రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌

బ్రహ్మోస్ సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణి భారత నేవీ యొక్క రహస్య విధ్వంసక నౌక ఐఎన్ఎస్ చెన్నై నుండి విజయవంతంగా పరీక్ష


Posted On: 18 OCT 2020 1:12PM by PIB Hyderabad

బ్రహ్మోస్, సూపర్సోనిక్ క్రూయిజ్ క్షిపణిని భారత నావికా దళం దేశీయంగా నిర్మించిన స్టీల్త్ డిస్ట్రాయర్ (రహస్య విధ్వంస నౌక) ఐఎన్ఎస్ చెన్నై నుండి విజయవంతంగా పరీక్షించారు, అరేబియా సముద్రంలో లక్ష్యాన్ని చేధించారు. క్షిపణి అధిక-స్థాయి మరియు చాలా సంక్లిష్టమైన పరీక్షా విన్యాసాల తర్వాత ఖచ్చితత్వంతో లక్ష్యాన్ని విజయవంతంగా ఛేదించింది. 'ప్రైమ్ స్ట్రైక్ ఆయుధం' గా బ్రహ్మోస్ నావికాదళ ఉపరితల లక్ష్యాలను సుదూర పరిధిలో కేంద్రీకృతం చేయడం ద్వారా యుద్ధనౌక యొక్క అజేయతను నిర్ధారిస్తుంది, తద్వారా విధ్వంసక నౌక ద్వారా  లక్ష్యాన్ని విధ్వంసం చేయగలిగే వేదికగా మారుతోంది భారత నేవీ.

అత్యంత బహుముఖ బ్రహ్మోస్ ను భారత్ రష్యా సంయుక్తంగా రూపకల్పన, అభివృద్ధి మరియు ఉత్పత్తి చేసింది. విజయవంతంగా ఈ క్షిపణిని ప్రయోగించిన డిఆర్డిఓ, బ్రహ్మోస్, భారత నావికాదళాన్ని రక్షణ మంత్రి శ్రీ రాజ్‌నాథ్ సింగ్ అభినందించారు.

ప్రయోగం విజయవంతం చేసిన శాస్త్రవేత్తలు మరియు డిఆర్డిఓ, బ్రహ్మోస్, ఇండియన్ నేవీ మరియు పరిశ్రమల సిబ్బందిని డిడిఆర్-డి కార్యదర్శి,  ఛైర్మన్ డిఆర్డిఓ డాక్టర్ జి సతీష్ రెడ్డిఅభినందించారు. భారత సాయుధ దళాల సామర్థ్యాలకు బ్రహ్మోస్ క్షిపణులు మరింత జోడించాయని ఆయన పేర్కొన్నారు.

*****

 


(Release ID: 1665654)