ఆర్థిక మంత్రిత్వ శాఖ

ఐఎఫ్‌ఎస్‌సీలో ఆర్‌ఈఐటీలు, ఇన్విట్‌ల కోసం నియంత్రణ విధానాన్ని ప్రకటించిన ఐఎఫ్‌ఎస్‌సీఏ

Posted On: 21 OCT 2020 6:38PM by PIB Hyderabad

స్థిరాస్తి పెట్టుబడి ట్రస్టులు (ఆర్‌ఈఐటీలు), మౌలిక సదుపాయాల పెట్టుబడి ట్రస్టులు (ఇన్విట్‌లు) కోసం నియంత్రణ విధానాన్ని 'ఇంటర్నేషనల్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ సెంటర్స్‌ అథారిటీ' (ఐఎఫ్‌ఎస్‌సీఏ) ప్రకటించింది. 'గుజరాత్‌ ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌ టెక్‌సిటీ ఇంటర్నేషనల్‌ ఫైనాన్స్‌ సర్వీసెస్‌ సెంటర్‌' (గిఫ్ట్‌ ఐఎఫ్‌ఎస్‌సీ)లో ఆర్థిక కార్యకలాపాలు, సేవలను పెంపొందించే లక్ష్యంతో ఈ విధానాన్ని సూచించింది.

    గిఫ్ట్‌ ఐఎఫ్ఎస్‌సీలోని స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదుకు, ఎఫ్‌ఏటీఎఫ్‌ పరిధిలో ఉన్న ఆర్‌ఈఐటీలు, ఇన్విట్‌లు వంటి ప్రపంచ భాగస్వాములకు ఐఎఫ్‌ఎస్‌సీఏ అనుమతినిచ్చింది. దీంతోపాటు, ప్రైవేట్ పెట్టుబడుల ద్వారా నిధులు సేకరించడానికి కూడా ఇన్విట్‌లకు అనుమతి లభించింది.
    
    స్థిరాస్తులు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల్లో పెట్టుబడులకు, ముఖ్యంగా ఐఎఫ్‌ఎస్‌సీ భారత్‌, విదేశీ పరిధుల్లో పెట్టుబడులు పెట్టడానికి ఐఎఫ్‌ఎస్‌సీలో నమోదైన ఆర్‌ఈఐటీలు, ఇన్విట్‌లకు అనుమతి వచ్చింది. ప్రపంచ ఆర్థిక కేంద్రాల విధానాలకు అనుగుణంగా ఈ అనుమతి లభించింది.

    ఐఎఫ్‌ఎస్‌సీ లేదా భారత్‌ కాకుండా (ప్రస్తుతానికి అమెరికా, జపాన్‌, దక్షిణ కొరియా, యూకే, ఫ్రాన్స్‌, జర్మనీ, కెనడా, భారత్‌) ఇతర అనుమతించదగిన పరిధిలో నమోదైన ఆర్‌ఈఐటీలు, ఇన్విట్‌లు.. ఐఎఫ్‌ఎస్‌సీలోని గుర్తింపు పొందిన స్టాక్ ఎక్స్ఛేంజీల్లో నమోదు కావడానికి, వ్యాపారం చేయడానికి అనుమతి దొరికింది. ఇది వారి స్వదేశీ అధికార పరిధికి అనుగుణంగా ఉంటుంది.

    ఐఎఫ్‌ఎస్‌సీలో ఆర్‌ఈఐటీలు, ఇన్విట్‌ల నమోదు; ఐఎఫ్‌ఎస్‌సీలోని స్టాక్ ఎక్స్ఛేంజీల అవసరాలకు అనుగుణంగా ఉంటుంది.

    ఐఎఫ్‌ఎస్‌సీలోని సంస్థలు, అంతర్జాతీయంగా స్థిరాస్తి, మౌలిక సదుపాయాల రంగాల్లో పెట్టుబడులు పెట్టి, ప్రయోజనం పొందవచ్చు.

    ఆర్‌ఈఐటీలు, ఇన్విట్‌ల విధానంపై మరిన్ని వివరాలను ఐఎఫ్‌ఎస్‌సీఏ వెబ్‌సైట్‌లో https://ifsca.gov.in/Circular లింక్‌ ద్వారా చూడవచ్చు.

***(Release ID: 1666631) Visitor Counter : 78