రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ

రిజిస్ట్రేషన్ పత్రాలలో దివ్యంగ్జన్ యాజమాన్యాన్ని చేర్చడానికి సవరణను MoRTH తెలియజేస్తుంది

Posted On: 23 OCT 2020 3:39PM by PIB Hyderabad

రిజిస్ట్రేష‌న్ స‌మ‌యంలో వాహ‌నాల యాజ‌మాన్య వివ‌రాల‌ను స్వాధీనం చేసుకొనేందుకు సిఎమ్‌విఆర్ 1989 చ‌ట్టంలోని ఫార్్మ 20లో స‌వ‌ర‌ణ చేసేందుకు గురువారం నాడు రోడ్డు, ర‌వాణా, హైవేల మంత్రిత్వ శాఖ నోటిఫికేష‌న్ జారీ చేసింది. 
మోటార్ వాహ‌నాలు న‌మోదు చేసుకునేట‌ప్పుడు సిఎంవిఆర్ కింద నింపవ‌ల‌సిన వివిధ ఫార్మ్‌ల‌లో యాజ‌మాన్య వివ‌రాలు స‌రిగా ప్ర‌తిఫ‌లించ‌డంలేద‌నే విష‌యం మంత్రిత్వ శాఖ దృష్టికి వ‌చ్చింది. 
ఈ నేప‌థ్యంలో, సిఎంవిఆర్ 1989లోని ఫార్మ్ 20ని యాజ‌మాన్య వివ‌రాల‌ను క‌చ్చితంగా న‌మోదు చేసేందుకు - 4ఎ యాజ‌మాన్య వ‌ర్గం - స్వ‌తంత్ర ప్ర‌తిప‌త్తి గ‌ల సంస్థ‌, కేంద్ర ప్ర‌భుత్వ‌, చారిట‌బుల్ ట్ర‌స్ట్‌, డ్రైవింగ్ శిక్ష‌ణ సంస్థ‌, దివ్యాంగులు (ఎ) జిఎస్‌టి రాయితీ వినియోగించుకుంటున్న‌వారు (బి) జిఎస్‌టి రాయితీని వినియోగించుకోనివారు, విద్యా సంస్థ‌, ప్ర‌బుత్వ సంస్థ‌, వ్య‌క్తిగ‌త‌, స్థానిక సంస్థ‌ల‌, ప‌లువురు య‌జ‌మానులు, ఇత‌రులు, పోలీస్ శాఖ‌, రాష్ట్ర ప్ర‌భుత్వ, రాష్ట్ర ర‌వాణా శాఖ‌/  కార్పొరేష‌న్‌. 
వివిధ ప్ర‌భుత్వ ప‌థ‌కాల కింద కొనుగోలు/  యాజ‌మాన్యం/  మోటార్ వాహ‌నాల కార్య‌క‌లాపం జిఎస్‌టి, ఇత‌ర రాయితీల‌ను దివ్యాంగుల‌కు అంద‌జేస్తున్నారు. సిఎమ్‌విఆర్ 1989 కింద ప్ర‌స్తుత వివ‌రాలు, యాజ‌మాన్య వివ‌రాలలో దివ్యాంగ పౌరుల‌ వివ‌రాలు ప్ర‌తిఫ‌లించ‌డం లేదు.  దివ్యాంగ్ జ‌న ప‌థ‌కం వంటి అనేక వివిధ ప్ర‌భుత్వ ప‌థ‌కాలు కింద భారీ ప‌రిశ్ర‌మ‌లు అందించే ఆర్ధిక ప్ర‌యోజ‌నాల‌ను వినియోగించుకోవ‌డం అటువంటి పౌరుల‌కు క‌ష్టం అవుతుంది. ప్ర‌తిపాదిత స‌వ‌ర‌ణ‌ల‌తో అటువంటి వారి యాజ‌మాన్య వివ‌రాలు స‌రిగ్గా ప్ర‌తిఫ‌లించి, దివ్యాంగులు వివిధ ప‌థ‌కాల కింద అందుబాటులో ఉన్న లాభాల‌ను వినియోగించుకోవ‌చ్చు. 
ప్ర‌జ‌ల నుంచి ఈ మేర‌కు సూచ‌న‌ల‌ను, వ్యాఖ్య‌ల‌ను 19 ఆగ‌స్టు నాడు కోర‌డం జ‌రిగింది. 

 (Release ID: 1667072) Visitor Counter : 34