నౌకారవాణా మంత్రిత్వ శాఖ

'ఓడ‌ల రీసైక్లింగ్ జాతీయ ప్రాధికారిక సంస్థ'ను నోటిఫై చేసిన షిప్పింగ్ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్

- 'రీసైక్లింగ్ ఆఫ్ షిప్పింగ్‌ యాక్ట్-2019' మేర‌కు భారత ఓడల‌ రీసైక్లింగ్ పరిశ్రమకు అత్యున్న‌త అథారిటీగా వ్య‌వ‌హ‌రించ‌నున్న షిప్పింగ్ డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్‌

- గుజరాత్‌లోని గాంధీనగర్‌లో జాతీయ ప్రాధికారిక సంస్థ కార్యాలయ ఏర్పాటు

Posted On: 15 OCT 2020 1:46PM by PIB Hyderabad

'ఓడల రీసైక్లింగ్ చట్టం-2019' సెక్షన్ 3 ప్రకారం ఓడల రీసైక్లింగ్ కోసం నేష‌న‌ల్ అథారిటీగా షిప్పింగ్ విభాగ డైరెక్టర్ జనరల్‌ను‌(డీజీని) కేంద్ర ప్రభుత్వం నోటిఫై చేసింది. దేశంలో ఓ‌డ‌ల రీసైక్లింగ్‌కు సంబంధించిన‌ అత్యున్న‌త సంస్థ‌గా ఓడ‌ల రీసైక్లింగ్‌కు సంబంధించిన అన్ని కార్యకలాపాల్ని నిర్వహించేందుకు, త‌గిన‌ట్లు ప‌ర్యవేక్షించేందుకు గాను డీజీ షిప్పింగ్‌కు అధికారం ఉంటుంది. షిప్ రీసైక్లింగ్ పరిశ్రమ యొక్క స్థిరమైన అభివృద్ధిని, షిప్ రీసైక్లింగ్ పరిశ్రమలో పనిచేసే వారి కోసం త‌గిన భద్రత మరియు ఆరోగ్య చర్యల్ని పాటించేలా పర్యవేక్షిస్తుంది. దీనికి తోడు పర్యావరణ అనుకూలమైన నిబంధనలు ప‌రిశ్ర‌మ‌లు పాటించేలా కూడా ఈ సంస్థ పర్యవేక్షిస్తుంది. షిప్-రీసైక్లింగ్ యార్డ్ యజమానులతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలకు అవసరమైన వివిధ ఆమోదాలకు సంబంధించి డీజీ షిప్పింగ్‌దే తుది అధికారం అవుతుంది. 'షిప్ రీసైక్లింగ్ చట్టం- 2019' మేర‌కు ఇంట‌ర్‌నేష‌న‌ల్‌ మారిటైమ్ ఆర్గనైజేషన్ (ఐఎంఓ) కింద షిప్ రీసైక్లింగ్ కోసం హాంకాంగ్ కన్వెన్షన్‌కు భారత్ అంగీకరించింది. ఐఎంఓలో భారతదేశ ప్రతినిధిగా డీజీ షిప్పింగ్ వ్య‌వ‌హ‌రిస్తారు. ఐఎంఓకు సంబంధించిన‌‌ అన్ని స‌మావేశాల‌కు డీజీ షిప్పింగ్ హాజ‌రుకానున్నారు. ఈ జాతీయ ప్రాధికారిక సంస్థ కార్యాల‌యాన్ని గుజరాత్ రాష్ట్రం‌లోని గాంధీనగర్‌లో ఏర్పాటు చేయ‌నున్నారు. గుజ‌రాత్‌లో ఈ కార్యాల‌యం ఏర్పాటు చేయ‌డంతో గుజరాత్‌లోని అలంగ్ ఉన్న షిప్ రీసైక్లింగ్ యార్డ్ యజమానులకు ప్రయోజనం చేకూర‌నుంది. ప్రపంచంలో షిప్‌ బ్రేకింగ్, రీసైక్లింగ్ పరిశ్రమ విభాగంలో అలంగ్ ఆసియాలోనే అతిపెద్ద కేంద్రంగా ఉంది. 

***


(Release ID: 1664875) Visitor Counter : 213