రైల్వే మంత్రిత్వ శాఖ
రైతులకు భారీ ప్రోత్సాహకం..కిసాన్ రైలు సరుకు రవాణా చార్జీల్లో గుర్తించిన కొన్ని రకాల పండ్లు మరియు కూరగాయలకు 50 శాతం సబ్సిడీ.
మామిడి, అరటి,జామ, కివి, లిచి, బొప్పాయి, బత్తాయి, నారింజ, కిన్నో, నిమ్మ, పైనాపిల్, దానిమ్మ, జాక్‌ఫ్రూట్, ఆపిల్, బాదం, అయోన్లా, పాషన్ ఫ్రూట్ , పియర్ వంటి పండ్లు మరియు
ఫ్రెంచ్ బీన్స్, కాకర, వంకాయ, క్యాప్సికమ్, క్యారెట్, కాలీఫ్లవర్, పచ్చిమిర్చి, దొండ, దోసకాయ, బఠానీలు, వెల్లుల్లి, ఉల్లిపాయ, బంగాళాదుంప మరియు టమోటాలకు ఈ ప్రయోజనం తక్షణం
వర్తిస్తుంది.
‘ఆపరేషన్ గ్రీన్స్ -టాప్ టు టోటల్’ పథకం కింద గుర్తించిన పళ్లు, కూరగాయల రవాణాపై 50 శాతం రాయితీని కల్పించాలని
రైల్వే మంత్రిత్వ శాఖ మరియు ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖలు నిర్ణయించాయి.
కిసాన్ రైళ్లలో ఈ రాయితీ 14.10.2020 నుండి అమల్లోకివస్తుంది.
Posted On:
15 OCT 2020 2:14PM by PIB Hyderabad
కిసాన్ రైల్ సేవలను ఉపయోగిస్తున్న రైతులకు మరింత మద్దతు ప్రోత్సాహం అందించడంలో భాగంగా గుర్తించిన కొన్నిరకాల పండ్లు మరియు కూరగాయల రవాణాలో 50% రాయితీని
కల్పించాలని రైల్వే మంత్రిత్వ శాఖ మరియు ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖలు నిర్ణయించాయి. (ఆపరేషన్ గ్రీన్స్ - టాప్ టు టోటల్' పథకం కింద ) కిసాన్ రైల్‌కు ఈ రాయితీ
నేరుగా మంజూరు చేయబడుతుంది. దీని కోసం అవసరమైన నిధులను రైల్వే మంత్రిత్వ శాఖకు ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ అందిస్తుంది.
ఈ రాయితీ 14.10.2020 నుండి కిసాన్ రైల్ ట్రైన్ సర్వీసులకు వర్తిస్తుంది.
సబ్సిడీ పొందేందుకు అర్హత గల పదార్ధాలు:
పండ్లు- మామిడి, అరటి,జామ, కివి, లిచి, బొప్పాయి, బత్తాయి, నారింజ, కిన్నో, నిమ్మ, పైనాపిల్, దానిమ్మ, జాక్‌ఫ్రూట్, ఆపిల్, బాదం, అయోన్లా, పాషన్ ఫ్రూట్ , పియర్;
కూరగాయలు- ఫ్రెంచ్ బీన్స్, కాకర, వంకాయ, క్యాప్సికమ్, క్యారెట్, కాలీఫ్లవర్, పచ్చిమిర్చి, దొండకాయలు, దోసకాయ, బఠానీలు, వెల్లుల్లి, ఉల్లిపాయ, బంగాళాదుంప మరియు టమోటాల
వ్యవసాయ మంత్రిత్వ శాఖ లేదా రాష్ట్ర ప్రభుత్వాల సిఫారసు ఆధారంగా భవిష్యత్తులో ఏదైనా ఇతర పండ్లు / కూరగాయలను ఈ జాబితాలో చేర్చవచ్చు.
