సిబ్బంది, ప్రజా ఫిర్యాదులు మరియు పింఛన్ల మంత్రిత్వ శాఖ

జి -20 అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్ యొక్క మొట్టమొదటి మంత్రివర్గ సమావేశంలో ప్రసంగించిన - కేంద్ర మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నేతృత్వంలోని భారతదేశం అవినీతి మరియు లెక్క లోకి రాని డబ్బుకు వ్యతిరేకంగా సహించని విధానానికి కట్టుబడి ఉంది : డాక్టర్ జితేంద్ర సింగ్

Posted On: 22 OCT 2020 7:28PM by PIB Hyderabad

ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ ఆధ్వర్యంలో అవినీతి నిర్మూలనకు భారతదేశం తన నిబద్ధతను పునరుద్ఘాటించింది.  జి -20 అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్ యొక్క మొట్టమొదటి మంత్రివర్గ సమావేశంలో,  కేంద్ర విదేశాంగ శాఖ మంత్రి (ఇండిపెండెంట్ ఛార్జ్), ఈశాన్య ప్రాంత అభివృద్ధి (డి.ఓ.ఎన్.ఈ.ఆర్), పి.ఎం.ఓ, సిబ్బంది, ప్రజా పిర్యాదులు, పింఛన్లు, అణుశక్తి మరియు అంతరిక్ష శాఖల సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ మాట్లాడుతూ,  శ్రీ మోడీ నేతృత్వంలోని భారతదేశం అవినీతి మరియు లెక్క లోకి రాని డబ్బుకు వ్యతిరేకంగా సహించని విధానానికి కట్టుబడి ఉందని, అన్నారు. దీనిని అనుసరించి, గత 6 సంవత్సరాలుగా మోడీ ప్రభుత్వం అనేక రకాల కార్యక్రమాలు చేపట్టిందని ఆయన అన్నారు.     

భారత అవినీతి నిరోధక చట్టం-1988 గురించి, డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రస్తావిస్తూ, మోడీ ప్రభుత్వం 30 సంవత్సరాల తరువాత, దీనిని, 2018 లో సవరించి, లంచం తీసుకోవడంతో పాటు లంచం ఇచ్చే చర్యను నేరంగా పరిగణించడంతో సహా అనేక కొత్త నిబంధనలను ప్రవేశపెట్టింది.  మరియు అదే సమయంలో వ్యక్తులు మరియు కార్పొరేట్ సంస్థలచే ఇటువంటి చర్యలకు సమర్థవంతమైన నిరోధాన్ని ఉంచడం జరిగింది

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఆదేశాల మేరకు తీసుకువచ్చిన ప్రస్తుత చట్టం పెద్ద ప్రదేశాలలో అవినీతిని తనిఖీ చేయడం మరియు కార్పొరేట్ లంచాలకు వ్యతిరేకంగా తీవ్రమైన చర్య తీసుకోవడం లక్ష్యంగా ఉందని డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారు.  అసలు లంచం ఇచ్చేవారు కూడా బహిర్గతమయ్యే విధంగా ఇది ఒక బాధ్యతను స్థాపించడానికి ప్రయత్నిస్తుంది.

మరింత పారదర్శకత, మరింత పౌరుల కేంద్రీకృతం మరియు పాలనలో మరింత జవాబుదారీతనం తీసుకురావాలన్నదే, ప్రస్తుత ప్రభుత్వం యొక్క నిబద్ధత అని,  మరియు ఉన్నత స్థాయిల్లో అవినీతిని తనిఖీ చేయడానికి దేశంలోని లోక్ ‌పాల్ సంస్థను అమలు చేయడానికి దాని నిర్ణయాత్మక కార్యక్రమాల ద్వారా సూచించబడుతుందని, డాక్టర్ జితేంద్ర సింగ్ పేర్కొన్నారు. 

ప్రపంచం ప్రస్తుతం జాతీయ అధికార పరిధిలో పారిపోయిన ఆర్ధిక నేరస్థులు మరియు అక్రమ ఆస్తుల పెరుగుదల వంటి సవాళ్లను ఎక్కువ సంఖ్యలో ఎదుర్కొంటున్నట్లు జి-20 సమావేశ ప్రతినిధి బృందానికి గుర్తు చేయడం జరిగింది.   భారతదేశం యొక్క ఫ్యుజిటివ్ ఆర్ధిక నేరస్థుల చట్టం, 2018 నేరారోపణ ఆధారిత అటాచ్మెంట్లు మరియు నేరాలు మరియు ఆస్తుల ఆదాయాన్ని జప్తు చేయడానికి మరియు ఫ్యుజిటివ్ ఆర్ధిక నేరస్థుని ఆస్తులను జప్తు చేయడానికి అధికారులకు అధికారం ఇస్తుందని, ఆయన తెలిపారు

నిందితులు విదేశాల్లో ఆశ్రయం పొందడం మరియు నేరాల ద్వారా వచ్చిన ఆదాయాన్ని దాచడం వంటి సమస్యలను కూడా నిలిపివేసినట్లు డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు.  అంతర్జాతీయ సంస్థల సహాయంతో జి-20 అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్ ఈ పోరాటాన్ని సరైన దిశలో ముందుకు తీసుకువెళుతోందని భారతదేశం తన ప్రశంసలను అందజేసిందని ఆయన తెలియజేశారు.

కరోనా నేపథ్యంలో, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి జి-20 అవినీతి నిరోధక వర్కింగ్ గ్రూప్ చేసిన కృషిని డాక్టర్ జితేంద్ర సింగ్ ప్రశంసిస్తూ, అవినీతిని నిర్మూలించడానికి కోవిడ్ కూడా మన పోరాటాన్ని మరియు ఉద్యమాన్ని నిరోధించదని పేర్కొన్నారు. 

తన 10 వ వార్షికోత్సవ సంవత్సరంలో జి-20 మంత్రివర్గ సమావేశాన్ని నిర్వహించినందుకు సౌదీ అరేబియా అధ్యక్షుడిని, డాక్టర్ జితేంద్ర సింగ్, అభినందించారు. అవినీతి బెదిరింపులను ఎదుర్కోవటానికి స్థిరమైన వేగవంతమైన మరియు బలమైన ఉద్యమం కోసం ప్రపంచం కలిసి వస్తుందన్న ఆకాంక్షను ఆయన వ్యక్తం చేశారు. 

<><><>



(Release ID: 1666906) Visitor Counter : 769