శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ

ర‌సాయ‌న క్రిమిసంహార‌కాలు వాడ‌డం వ‌ల్ల క‌లిగే దుష్ప్ర‌భావాల నుంచి విముక్తికి కొత్త‌ర‌కం క్రిమిసంహార‌కాలు, శానిటైజ‌ర్లు

ఇందుకు సంబంధించిన ప్ర‌క్రియ‌లు, వ్య‌వ‌స్థ‌ల‌కు సంబంధించి సాధించిన విజ‌యాల‌ను సైన్సు, టెక్నాల‌జీ ఇన్నొవేష‌న్ పాల‌సీ 2020లో చేర్చ‌డం జ‌రుగుతుంది.: ప‌్రొఫెస‌ర్ అశుతోష్ శ‌ర్మ‌, డిఎస్‌.టి కార్య‌ద‌ర్శి

Posted On: 26 OCT 2020 4:04PM by PIB Hyderabad

కోవిడ్ వైరస్ సోక‌కుండా కాపాడుకునేందుకు ర‌‌సాయ‌నాల‌తో త‌యారైన క్రిమిసంహార‌కాల‌ను, స‌బ్బును ప‌దే ప‌దే వాడ‌డం వ‌ల్ల చేతులు పొడిబార‌డం, దుర‌దరావ‌డం వంటి స‌మ‌స్య‌లు తీరిన‌ట్టే. ప్ర‌స్తుతం దేశంలోని వివిధ ప్రాంతాల‌లోని ఎన్నో స్టార్ట‌ప్‌లు ర‌సాయ‌న క్రిమిసంహార‌కాల‌కు బ‌దులుగా ప్ర‌త్యామ్నాయాల‌ను వినూత్న‌ప‌ద్ధ‌తిలో త‌యారు చేయ‌డంలో నిమ‌గ్న‌మై ఉన్నాయి. ఇవి ఆయా ప్ర‌దేశాల‌ను, సూక్ష్మ‌రంధ్రాల‌లో క్రిముల‌ను నాశ‌నంచేయ‌గ‌లుగుతాయి.
ఈ నూత‌న సాంకేతిక ఆవిష్క‌ర‌ణ‌లు ఆస్పత్రుల లో త‌యార‌య్యే బ‌యోమెడిక‌ల్ వ్య‌ర్ధాల‌ను క్రిమిర‌హితంచేయ‌గ‌ల‌వు. ఇందులో వినూత్న‌నానోమెటీరియ‌ల్‌, ర‌సాయ‌న ప్ర‌క్రియ‌లు, సుర‌క్షిత క్రిమిర‌హిత ప్ర‌క్రియ‌లు వాడుతారు.
సుర‌క్షిత క్రిమిసంహారకాలు, శానిటైజేష‌న్ సాంకేతిక ప‌రిజ్ఞానాలు మొత్తం 10 కంపెనీల నుంచి వ‌చ్చాయి. సెంట‌ర్‌ఫ‌ర్ ఆగ్మెంటింగ్ డ‌బ్లు ఎ ఆర్ విత్ కోవిడ్ 19 హెల్త్ క్రైసిస్ (సిఎడ‌బ్ల్యుఎ సిహెచ్‌) కింద వీటి ఆవిష్క‌ర‌ణ‌లు జ‌రుగుతున్నాయి. ఇవి  డిపార్ట‌మెంట్ ఆఫ్ సైన్స్ టెక్నాల‌జీకింద గ‌ల నేష‌న‌ల్ సైన్స్ ,టెక్నాల‌జీ ఎంట‌ర్ ప్రెన్యుయ‌ర్‌షిప్ డ‌వ‌ల‌ప్‌మెంట్ బోర్డు (ఎన్ఎస్టిఇడిబి) చొర‌వ‌కు అనుగుణంగా ఈ కార్య‌క్ర‌మాలు చేప‌ట్ట‌డం జ‌రుగుతోంది. సొసైటీ ఫ‌ర్ ఇన్నొవేష‌న్ ,ఎంట‌ర్ ప్రెన్యుయ‌ర్ షిప్ , ఐఐటి బొంబాయి దీనిని అమ‌లు చేస్తోంది. ముంబాయికి చెందిన స్టార్ట‌ప్ ఇన్‌ఫ్లాక్స్ వాట‌ర్ సిస్ట‌మ్‌, సంక్లిష్ట‌మైన కలుషిత జ‌లాల‌ను శుద్ధిచేయ‌డంలో నైపుణ్యంగ‌ల స్టార్ట‌ప్ సంస్థ‌. ఈ సంస్థ త‌మ సాంకేతిక ప‌రిజ్ఞానంలో మార్పులు చేసి కోవిడ్ -19 కు వ్య‌తిరేకంగా వివిధ ప‌రిక‌రాలు, ప్రాంతాల‌ను క్రిమిర‌హితం  చేసేందుకుకొత్త వ్య‌వ‌స్థ‌ను అభివృద్ధి చేసింది. దీనిక వ‌జ్ర అని నామ‌క‌ర‌ణం చేసింది

