గ్రామీణాభివృద్ధి మంత్రిత్వ శాఖ

గ‌రీబ్ క‌ల్యాణ్ రోజ్‌గార్ అభియాన్' కింద చురుగ్గా సాగుతున్న నిర్మాణ ప‌నులు

- 16వ వారం నాటికి 4.31 లక్షలకు పైగా గ్రామీణ గృహాలు, 1.37 లక్షల నీటి సంరక్షణ నిర్మాణాలు, 38,287 పశువుల షెడ్లు, 26,459 వ్యవసాయ చెరువులు, 17,935 కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్సుల నిర్మాణం

Posted On: 15 OCT 2020 5:54PM by PIB Hyderabad

'గ‌రీబ్ క‌ల్యాణ్ రోజ్‌గార్ అభియాన్'‌ (జీకేఆర్ఏ) ల‌క్ష్య‌ సాధనలో భాగంగా వివిధ ర‌కాల నిర్మాణ ప‌నులు చురుగ్గా సాగుతున్నాయి. జీకేఆర్ఏ కింది 1,37,787 నీటి సంరక్షణ నిర్మాణాలు, 4,31,640 గ్రామీణ గృహాలు, 38,287 పశువుల కొట్టాలు, 26459 వ్యవసాయ చెరువులు, 17935 కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్‌ల నిర్మాణం
చేప‌ట్ట‌డం జ‌రిగింది. జిల్లా ఖనిజ నిధుల ద్వారా మొత్తంగా 7,816 పనుల‌ను  చేపట్టారు. 2,123 గ్రామ పంచాయతీలకు ఇంటర్నెట్ కనెక్టివిటీని అందించారు.
ఘన మరియు ద్రవ వ్యర్థ పదార్థాల నిర్వహణకు సంబంధించిన మొత్తం 22,592
ప‌నుల‌ను చేప‌ట్టారు. అభియాన్ సందర్భంగా 'కృషి విజ్ఞాన కేంద్రాల' (కేవీకే) ద్వారా 65,374 మంది అభ్యర్థులకు నైపుణ్య శిక్షణ ఇవ్వబడింది. 16వ వారం నాటికి మొత్తం 33 కోట్ల ప‌ని దినాల‌ ఉపాధిని కల్పించారు. అభియాన్ లక్ష్యాల సాధన కోసం ఇప్పటి వరకు దాదాపుగా రూ.33,114 కోట్ల మేర నిధుల‌ను ఖర్చు చేశారు. కోవిడ్‌-19 మ‌హ‌మ్మారి వ్యాప్తి నేపథ్యంలో త‌మ త‌మ గ్రామాలకు తిరిగి వచ్చే‌స్తున్న వలస కార్మికులకు, గ్రామీణ ప్రాంతంలోని పౌరులకు త‌గిన ఉపాధి, జీవనోపాధి అవకాశాలను పెంచడానికి గాను జీకేఆర్ఏ ప్రారంభించబడింది. తమ సొంత గ్రామాలకు తిరిగి వచ్చిన వలస కార్మికులకు అభియాన్‌లో భాగంగా త‌గిన‌ ఉపాధి కల్పించేందుకుగాను ఆరు రాష్ట్రాల‌లో మిషన్ మోడ్‌లో అవ‌స‌ర‌మైన త‌గు చర్యలు చేప‌డుతున్నారు. అభియాన్ ఇప్పుడు ఈ ఆరు రాష్ట్రాల్లోని దాదాపు 116 జిల్లాల్లో జీవనోపాధి అవకాశాల్ని క‌ల్పిస్తూ స్థానికంగా గ్రామస్తులను త‌గు విధంగా శక్తివంతం చేస్తోంది. అభియాన్ ఇప్పటివరకు సాధించిన విజయం మొత్తం 12 మంత్రిత్వ శాఖలు/ డిపార్ట్‌మెంట్లు, ఆయా రాష్ట్ర ప్రభుత్వాల యొక్క సంయుక్త‌ ప్రయత్నంగా చెప్ప‌వ‌చ్చు. అభియాన్‌లో భాగంగా చేప‌ట్టిన‌ కార్య‌క్ర‌మాలు వ‌లస కార్మికులకు, గ్రామీణ వర్గాల వారికి అధిక మొత్తంలో త‌గిన ప్రయోజనాన్ని కలుగ ‌జేస్తున్నాయి. తిరిగి వ‌చ్చిన వ‌ల‌స కార్మికులు ఇక్క‌డే ఉండాలని నిర్ణ‌యించిన‌
నేప‌థ్యంలో వారికి ఉద్యోగాలు మరియు జీవనోపాధి కోసం దీర్ఘకాలిక చొరవతో దీర్ఘకాలిక చర్యలతో అభియాన్‌లో వేదిక సిద్ధమైంది.

***



(Release ID: 1664922) Visitor Counter : 219