సూక్ష్మ‌, లఘు, మధ్య త‌ర‌హా సంస్థల మంత్రిత్వ శాఖష్

దేశంలోని ఎమ్.ఎస్.ఎమ్.ఈ. లకు సహాయం చేయడానికి వీలుగా, తన ఏక గవాక్ష విధానమైన ‘ఛాంపియన్స్’ పోర్టల్ ను బలోపేతం చేసేందుకు, కృత్రిమ మేధస్సు (ఐ.ఏ) మరియు మెషిన్ లెర్నింగ్ (ఎమ్.ఎల్) లను ప్రవేశపెడుతున్న - ఎమ్.ఎస్.ఎమ్.ఈ. మంత్రిత్వ శాఖ
ఎమ్.ఎస్.ఎమ్.ఈ. సంబంధిత సమస్యలు, ఫిర్యాదులను పరిశీలించి, వాటి శీఘ్ర మరియు సమర్థవంతమైన పరిష్కారాల కోసం మంత్రిత్వ శాఖ ఐ.ఏ. & ఎమ్.ఎల్. విధానాలను అమలు చేస్తుంది;

Posted On: 14 OCT 2020 6:38PM by PIB Hyderabad

మంత్రిత్వ శాఖకు చెందిన "ఛాంపియన్స్" పోర్టల్ ‌లోని ఈ క్రింది లింక్ పై క్లిక్ చేసి  “ఏ.ఐ. కార్నర్” వద్ద ఏ.ఐ. మరియు ఎమ్.ఎల్. విశ్లేషణలను చూడవచ్చు.

https://champions.gov.in/msme_grievances/news_opinion/analytics.htm

సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల (ఎం.ఎస్.‌ఎం.ఈ) సమస్యలకు సహాయం మరియు పరిష్కారాలను అందించడానికి కృత్రిమ మేధస్సు (ఎ.ఐ) మరియు మెషిన్ లెర్నింగ్ (ఎం.ఎల్) యొక్క తాజా ఐ.టి. సాధనాలపై ఎం.ఎస్.‌ఎం.ఈ. మంత్రిత్వ శాఖ ప్రధాన ప్రయత్నం చేసింది.  2020 జూన్, 1వ తేదీన ప్రధానమంత్రి ప్రారంభించిన ఏక గవాక్ష విధానం 'ఛాంపియన్స్' పై మంత్రిత్వ శాఖ ఏ.ఐ. మరియు ఎమ్.ఎల్. ను అమలు చేసింది.  ఈ మల్టీ-మోడల్ సిస్టమ్ వర్చువల్ స్థాయిలో ఒక పోర్టల్ మరియు దేశంలోని 69 ప్రదేశాలలో సాంకేతిక నియంత్రణ కలిగిన భౌతిక కంట్రోల్ రూములను కలిగి ఉంది.  చాలా తక్కువ వ్యవధిలో ఎం.ఎస్.ఈ.లకు ముందు మరుసలో ఉపయోగపడుతున్న ప్లాట్‌ ఫామ్‌ లలో ఇది ఒకటిగా అవతరించింది.

ఎమ్.ఎస్.ఎమ్.ఈ. మంత్రిత్వ శాఖ కోవిడ్-19 ను ఒక సవాలుగా తీసుకుంది, భవిష్యత్ జోక్యాలతో దీనిని ఒక అవకాశంగా మలచుకుంది.  ఈ క్లిష్ట కాలంలో, మంత్రిత్వ శాఖ ఎం.ఎస్.ఎం.ఈ. లకు హృదయపూర్వకంగా సంపూర్ణ మద్దతు ఇచ్చి, ఈ సంక్షోభాన్ని అవకాశంగా మార్చడానికి ప్రయత్నిస్తోంది.  అయితే, వాస్తవానికి వారి అడ్డంకులను అధిగమించి, ఒక నమూనా మార్పు చేసి, ఛాంపియన్లుగా మారేలా చేస్తోంది. 