వ‌జ్ర కెఇ సిరీస్  ఎల‌క్ట్రోస్టాటిక్ డిశ్చార్జ్ ప్ర‌క్రియ‌తో కూడి బ‌హుళ ద‌శ క్ర‌మిర‌హిత వ్య‌వ‌స్థ క‌లిగిన‌ది.యువిసి లైట్ వ్య‌వ‌స్థ‌ద్వారా శ‌క్తిమంత‌మైన స్టెరిలైజింగ్‌ప్ర‌భావాన్ని క‌లిగి ఉంటాయి.  వ‌జ్ర‌క‌వ‌చ్ -ఈ (కెఇ) ఆక్సిడేష‌న్‌, ఎలక్ట్రోస్టాటిక్ డిశ్చార్జ్‌,యువిసి లైట్ స్పెక్ట్ర‌మ్ ద్వారా వైర‌స్‌, బాక్టీరియాను ఇత‌ర మైక్రోబియల్‌స్ట్రెయిన్‌ల‌ను  న‌శింప‌చేస్తుంది.దీనివ‌ల్ల పిపిఇ,మెడిక‌ల్‌,నాన్ మెడిక‌ల్ గేర్‌ల‌ను తిరిగి వాడ‌డానికి  వీలు క‌లుగుతుంది. ఇన్‌ఫ్లాక్స్ వాట‌ర్ సిస్ట‌మ్‌లు డిఎస్‌టి (ఐఐటి బొంబాయి ద్వారా) నీటిరంగంలో ఆవిష్క‌ర‌ణ‌ల‌కు నిధి ప్ర‌యాస్ గ్రాంటుతోప్రారంభ‌మైంది. ఈ సంస్థ కోవిడ్ -19 ఇన్ఫెక్ష‌న్‌ను ఎదుర్కొనేందుకు  సాంకేతిక ప‌రిజ్ఞానంలో త‌గిన‌ మార్పులు చేయ‌డానికి వీలుగా సిఎడ‌బ్ల్యుఎసిహెచ్ గ్రాంటును వాడుకుంది.  ఈ సంస్థ ఆయా ప్ర‌దేశాల‌ను క్రిమిర‌హితం చేసే పరిక‌రాల‌ను  నెల‌కు 25 త‌యారు చేసేందుకు  సిద్ధ‌మైంది.  ఆ తర్వాత ప్ర‌తి నెల‌లో త‌న ఉత్ప‌త్తి సామ‌ర్ధ్యాన్ని 25 శాతం మేర‌కు పెంచేందుకు ఏర్పాట్లు చేసింది.  ప్ర‌స్తుతం వారు ఐఐటి బొంబాయి, హైద‌రాబాద్‌లోని సిసిఎంబి వారి వైరాల‌జీ ప‌రిశోధ‌న శాల తో మ‌రిన్ని ప‌రీక్ష‌ల‌కు స‌మ‌న్వ‌యం చేసుకుంటున్నారు. ఈ స్టార్ట‌ప్ త‌న ఉత్ప‌త్తిని వాణిజ్య ప‌రంగా సిద్ధం  చేస్తోంది. అలాగే ఈ ఉత్ప‌త్తి స‌ర్టిఫికేష‌న్‌ను మెరుగుపరిచేందుకు కృషి  చేస్తోంది. దీనివ‌ల్ల ప్ర‌త్యేక ప‌రిశోధ‌న‌శాల‌లు కూడా ఈ సొల్యూష‌న్‌ను వాడ‌డానికి వీలు క‌లుగుతుంది.