వ్యవసాయ ఉత్పత్తులు దేశంలోని ఒక మూల నుండి మరో మూలకు త్వరితగతిన చేర్చడం ద్వారా అటు రైతులకు ఇటు వినియోగదారులకు ప్రయోజనం కల్పించేందుకు కిసాన్ రైల్ సేవలు
ఉపయోగపడపడుతున్నాయి. చిన్న రైతులు మరియు చిన్న వ్యాపారుల అవసరాలను తీర్చడంతో పాటు వారి ఆదాయాన్ని పెంచే ప్రయత్నంలో కిసాన్ రైలు గేమ్ ఛేంజరే కాదు లైప్ ఛేంజర్
అని కూడా రుజువు చేస్తోంది.
ఇబ్బందులు లేని మరియు చౌకైన, వేగవంతమైన రవాణా సేవల ద్వారా కిసాన్ రైలు రైతుల జీవితాలను మారుస్తుంది. అలాగే వేగవంతమైన సరకు రవాణా ద్వారా ఆహార పదార్దాలు
కుళ్లిపోవడం, పాడైపోవడం వంటి ఇబ్బందులు రైతులకు ఎదురుకావు. తద్వారా రైతులు తమ ఆదాయాన్ని పెంచుకునే అవకాశం లభిస్తుంది.
ప్రస్తుతం కిసాన్ రైల్ సర్వీసుల వివరాలు:
* మొదటి కిసాన్ ఎక్స్ ప్రెస్ రైలు దేవ్ లాలి(నాసిక్, మహారాష్ట్ర) నుండి దానపూర్ (పాట్నా, బీహార్) వరకు 07.08.2020 న వీక్లీ సర్వీసుగా ప్రారంభమైంది. ఈ రైలుకు రైతుల నుండి మంచి ప్రజాధరణ లభించడంతో ముజఫర్ పూర్ (బీహార్)వరకూ అనంతరం పొడిగించారు. అలాగే సర్వీసు కూడా వారానికి ఒకరోజు నుండి రెండు రోజులకు పెంచారు. సంగ్లా నుండి పూణే వరకూ నడిచే అదనపు కోచ్ లను కూడా ఈ రైలుకు మన్మాడ్ వద్ద కలుస్తున్నాయి.
* రెండవ కిసాన్ రైలు- అనంతపురం (ఆంధ్రప్రదేశ్) నుండి ఆదర్శ్ నగర్ ఢిల్లీ వరకు - 09.09.2020 న వారపు సర్వీస్ గా ప్రారంభమయింది
* మూడవ కిసాన్ రైలు - బెంగళూరు (కర్ణాటక) నుండి హజ్రత్ నిజాముద్దీన్ (ఢిల్లీ) వరకూ - వారపు రైలుగా 09.09.2020 న ప్రారంభించబడింది.
* నాలుగవ కిసాన్ రైలు - నాగ్‌పూర్ & వార్దా ఆరెంజ్ సిటీ (మహారాష్ట్ర) నుండి ఆదర్శ్ నగర్ ఢిల్లీ వరకు - 14.10.2020 న ప్రారంభించబడింది.
సరుకు రవాణా రైళ్ల ద్వారా వ్యవసాయ ఉత్పత్తులను వీలైనంత ఎక్కువమొత్తంలో తరలించడానికి భారత రైల్వే నిరంతరం ప్రయత్నిస్తోంది . లాక్డౌన్ సమయంలో కూడా సరుకు రవాణా రైళ్ల ద్వారా అత్యవసర వస్తువులను భారతీయ రైల్వే ఓ ప్రాంతం నుండి మరో ప్రాంతానికి తరలించింది. తద్వారా దేశంలో ఏ ప్రాంతానికి కూడా సరుకురవాణాలో ఇబ్బందులు లేకుండా చూడగలిగింది. ఇక గోధుమలు, పప్పుధాన్యాలు, పండ్లు, కూరగాయలు వంటి పంటలను తరలించే రేక్‌ల సంఖ్యలో గణనీయమైన పెరుగుదల నమోదవుతోంది.
*****
(Release ID: 1664812)
Visitor Counter : 224
Read this release in:
English
,
Urdu
,
Hindi
,
Marathi
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Punjabi
,
Odia
,
Tamil
,
Malayalam