పరిశ్రమ 4.0 దిశగా దేశాన్నీ, ఎం.ఎస్.‌ఎం.ఈ. లను తీసుకెళ్లడానికి తీవ్రంగా కృషి చేస్తున్నట్లు, ఎం.ఎస్.‌ఎం.ఈ. మంత్రిత్వ శాఖ తెలియజేసింది.  పరిశ్రమ 4.0 లో భాగంగా వర్గీకరించబడిన సాంకేతిక పరిజ్ఞానాన్ని తాను అవలంబించడంతో పాటు, ఎం.ఎస్.ఎం.ఈ. లను కూడా అవలంబించాలని, మంత్రిత్వ శాఖ ప్రోత్సహిస్తోంది.  సెన్సార్లు, మోటార్లు, కంప్యూటర్ డిస్-ప్లే లతో పాటు ఇతర యానిమేషన్ టెక్నాలజీలకు అవసరమైన మరియు ఉపయోగపడే ఉత్పత్తులను తయారు చేయడానికి కూడా మంత్రిత్వ శాఖ ఎమ్.ఎస్.ఎం.ఈ. లను ప్రోత్సహిస్తోంది.  ఈ క్రమంలో, మంత్రిత్వ శాఖ, తాను, ఇంతకుముందు వాగ్దానం చేసినట్లుగా, "ఛాంపియన్స్" పోర్టల్ ‌లో కృత్రిమ మేధస్సు (ఏ.ఐ) మరియు మెషిన్ లెర్నింగ్ (ఎమ్.ఎల్) లను అమలు చేసింది.  ఈ ప్రయత్నంలో ఇంటెల్ టెక్నాలజీ కంపెనీ భాగస్వామిగా వ్యవహరిస్తోంది.  ఈ రోజు నుండి వినియోగానికి సిద్ధంగా ఉన్న ఏ.ఐ. మరియు ఎమ్.ఎల్. యొక్క కొన్ని సాధనాలను అమలు చేయడంలో ఇంటెల్ గత ఐదు నెలలుగా మంత్రిత్వ శాఖకు మార్గనిర్దేశం చేసింది.  ఏ.ఐ. మరియు ఎం.ఎల్. యొక్క మొత్తం డొమైన్ ‌ను ఇంటెల్ మరియు దాని టెక్నాలజీ భాగస్వామి, తమ "ఛాంపియన్స్"  పోర్టల్‌ లో పూర్తిగా ఉచితంగా అమలు చేశాయని మంత్రిత్వ శాఖ తెలిపింది.

ఈ రోజు ఇంటెల్ నిర్వహించిన కృత్రిమ మేధస్సు సదస్సు సందర్భంగా, ఎం.ఎస్.ఎమ్.ఈ. శాఖ మంత్రి నితిన్ గడ్కరీ మాట్లాడుతూ, తమ మంత్రిత్వ శాఖ ఈ దిశగా చేసిన కృషిని  వివరించారు.  ఇండియా ప్రో-బోనోకు ఈ సేవలు అందజేసినందుకు, ఇంటెల్ మరియు దాని భాగస్వామికి ఆయన ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు.  ఎన్.‌ఐ.సి. సహాయంతో మరియు ఇంటెల్ యొక్క స్థానిక బృందం మార్గదర్శకత్వంలో మొత్తం భావన, పరిధి విశ్లేషణ మరియు రూపకల్పన మంత్రిత్వ శాఖ స్వంతంగా పూర్తిచేసిందని ఆయన చెప్పారు.  ఆయన, ఈ జట్లను హృదయపూర్వకంగా అభినందించారు. 

కృత్రిమ మేధస్సు గురించి: 

*          కృత్రిమ మేధస్సు అంటే - మనుషుల మాదిరిగా ఆలోచించడం, ప్రవర్తించడం మరియు నేర్చుకునే సామర్థ్యం గల యంత్రాలను తయారుచేసే ఆలోచన.

*          ఇది “రూల్-బేస్డ్ (ఎమ్.ఐ.ఎస్) ఆటోమేషన్స్” యంత్రాలు చేయలేని పనులను, నేర్చుకుని, అమలు చేసి, స్వీకరించి, పని చేయగల సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది.

ఈ దశలో, ఈ రోజు అమలు చేసినవి :

1.          సమగ్ర ప్రాతిపదికన ఇంతవరకు అందుబాటులో లేని ఫేస్‌బుక్, ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్, బ్లాగులు, ఫోరమ్‌లు మరియు ఆన్‌ లైన్ వార్తల ద్వారా ఎం.ఎస్.ఎం.ఈ. లకు సంబంధించిన ఎం.ఎస్.ఎం.ఈ. మంత్రిత్వ శాఖ సామాజిక మాధ్యమం ద్వారా సమాచారాన్ని ఏ.ఐ. ఇవ్వడం ప్రారంభించింది;

2.          ఇప్పటివరకు, ఫిర్యాదుల పరిష్కారానికి, ఛాంపియన్స్ పోర్టల్ ద్వారా వచ్చే ఫిర్యాదులు మరియు డేటాపై ఆధారపడి ఉండగా - ఇప్పుడు, భాగస్వాములు పోర్టల్‌కు వెళ్ల వలసిన అవసరం లేకుండా కూడా మొత్తం ఎం.ఎస్.ఎం.ఈ. రంగం యొక్క మొత్తం వివరాలను తెలుసుకోగలుగుతున్నామని మంత్రిత్వ శాఖ తెలియజేసింది. 

