సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

వినూత్నంగా ఖాదీతో పాదరక్షలు ఆవిష్కరించిన శ్రీ నితిన్ గడ్కరీ 5000 కోట్ల రూపాయల వ్యాపార లక్ష్యం

Posted On: 21 OCT 2020 4:03PM by PIB Hyderabad

ఇక చేతులతో అందంగా సౌకర్యవంతంగా ఉండే విధంగా తయారుచేసిన పాదరక్షకలను ధరించి దేశ ప్రజలు హుందాగా నడవవచ్చును. దేశంలో తొలిసారిగా వినూత్నంగా, ఆధునికంగా ఖాదీ మరియు గ్రామీణ పరిశ్రమల కమిషన్ (KVIC) రూపొందించిన ఈ పాదరక్షలను కేంద్ర చిన్న మరియు సూక్ష్మ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ నితిన్ గడ్కరీ ఈ రోజు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఆవిష్కరించారు. పట్టు,నూలు , ఉన్నితో తయారుచేసే ఈ పాదరక్షలను కమిషన్ ఈ పోర్టల్ www.khadiindia.gov.in అమ్మకాలను కూడా ఆయన ప్రారంభించారు.

 

ఖాదితో పాదరక్షలను రూపొందించడంపట్ల హర్షం వ్యక్తం చేసిన శ్రీ గడ్కరీ అంతర్జాతీయ మార్కెట్లో వీటికి గిరాకీ ఉంటుందని అన్నారు. ఆదాయాన్ని ఆర్జించడంతో పాటు వీటి ద్వారా మరిన్ని ఉపాధి అవకాశాలను కల్పించడానికి చేతివృత్తి కళాకారుల ఆదాయాన్ని పెంపొందించవచ్చునని అన్నారు.

"ఖాదీ పాదరక్షలు ఒక వినూత్నమైన ఉత్పత్తి. ఫొటోల సిల్క్, బనారసీ సిల్క్, నూలు,నూలు రంగు వస్త్రంతో చేసిన ఇవి యువతను తప్పనిసరిగా ఆకర్షిస్తాయి. ఆన్ లైన్ లో వీటిని కొనుగోలు చేయవచ్చును. వీటి ధర కూడా అందరికి అందుబాటులో ఉంటుంది" అని శ్రీ గడ్కరీ పేర్కొన్నారు. తోలుతో తయారు చేస్తున్న మహిళలు ఉపయోగించే చేతి సంచులు, పర్సులు, వాలెట్ లకు ప్రత్యామ్నాయంగా ఖాదితో వస్తువులను రూపొందించాలని శ్రీ గడ్కరీ సంస్థకు సూచించారు. ఈ వస్తువులకు విదేశీ మార్కెట్లో గిరాకీ ఉంటుందని అన్నారు. ఈ వస్తువుల విక్రయాలతో 5000 కోట్ల రూపాయల ఆదాయాన్ని పొందవచ్చునని మంత్రి అన్నారు.

కేంద్ర చిన్న మరియు సూక్ష్మ పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రతాప్ చంద్ర సారంగి మాట్లాడుతూ ఖాదితో చేసిన పాదరక్షల వల్ల పర్యావరణానికి ఎలాంటి హాని కలగదని, చర్మం కూడా సురక్షితంగా ఉంటుందని అన్నారు. ఈ వినూత్న ఉత్పత్తి మన దేశ చేతి వృత్తులవారి నైపుణ్యానికి దర్పణం పడుతున్నాయన్నారు. " అంతర్జాతీయ ప్రమాణాల మేరకు ఖాదితో పాదరక్షలను రూపొందించిన సంస్థను నేను ప్రత్యేకంగా అభినందిస్తున్నాను. పాదరక్షల రంగంలో సమూల మార్పులకు ఇవి నాంది పలుకుతాయి. దీనివల్ల మన ఆర్ధిక వ్యవస్థకు మరిన్ని జవసత్వాలు వస్తాయి" అని శ్రీ సారంగి తెలిపారు.

