కార్మిక, ఉపాధికల్పన మంత్రిత్వ శాఖ
మరింత డిఎ పొందనున్న ప్రభుత్వ ఉద్యోగులు అంటూ శీర్షికన కొన్ని పత్రికలలో వచ్చిన వార్తలను తోసిపుచ్చిన కేంద్ర కార్మిక శాఖ
प्रविष्टि तिथि:
16 OCT 2020 5:02PM by PIB Hyderabad
ప‌్రభుత్వ ఉద్యోగులకు పెరుగనున్న అధిక ధరల భత్యం (డిఎ) అన్న శీర్షికతో శుక్రవారం ఉదయం వెలువడిన కొన్ని పత్రికలలో వచ్చిన వార్తలను కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ తోసి పుచ్చింది. ప్రభుత్వ ఉద్యోగులకు, పరిశ్రమలలో పని చేసే కార్మికులకు జీతంలో పెరుగుతుందని నూతన సూచికలో ఎక్కడా పేర్కొనలేదంటూ ఆ వార్తలను కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖ ఖండించింది.
కార్మిక, ఉపాధి శాఖకు అనుబంధంగా ఉన్నకార్మిక బ్యూరో 2016వ సంవత్సరం మూల ఏడాదిగా తీసుకుని పారిశ్రామిక సిబ్బందికి నూతన వినియోగదారుల ధరల సూచీని (సిపిఐ - ఐడబ్ల్యు)ను అక్టోబర్ 21వ తేదీన విడుదల చేయనుంది. వ్యవస్థీకృత రంగంలో ప్రభుత్వ సిబ్బందికి, కార్మికులకు ఇవ్వవలసిన అధిక ధరల భత్యాన్ని సవరించేందుకు ఈ సూచీ ఉపయోగపడింది. అయితే, ఈ నూతన సూచీ ప్రభుత్వ ఉద్యోగులు, పారిశ్రామిక రంగ కార్మికుల జీతాల పెరుగుదలకు దారి తీస్తుందని కార్మిక మంత్రిత్వ శాఖ ఎప్పుడూ చెప్పలేదు. అది నూతన పరంపర ప్రవర్తనపై ఆధారపడి ఉంటుంది. ఈ దశలో దానిని ఊహించిచెప్పడం తొందరపాటు, అని స్పష్టీకరణ చేసింది.
***
(रिलीज़ आईडी: 1665208)
आगंतुक पटल : 170