాలని లక్ష్యించారు. గిరిజన యువతకు వ్యక్తిత్వ నిర్మాణ శిక్షణను ఇవ్వడం ద్వారా వారిలో సామాజిక బాధ్యతను వారు అర్థం చేసుకొనేలా చేయడం ద్వారా తమ సమాజంలో చైతన్యాన్ని తీసుకువచ్చే గిరిజన నాయకులుగా వారిని తయారు చేయడానికి, యువ వాలంటీర్లను తయారు చేయడం కోసం ఈ నమూనాను సృష్టించారు.
రెండవది, మహారాష్ట్రలోని ఔరంగాబాద్‌లోని 10000 గిరిజన రైతులకు గో- ఆధారిత వ్యవసాయ పద్ధతులలో రక్షణీయ సహజ వ్యవసాయాన్ని అనుసరించేందుకు శిక్షణను అందించడం. రైతులకు సేంద్రీయ సర్టిఫికేషన్‌ను, మార్కెటింగ్ అవకాశాలను అందుబాటులోకి తెచ్చేందుకు తోడ్పడం ద్వారా వారిని ఆత్మనిర్భర గిరిజన రైతులుగా తీర్చిదిద్దాలన్నది ఈ నమూనా లక్ష్యం.
(Release ID: 1667781)
Read this release in:
English
,
Urdu
,
Marathi
,
Hindi
,
Bengali
,
Manipuri
,
Assamese
,
Punjabi
,
Tamil
,
Kannada
,
Malayalam