రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ

ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (20-21) మొదటి రెండు త్రైమాసికాల్లో హెచ్ఐఎల్

530.10 మెట్రిక్ టన్నుల మలాథియాన్ టెక్నికల్‌ను 40 శాతం అధికంగా ఉత్పత్తి చేసింది

ఈ అద్భుత విజయాన్ని సాధించినందుకు కేంద్ర మంత్రి డివి సదానంద గౌడ హెచ్ఐఎల్ బృందాన్ని అభినందించారు

Posted On: 22 OCT 2020 12:16PM by PIB Hyderabad

కేంద్ర రసాయనాలు  ఎరువుల మంత్రిత్వ శాఖ పరిధిలోని ప్రభుత్వరంగ సంస్థ (పిఎస్ యు) అయిన హెచ్ఐఎల్ (ఇండియా) లిమిటెడ్ 20-21 ఆర్థిక సంవత్సరంలో మొదటి రెండు త్రైమాసికాలలో అత్యధికంగా మలాథియాన్ టెక్నికల్ ఉత్పత్తిని సాధించింది. కోవిడ్-19 మహమ్మారి కారణంగా ఆంక్షలు ఉన్నప్పటికీ, కంపెనీ మొదటి రెండు త్రైమాసికాలలో 530.10 మెట్రిక్ టన్నుల మలాథియాన్ టెక్నికల్‌ను తయారు చేసింది. గత ఆర్థిక సంవత్సరంలో ఇదే కాలం ఉత్పత్తి 375.5 మెట్రిక్ టన్నులతో పోలిస్తే  41 శాతం వృద్ధిని నమోదు చేసింది.

ఈ సంస్థ మొదటి రెండు త్రైమాసికాలలో అత్యధికంగా మలాథియాన్ అమ్మకాలను సాధించింది. మొత్తం నిల్వలను వ్యవసాయ మంత్రిత్వ శాఖ  మిడతల నియంత్రణ కార్యక్రమానికి, కీటకాల నియంత్రణ కార్యక్రమాల కోసం దేశవ్యాప్తంగా మునిసిపల్ కార్పొరేషన్ల వంటి వివిధ స్థానిక ప్రభుత్వ సంస్థలకు సరఫరా చేసింది.  మలాథియాన్ టెక్నికల్‌ను విదేశాంగ మంత్రిత్వ శాఖ ద్వారా ఇదే కాలంలో ఇరాన్కు ఎగుమతి చేసింది. భారత ప్రభుత్వం నుంచి ఇరాన్ ప్రభుత్వానికి అధికారికంగా సరఫరా జరిగింది.

***



(Release ID: 1666911) Visitor Counter : 96