రైల్వే మంత్రిత్వ శాఖ

ప్రైవేటు పెట్టుబడితో చిన్న/ రహదారుల పక్కన ఉన్న స్టేషన్ లలో గూడ్స్ షెడ్ల అభివృద్ధి

మార్గదర్శకాలను విడుదల చేసిన రైల్వే మంత్రిత్వ శాఖ

ప్రస్తుతం పనిచేస్తున్న గూడ్స్ షెడ్లను అభివృద్ధి చేసి ప్రైవేటు భాగస్వామ్యంతో కొత్త షెడ్లను నిర్మించడం ద్వారా

సౌకర్యాల పెంపుకు దోహదపడే విధంగా నూతన విధాన లక్ష్యం

Posted On: 15 OCT 2020 5:01PM by PIB Hyderabad

సరకుల రవాణా సామర్ధ్యాన్ని పెంపొందించుకోడానికి నూతనంగా గూడ్స్ షెడ్లను నిర్మించడం మరియు ప్రస్తుతం ఉన్న షెడ్లను అధివృధి చేసే అంశంలో ప్రైవేటు పెట్టుబడులకు అనుమతి ఇవ్వాలని రైల్వే మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. నిధుల కొరత వల్ల ప్రస్తుతం పనిచేస్తున్న గూడ్స్ షెడ్లను రైల్వేలు అధివృధి చేయలేకపోతున్నాయి. సామర్ధ్యాన్ని పెంపొందించుకోడానికి చిన్న రైల్వే స్టేషన్లు మరియు రహదారులకు సమీపంలో ఉన్న స్టేషన్లలో గూడ్స్ షెడ్లను నిర్మించడంతో పాటు ప్రస్తుతం పనిచేస్తున్న షెడ్లను అధివృధి చేసే అంశంలో ప్రైవేటు పెట్టుబడులకు అవకాశం కల్పిస్తూ నూతన విధానానికి రూపకల్పన చేసింది.

     ఈ విధానంలో ప్రధాన అంశాలు ఇలా ఉన్నాయి...

* సరకులను నిల్వ చేయడానికి, సరకులను దించడం/ ఎక్కించడానికి సౌకర్యాలను కల్పించడం, కార్మికులు విశ్రాంతి తీసుకోవడానికి ( విశ్రాంతి తీసుకోడానికి షెడ్లు, తాగునీరు,స్నానం గదులు లాంటి సౌకర్యాలు) సౌకర్యాలు కల్పించడం, చేరడానికి రహదారులు వేయడం, పైకప్పుతో షెడ్లను నిర్మించడంతో పాటు సంబంధిత మౌలిక సదుపాయాలను కల్పించడం లాంటి కార్యక్రమాలను ప్రైవేట్ పార్టీలు తమ సొంత నిధులతో చేపట్టవలసి ఉంటుంది.

* ప్రతిపాదిత  అభివృద్ధి  పనులు రైల్వేలు ఆమోదించే డిజైన్లు, రైల్వేల ఆమోదించిన  ప్రమాణాలు మరియు నిర్దేశించే విధానాలకు లోబడి జరగవలసి ఉంటుంది.

* నిర్మాణ కార్యక్రమాలపై రైల్వేలు శాఖాపరమైన లేదా ఇతర రుసుములను వసూలు చేయవు.

*ప్రైవేట్ సంస్థలు కల్పించే సౌకర్యాలను అన్ని సౌకర్యాలతోపాటు సమానంగా పరిగణించడం జరుగుతుంది.ఇతర ఖాతాదారులతో పాటు నిర్మాణ  సంస్థకు చెందిన ఖాత్తదారులను ఒకేవిధంగా పరిగణించడం జరుగుతుంది. నిర్మాణ సంస్థ ఖాతాదారులకు సౌకర్యాలను కేటాయించే  అంశంలో  ఎటువంటి ప్రాధాన్యత ఇవ్వబడదు.

* ఒప్పందం అమలులో ఉన్నంత కాలం ఆస్తులు, సౌకర్యాల నిర్వహణా బాధ్యత ప్రైవేట్ సంస్థలపై ఉంటుంది.

* పధకం కింద అందించే ప్రోత్సాహకాలు ... పని పూర్తి అయిన తేదీ నుంచి అయిదు సంవత్సరాలపాటు గూడ్స్ షెడ్ ద్వారా వచ్చి పోయే సరకుల రవాణాపై టెర్మినల్ చార్జీలు మరియు టెర్మినల్ ను వినియోగించుకొన్నందుకు వసూలు చేసే చార్జీలలో ( ఏది వర్తిస్తే అది ) వాటా.

* చార్జీలలో తక్కువ వాటాను కోరే సంస్థలను పోటీ బిడ్ల ద్వారా డివిజన్ స్థాయిలో ఎంపిక చేయడం జరుగుతుంది.

* అందుబాటులో ఉండే స్థలంలో ఏర్పాటు చేసే చిన్న కాంటీన్లు / టీ దుకాణాలు, ప్రకటనలు తదితర మార్గాల ద్వారా వచ్చే ఆదాయం ప్రైవేట్ సంస్థలకు దక్కుతుంది.

***


(Release ID: 1664874) Visitor Counter : 196