    కోయంబ‌త్తూరుకు చెందిన ఈటా ప్యూరిఫికేన్ సంస్థ అధునాత‌న స్టెరిలైజేష‌న్ సొల్యూష‌న్‌ను ఆఫ‌ర్‌చేస్తోంది. ఇది ప‌ర్యావ‌ర‌ణ ప‌రంగా మేలైన మైక్రో కావిటీ ప్లాస్మా టెక్నాల‌జీ ని వాడుతోంది. ఈ వినూత్న సాంకేతిక ప‌రిజ్ఞానం కింద గాలి లేదా ఆక్సిజ‌న్ నుంచి క్ర‌మిసంహార‌కాన్ని ఉత్ప‌త్తి చేస్తుంది. సంప్ర‌దాయ ర‌సాయ‌న క్ర‌మిసంహారానికి ప్ర‌త్యామ్నాయంగా ఇది ప‌నికివ‌స్తుంది.  కాస్మో ప‌ద్ధ‌తి కోవిడ్ -19 వైర‌స్ సోకిన ప్రాంతాల‌ను అత్యంత వేగంగా క్రిమిర‌హితం చేయ‌గ‌ల‌దు.క్వారంటైన్ స‌దుపాయాలు, ప‌రిక‌రాలు, వివిధ ప్రాంతాల‌ను ఇది క్రిమిర‌హితం చేస్తుంది. ఈ క్రిమి సంహార‌కం అక్క‌డిక‌క్క‌డే త‌యారౌతుంది క‌నుక ,  ర‌సాయ‌నిక క్రిమిసంహార‌కం ర‌వాణా,నిల్వ వంటి అవ‌స‌రాలు ఉండ‌వు. నిధుల కొర‌త ఎదుర్కొంటున్న ప్ర‌స్తుత ప‌రిస్థితుల‌లో ఇది ఎంతో ఉప‌యోగ‌క‌రం. ఆస్ప‌త్రులు,ఆరోగ్య సంర‌క్ష‌ణ ప్రాంతాల‌కు వాటికి స‌రిపడే రీతిలో కంపెనీ వివిధ ప‌రిష్కారాల‌ను రూపొందించింది. ప్రస్తుతం వారు రూపొందించిన‌మైక్రో ప్లాస్మా ఆక్సిడేష‌న్ వ్య‌వ‌స్థ పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయ‌డం జ‌రిగింది. వాణిజ్య అవ‌స‌రాల‌కు దీనిపై క‌ఠిన ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు.