3.          ఎం.ఎస్.‌ఎం.ఈ. రంగానికి సంబంధించిన లేదా ఆధారపడిన వ్యక్తుల భావోద్వేగాలను నిజ సమయంలో తెలుసుకోవడం ఇప్పుడు సాధ్యమవుతుందని కూడా, మంత్రిత్వ శాఖ అధికారులు చెబుతున్నారు;

4.           అంతేకాకుండా, కృత్రిమ మేధస్సు సాధనాలు సులువుగా అర్థం చేసుకోగలిగే డేటా-ఆధారిత సమాచారాన్ని ప్రదర్శిస్తాయి. సమాచార నిర్వహణ విధానం (ఎమ్.ఐ.ఎస్) యొక్క సాంప్రదాయ సాధనాలలో అందుబాటులో లేని వివిధ రకాల సమాచారాన్ని అనేక విధాలుగా పొందడానికి అవకాశం ఉంటుంది;

5.          కేవలం నిపుణులు మాత్రమే కాకుండా, సాధారణ సిబ్బంది కూడా చర్య తీసుకోగల అంశాలను సులభంగా కనుగొనటానికి ఇది అనుమతిస్తుంది.

6.            సెంట్రల్ (హబ్ స్థాయి) లోని జట్లతో రియల్ టైమ్ లైవ్-డేటా లింకులుగా మరియు భారతదేశం అంతటా విస్తరించి ఉన్న ఛాంపియన్స్ కంట్రోల్ రూమ్‌ల ప్రతినిధులుగా సమాచార విశ్లేషకులు సులభంగా వ్యవహరిస్తారని,  ఒక అధికారి చెప్పారు; 

7.          ఇప్పుడు, విశ్లేషణ కోసం డేటాను తయారుచేసే శ్రమతో కూడిన పనిని ఏ.ఐ. చేయబోతోందని మంత్రిత్వ శాఖ భావిస్తోంది;  అందువల్ల, తమ మానవనరులను మరింత ఉత్పాదక పనిలో పాల్గొనడానికి వీలుగా మార్పు చేసుకోవచ్చు. 

ఈ ఉత్సాహం మరియు అవకాశంతో, ప్రస్తుతం అవి ప్రారంభమయ్యాయని మంత్రిత్వ శాఖ తెలిపింది:

*          ఫలితాలను పొందటానికి ఏ.ఐ. మరియు విశ్లేషణాత్మక సాంకేతిక పరిజ్ఞానంతో వారి "ఛాంపియన్స్" పోర్టల్‌ను ప్రారంభించడం మరియు పెంపొందించడం;

*          విస్తృతంగా అందుబాటులో ఉన్న సోషల్ మీడియా మరియు ఆన్ ‌లైన్ డేటా ఆధారంగా సమాచార మేధస్సు మరియు సెంటిమెంట్ విశ్లేషణలను కలిగి ఉన్న రియల్-టైం సమస్యలను అర్థం చేసుకోవడంలో ఇది వారికి సహాయపడుతుంది.

ఈ విధంగా మనం పొందుపరిచే సమాచారం మరియు జోక్యం ఒకవైపు మన సమాచార వనరులను మెరుగుపరుస్తుందనీ, మరోవైపు మన మానవ వనరులను విముక్తి చేస్తుందనీ, ఒక కార్యాలయం తెలియజేసింది. 

*          ప్రస్తుతం కృషి కొనసాగుతున్న తదుపరి దశ చాలా సులభంగా ఉంటుందని ఎమ్.ఎస్.ఎమ్.ఈ. మంత్రిత్వ శాఖ కూడా పేర్కొంది.  రెండవ దశ రియల్ టైమ్ ఫిర్యాదుల పరిష్కారం మరియు నిర్వహణ వైపు మళ్ళించబడుతోంది.  ఇందులో ఇవి ఉన్నాయి:

*          పోర్టల్ వినియోగదారుల ప్రశ్నలకు వేగంగా స్పందించడానికి వీలుగా ఏ.ఐ.తో కూడిన చాట్ బాట్స్ ద్వారా కంట్రోల్ రూమ్స్ మరియు అధికారుల పనితీరును మెరుగుపరచడం; 

*     సమర్థవంతమైన తీర్మానాలు, వాటాదారుల సంపూర్ణ సంతృప్తి కోసం "ఛాంపియన్స్" పోర్టల్ ద్వారా,  దాని ఏక గవాక్ష విధానం యొక్క మొత్తం పని వివరాలు మరియు ఫిర్యాదుల పరిష్కారానికి రియల్ టైమ్, వివరణాత్మక విశ్లేషణలను ఇవ్వాలి. 

*****(Release ID: 1664653) Visitor Counter : 131