ప్రధాన మంత్రి కార్యాలయం

మైసూర్ విశ్వవిద్యాలయం శ‌త‌వార్షిక స్నాత‌కోత్స‌వం-2020లో ప్ర‌సంగించ‌నున్న ప్ర‌ధాన మంత్రి మోడీ


Posted On: 17 OCT 2020 7:39PM by PIB Hyderabad

మైసూర్ విశ్వవిద్యాలయం శ‌త‌వార్షిక స్నాత‌కోత్స‌వం-2020లో ప్రధాన మంత్రి శ్రీ నరేంద్ర మోడీ ప్ర‌సంగించ‌నున్నారు. ఈ నెల 19న జ‌రిగే వేడుక‌లో ఉద‌యం 11:15 గంటలకు ప్ర‌ధాని వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రసంగించనున్నారు. ఈ కార్యక్రమంలో కర్ణాటక గవర్నర్‌తో పాటు విశ్వవిద్యాలయ ఇతర ప్రముఖులు హాజరవ‌నున్నారు. ఈ వేడుక‌లో ఆన్‌లైన్ ద్వారా సిండికేట్ మరియు అకాడెమిక్ కౌన్సిల్ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, స్టాట్యుటరీ ఆఫీసర్లు, జిల్లా అధికారులు, విశ్వవిద్యాలయం మాజీ వైస్ ఛాన్సలర్లు మరియు విద్యార్థులు వారి తల్లిదండ్రులు కూడా పాల్గొన‌నున్నారు.


విశ్వవిద్యాలయం గురించి


మైసూర్ విశ్వవిద్యాలయం 1916 జూలై 27న స్థాపించబడింది. ఇది దేశంలోనే 6వ‌ విశ్వవిద్యాలయం మరియు కర్ణాటక రాష్ట్రంలో మొదటిది. విశ్వవిద్యాలయం యొక్క నినాదం 'నహి జ్ఞానేనా సద్రిషమ్' అంటే 'జ్ఞానానికి సమాన‌మైన‌ది మ‌రేది లేదు' అని అర్థం‌. ఈ విశ్వవిద్యాలయాన్ని మైసూరు సంస్థాన మ‌హారాజా దూర‌దృష్టితో ఏర్పాటు చేశారు. శ్రీ నల్వాడి కృష్ణరాజ వడియార్, అప్పటి దివాన్ సర్ ఎం.వి. విశ్వేశ్వరయ్యల గొప్ప‌త‌నంగా ఈ విశ్వ‌విద్యాల‌యాన్ని చెప్ప‌వ‌చ్చు.
                             

   ******

 

 


(Release ID: 1665562) Visitor Counter : 200