 

                                          
            .  చేతితో తాక‌కుండా ఉండే విధంగా అధునాత‌న మెకానిక‌ల్ హ్యాండ్ శానిటైజింగ్ యంత్రం ఆవిష్కృత‌మైంది. చెన్నై కి చెందిన స్టార్ట‌ప్ మైక్రో గో దీనిని అభివృద్ధిచేసింది. దీనిని డాష్ బోర్డు ద్వారా మానిట‌ర్ చేస్తారు.  పూణే కి చెందిన బ‌యో సొల్యూష‌న్స్  నానో ఆల్క‌హాలిక్ లిక్విడ్ శానిటైజ‌ర్ ఆధారిత  సిల్వ‌ర్ నానో పార్టిక‌ల్స్‌ను అభివృద్ధి చేశారు . వారి సాంకేతిక ప‌రిజ్ఞానం పేటెంట్‌కు పెండింగ్ లో ఉంది. ఇది వైర‌స్ వ్యాప్తిని అరిక‌ట్టి, ఆయాప్రదేశాల‌పై గ్లైకో ప్రోటీన్‌వ్యాప్తిని అరిక‌డుతుంది.  దీనితో వైర‌స్ నిర్వీర్య‌మౌతుంది.
ఇక మైక్రోవేవ్ ఆధారిత స్టెరిలైజ‌ర్ అతుల్య‌,మైక్రోవేవ్ స‌హాయంతో కోల్డ్ స్టెరిలైజేష‌న్ ప‌రిక‌రం ఆప్టిమాసెర్‌,అత్యంత ప్ర‌మాద‌క‌ర‌మైన బ‌యో మెడిక‌ల్ వ్య‌ర్ధాల‌ను క్రిమిర‌హితం చేయ‌డానికి ఉప‌యోగ‌ప‌డుతుంది. దీనివ‌ల్ల పిపిఇలు తిరిగి వాడ‌డానికి వీలు క‌లుగుతుంది. దీనిని ల‌క్నోకు చెందిన మాసెర్ టెక్నాల‌జీ ఆఫ‌ర్ చేస్తోంది. ఆప్టిమాసెర్ అనేది మైక్రోవేవ్ ఆధారిత కోల్డ్ స్టెరిలైజేష‌న్  పద్ధతి.

        

 


ఇది పిపిఇ కిట్లు , మాస్క్‌లు స్టెరిలైజ్ చేసి క్రిమిర‌హితం చేయ‌డంతోపాటు 100 సార్లు తిరిగి వాడుకోవ‌డానికి ఉప‌క‌రిస్తుంది. దీనివ‌ల్ల ఎంతో ఖ‌ర్చు క‌లిసి వ‌స్తుంది. అతుల్య ఇన్‌స్టంట్ మైక్రోవేవ్ ఆధారిత స్టెరిలైజ‌ర్‌.
   ఇంక్యుబేట‌ర్లు అయిన ఎస్‌.ఐ.ఎన్‌.ఇ ఐఐటి బొంబాయి ఎఫ్ఐఐటి , ఐఐటి ఢిల్లీ, ఎస్ఐఐసి,ఐఐటి కాన్పూరు,హెచ్‌టిఐడి, ఐఐటి మద్రాస్‌, వెంచ‌ర్ సెంట‌ర్‌, పూణె, ఐకెపి నాలెడ్జిపార్క్‌,హైదరాబాద్‌, కెఐఐటి-టిబిఐ, భువ‌నేశ్వ‌ర్‌లు సాంకేతిక పురోగ‌తిపై స‌కాలంలో స‌ల‌హాలు ఇచ్చాయి. స్టార్ట‌ప్‌ల‌కు త‌గిన మార్గ‌ద‌ర్శనం చేశాయి.
డిఎస్‌టి కార్య‌ద‌ర్శి ప్రొఫెస‌ర్ అశుతోష్‌శ‌ర్మ మాట్లాడుతూ,కోవిడ్ -19 సంబంధిత ఉత్ప‌త్తులు,,సాంకేతిక ప‌రిజ్ఞానాలు ,భార‌త‌దేశ అద్భుత‌ శాస్త్ర‌సాంకేతిక పునాది, ఆధునిక‌ విజ్ఞానానికి రూప‌క‌ల్ప‌న చేసేందుకు , దానిని వినియోగించేందుకు ఉప‌క‌రించాయి. ఇందుకు సంబంధించిన నిర్మాణాలు, ప్ర‌క్రియ‌ల‌ను , రానున్న సైన్సు, టెక్నాల‌జీ, ఇన్నొవేష‌న్ పాల‌సీ 2020లో చేర్చ‌డం జ‌రుగుతుంద‌ని చెప్పారు.


(Release ID: 1667691) Visitor Counter : 195