యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
కొవిడ్ పాజిటివ్‌గా తేలిన పారా ఆర్చర్ అంకిత్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్; 10 రోజులు ఇంటి నుంచి కదలొద్దని సూచన
నాడు పోస్టు చేయడమైనది:
23 OCT 2020 7:00PM by PIB Hyderabad
కొవిడ్ పాజిటివ్‌గా తేలి, ఈనెల 13న సోనెపట్ ఆస్పత్రిలో చేరిన పారా ఆర్చర్ అంకిత్ ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు. మరో 10 రోజుల వరకు ఇంటికే పరిమితం కావాలని వైద్యులు సూచించారు. కుటుంబ సభ్యులు వచ్చి, అంకిత్‌ను ఆస్పత్రి నుంచి ఇంటికి తీసుకెళ్లారు.
సోనెపట్‌లోని సాయ్‌లో నిర్వహిస్తున్న జాతీయ శిక్షణ శిబిరంలో ఈనెల 5వ తేదీన అంకిత్ చేరారు. ఆ సమయంలో కొవిడ్ నెగెటివ్ నివేదికను అధికారులకు సమర్పించారు. ప్రామాణిక కార్యాచరణ విధానం ప్రకారం, 12వ తేదీన శిక్షణ కేంద్రంలో అతని నుంచి నమూనాలు సేకరించి పరీక్షించగా, పాజిటివ్‌గా తేలింది.
***
(రిలీజ్ ఐడి: 1667165)
సందర్శకుల సూచీ సంఖ్య : : 133