రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

స్లినెక్స్‌-20 పేరిట ట్రింకోమ‌లీలో భారత - శ్రీలంక నావికా దళం సంయుక్త విన్యాసాలు


Posted On: 18 OCT 2020 6:11PM by PIB Hyderabad

శ్రీ‌లంక‌లోని ట్రింకోమ‌లీలో ‌భార‌త నావికా ద‌ళం (ఐఎన్‌) - శ్రీ‌లంక నావికాద‌ళం (ఎస్ఎల్ఎన్‌) సంయుక్తంగా నౌకద‌ళ విన్యాసాల్ని జ‌రుప‌నున్నాయి. ఈ నెల 19వ తేదీ నుంచి 21వ‌ తేదీ వ‌ర‌కు ఈ విన్యాసాలు జ‌రుగునున్నాయి. శ్రీ‌లంక దేశం త‌ర‌పున ఆ దేశ‌ నావికా దళానికి చెందిన ఫ్లాగ్ ఆఫీసర్ కమాండింగ్ నావల్ ఫ్లీట్ రేర్ అడ్మిరల్ బండారా జయతిలకా నేతృత్వంలోని ఎస్‌ఎల్‌ఎన్ నౌక సయూరా (ఆఫ్‌షోర్ పెట్రోల్ వెసెల్ నౌక‌), గజబాహు (ట్రైనింగ్ షిప్) ఈ విన్యాసాల‌లో ప్రాతినిధ్యం వహించ‌నున్నాయి. దేశీయంగా నిర్మించిన ఎఎస్‌డబ్ల్యు కొర్వెట్ట‌స్ కమోర్తా, కిల్తానందర్‌తో స‌హా ఈశాన్య ఫ్లీట్‌ కమాండింగ్ ఫ్లాగ్ ఆఫీసర్ రియర్ అడ్మిరల్ సంజయ్ వాత్సాయన్‌లు భారత  దళానికి ఈ విన్యాసాల‌లో ప్రాతినిధ్యం వహించ‌నున్నారు. దీనికి తోడు ఆయా నౌక‌ల్లో ఏర్పాటు చేసిన భార‌త‌ నేవీ 'అడ్వాన్స్‌డ్ లైట్ హెలికాప్టర్‌‌' (ఏఎల్‌హెచ్), చేత‌క్ హెలికాప్టర్ ఆన్‌బోర్డ్ ఇన్‌షిప్‌ల‌తో స‌హా ఈ విన్యాసాల‌లో భాగం కానున్నాయి. వీటితో పాటుగా మారిటైమ్ పెట్రోల్ ఎయిర్ ‌క్రాఫ్ట్ డోర్నియర్ కూడా ఈ విన్యాసాల్లో పాల్గొననుంది. గ‌త ఏడాది (2019లో) స్లినెక్స్-19 నావికా ద‌ళ విన్యాసాలు మ‌న దేశంలో గ‌ల‌ విశాఖ‌ప‌ట్నం న‌గ‌రంలో నిర్వ‌హించారు.

స్లినెక్స్‌-20 ఇంటర్-ఆప‌రేట‌బులిటీని మెరుగుపరచడం, పరస్పర అవగాహన మెరుగుపరచడం, రెండు నావికాదళాల మధ్య బహుముఖ సముద్ర కార్యకలాపాల కోసం ఉత్తమ పద్ధతులు మరియు విధానాలను మార్పిడి చేయడం లక్ష్యంగా నిర్వ‌హించబడుతోంది. దీనికి తోడు ఈ విన్యాసాల్లో దేశీయంగా నిర్మించిన నావికా దళపు ఓడలు, విమానాల సామర్థ్యాల్ని ప్రదర్శించ‌నున్నారు. ఆయుధ కాల్పులు, సీమన్‌షిప్ పరిణామాలు, విన్యాసాలు, క్రాస్ డెక్ ఫ్లయింగ్ కార్యకలాపాలతో సహా ప‌లు ఉపరితల, యాంటీ ఎయిర్ ఎక్స‌ర్‌సైజ్‌లు కూడా ఈ ఏడాది ఎడిష‌న్ విన్యాసాల స‌మ‌యంలో ప్రణాళిక చేయబడ్డాయి.

ఈ విన్యాసాలు రెండు స్నేహపూర్వక నావికాదళాల మధ్య ఇప్పటికే ఏర్పాటు చేయబడిన అత్యున్న‌తపు ఇంట‌ర్-ఆప‌రేట‌బులిటీ సామర్థ్యాన్ని మరింత పెంచుతుంది. స్లినెక్స్ పేరిట వ‌రుస విన్యాసాలు నిర్వ‌హించ‌డం భారతదేశం మరియు శ్రీలంక మధ్య లోతైన ఒడంబ‌డిక‌కు ఉదాహరణ. ఈ విన్యాసాలు సముద్ర క్షేత్రంలో త‌గిన పరస్పర సహకారాన్ని బలోపేతం చేస్తోంది. ప్ర‌ధాన మంత్రి ఆలోచ‌న మేర‌కు నైబర్ ‌హుడ్ ఫస్ట్విధానంతో పాటుగా భార‌త్ పోరుగు ప్రాంతంలో ఉన్న‌ అందరికీ భద్రత మరియు వృద్ధి (సాగర్)అంశాల‌కు అనుగుణంగా ఇటీవలి కాలంలో ఎస్ఎల్ఎన్‌, ఐఎన్ మధ్య పరస్పర చ‌ర్చ‌ల‌ను గణనీయంగా పెరిగాయి. స్లినెక్స్ విన్యాసాల సమయంలో అభివృద్ధి చెందిన‌ సినర్జీ ఫలితంగా గ‌త‌ సెప్టెంబ‌రులో శ్రీలంక యొక్క తూర్పు తీరంలో అతి పెద్ద ముడి చ‌మురు తీసుకుపోయే నౌక (వీఎల్‌సీసీ) న్యూ డైమండ్‌లో చెల‌రేగిన భారీ మంట‌ల‌ను అర్పివేసే ప్ర‌క్రియ‌లో రెండు దేశాల నావికా ద‌ళాలు నిరంత‌రాయ ప్ర‌య‌త్నాల‌ను కొన‌సాగించాయి. ఈ ఏడాది కోవిడ్‌-19 మ‌హ‌మ్మారి నేప‌థ్యంలో ఎలాంటి కాంటాక్ట్ లేని ఎట్-సీ-ఓన్లీవిధానంలో ఈ విన్యాసాలు జరుగునున్నాయి.

*****



(Release ID: 1665713) Visitor Counter : 267