ప్రస్తుతానికి ఖాదీ పాదరక్షలను మహిళలు పురుషుల కోసం రూపొందిస్తున్నారు. పురుషుల కోసం 10 డిజైన్లు, మహిళలు కోసం 15 డిజైన్లలో వీటిని రూపొందించారు. వీటి తయారీలో గుర్తింపు పొందిన ఫొటోల సిల్క్(గుజరాత్ ),బనారసీ సిల్క్, బీహార్ మధుబని సిల్క్, మట్కా కతియా సిల్క్ తో పాటు పలు రకాల నూలు ఉత్పత్తులను ఉపయోగించడం జరిగింది. వీటిని ఆకర్షణీయంగా తీర్చిదిద్దడానికి వివిధ రకాల ఉన్నిని ఉపయోగించారు. వివిధ రకాల డిజైన్లు, రంగులతో రూపొందే వీటిని మహిళలు పురుషులు తాము ధరించే వస్త్రాలకు అనుగుణంగా ధరించవచ్చును. ఒక జత పాదరక్షల ధర 1100 రూపాయల నుంచి 3300 రూపాయల వరకు ఉంటుంది.

ప్రధానమంత్రి సూచించిన విధంగా తమ సంస్థ నూతన ఆవిష్కరణలతో సరికొత్త మార్గాలతో మార్కెట్లోకి ప్రవేశిస్తున్నది సంస్థ చైర్మన్ శ్రీ. వినయ్ కుమార్ తెలిపారు. ప్రాంధానమంత్రి సూచించిన మంత్రాలతో గత ఆరు సంవత్సరాలుగా సంస్థ ప్రగతి బాటలో పయనిస్తున్నాడని ఆయన అన్నారు. " అంతర్జాతీయ మార్కెట్లో ఉన్న అవకాశాలను గుర్తించి ఖాదీతో పాదరక్షలను రూపొందించాము. నూతన వస్తువుల కోసం అంతర్జాతీయ వినియోగదారులు ఎదురు చూస్తున్నారు. వారి అవసరాలను ఖాదీ తీరుస్తుంది " అని ఆయన అన్నారు. " ఖాదీ పాదరక్షలు ప్రజలకు చిన్న అంశంగా కనిపించవచ్చును . అయితే ఖాదీ కళాకారులకు ఇది అతి పెద్ద ముందడుగు. వీటి తయారీలో ఉపయోగించే ముడి సరకుల తయారీ పుంజుకుంటుంది. దీనివల్ల మరిన్ని ఉపాధి అవకాశాలు లభించడంతోపాటు చేతివృత్తి కళాకారుల ఆదాయం పెరుగుతుంది." అని శ్రీ వినయ్ కుమార్ అన్నారు. ప్రస్తుతం భారతదేశంలో పాదరక్షల మార్కెట్లో 50,000 కోట్ల రూపాయల వ్యాపారం జరుగుతున్నదని తెలిపారు. ఎగుమతుల ద్వారా 18,000 కోట్ల రూపాయల ఆదాయం వస్తున్నదని ఆయన వివరించారు. తొలుత ఈ మార్కెట్లో 1000 కోట్ల రూపాయల మార్కెట్ ను హస్తగతం చేసుకుని 1000 కోట్ల రూపాయలను ఆర్జించాలని నిర్ణయించామని ఆయన చెప్పారు.

"స్థానికం నుంచి అంతర్జాతీయం" అంటూ ప్రధానమంత్రి ఇచ్చిన పిలుపులో భాగంగా ఖాదితో పాదరక్షకులకు రూపకల్పన చేయడం జరిగింది. ఇంతకూ ముందు టైటాన్ సంస్థతో కలసి చేతి వాచీలను రూపొందించి సంస్థ గుర్తింపు సాధించింది.

***



(Release ID: 1666630) Visitor Counter : 199