ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ
'ఆపరేషన్ గ్రీన్స్' కింద సబ్సిడీ 'ఆత్మ నిర్భర్ భారత్' వైపు ఒక ముందడుగు: నరేంద్ర సింగ్ తోమర్
- 'ఆపరేషన్ గ్రీన్స్' పథకం కింద 50 శాతం రాయితీ
- 'కిసాన్ రైల్' పథకంలో సరుకు రవాణా రాయితీ కూడా..
Posted On:
14 OCT 2020 2:52PM by PIB Hyderabad
'ఆపరేషన్ గ్రీన్స్' కింద టాప్ టు టోటల్ కింద సబ్సిడీ అందించడం 'ఆత్మ నిర్భర్ భారత్' వైపు ఒక గొప్ప ముందడుగని గ్రామీణాభివృద్ధి, వ్యవసాయ, రైతు సంక్షేమ, పంచాయతీ రాజ్, ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీ నరేంద్ర సింగ్ తోమర్ అన్నారు. దూరదృష్టితో కూడిన ప్రధాని శ్రీ నరేంద్ర మోడీ నాయకత్వంలో ఆహార ప్రాసెసింగ్ పరిశ్రమల మంత్రిత్వ శాఖ ( ఎంఎఫ్‌పీఐ ) రైతుల కోసం వివిధ రకాల పథకాలను తీసుకువచ్చిందని మంత్రి వివరించారు. నిర్ధారిత ట్రిగ్గర్ ధర కంటే నోటిఫై చేసిన పండ్లు, కూరగాయల ధరలు దిగువకు చేరితే వాటి రవాణా, నిల్వలపై 50 శాతం రాయితీని అందిస్తోంది. ఎంఎఫ్‌పీఐకి ఆన్‌లైన్‌లో క్లయిమ్‌లను ప్రత్యక్షంగా సమర్పించడంతో పాటు ఇప్పుడిక 'కిసాన్ రైల్' పథకం కింద రాయితీ రవాణా కూడా సరళంగా లభిస్తుంది.రైతులతో సహా ఏ వ్యక్తి అయినా నోటిఫైడ్ పండ్లు మరియు కూరగాయల పంటలను కిసాన్ రైళ్ల ద్వారా రవాణా చేయవచ్చు. ఈ పండ్లు మరియు కూరగాయలపై రైల్వే 50 శాతం మేర సరుకు రవాణా ఛార్జీలను మాత్రమే వసూలు చేస్తుంది. మిగతా 50 శాతం మేర సరుకు రవాణా ఛార్జీలను ఆపరేషన్ గ్రీన్స్ పథకం కింద ఎంఎఫ్‌పీఐ భారత రైల్వేకు సబ్సిడీగా అందిస్తుంది. ఈ పథకానికి సంబంధించి సవరించిన పలు మార్గదర్శకాలను మంత్రిత్వ శాఖ 12.10.2020న తన వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసింది. కిసాన్ రైల్ పథకం ద్వారా రవాణా కోసం ఆపరేషన్ గ్రీన్స్ - టాప్ టు టోటల్ పథకానికి సడలింపులో పరిమాణం మరియు ధరతో సంబంధం లేకుండా నోటిఫైడ్ పండ్లు మరియు కూరగాయల యొక్క అన్ని సరుకులు 50 శాతం మేర రాయితీ రవాణాకు అర్హమైనవి. ప్రస్తుతం భారతీయ రైల్వే మూడు కిసాన్ రైళ్లు నడుపుతోంది. దేవ్లాలి (మహారాష్ట్ర) నుంచి ముజాఫర్పూర్ (బీహార్) వరకు, ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం నుండి ఢిల్లీ వరకు, బెంగళూరు నగరం నుండి ఢిల్లీ వరకు ఈ మూడు కిసాన్ రైళ్లను నడుపుతోంది. నాగ్‌పూర్ నుంచి మహారాష్ట్రలోని వరుద్ ఆరెంజ్ సిటీ నుంచి ఢిల్లీ నగరం వరకు నాలుగో కిసాన్ రైలును ప్రారంభించాలని సంస్థ యోచిస్తోంది.
పథకం లబ్ధి పొందేందుకు అర్హతగల పంటలు:
పండ్లు(19) - మామిడి, అరటి, జామకాయ, కివి, లిట్చి, మౌసాంబి, నారింజ, కిన్నో, లైమ్, నిమ్మ, బొప్పాయి, అనాస, దానిమ్మ, పనస పండు, ఆపిల్, ఉసిరి, జుమికి కాయ మరియు బేరి (పియర్);
కూరగాయలు (14): ఫ్రెంచ్ బీన్స్, కాకర కాయ, వంకాయ, క్యాప్సికమ్, క్యారెట్, కాలీఫ్లవర్, మిరపకాయలు (ఆకుపచ్చ), బెండకాయ, దోసకాయ, బఠానీలు, ఉల్లిపాయ, బంగాళాదుంప మరియు టమోటా.
***
(Release ID: 1664346)