శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
భారతదేశంలో సూపర్ కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలను నెలకొల్పుటకు గుర్తింపు పొందిన సంస్థలతో అవగాహనా ఒప్పందాలు
"జీవశాస్త్ర గణన, పరమాణు అంశాలు, భౌతిక వ్యవస్థ, జాతీయ భద్రత, రసాయన శాస్త్ర గణన, ప్రభుత్వ సమాచార విశ్లేషణలాంటి అంశాలకు సూపర్ కంప్యూటింగ్ కీలకం "..డి ఎస్ టి కార్యదర్శి ప్రొఫెసర్ అశుతోష్ శర్మ
Posted On:
13 OCT 2020 1:16PM by PIB Hyderabad
స్వదేశీ పరిజ్ఞానంతో భారతదేశంలో రూపొందించనున్న సూపర్ కంప్యూటింగ్ వ్యవస్థ రూపకల్పన మరియు తయారిలో దేశానికి చెందిన పలు గుర్తింపు పొందిన విద్యా సంస్థలు భాగస్వాములు కానున్నాయి. ఈ సౌకర్యాలను అందరికి అందుబాటులో ఉండే ధరలకు తెచ్చేలా ప్రయత్నాలు జరుగుతున్నాయి కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖకి అనుబంధంగా అధునాతన కంప్యూటింగ్ అభివృద్ధి కోసం ఏర్పాటైన (C -DAC ) కేంద్రం దీనికి సంబంధించి దేశంలో గుర్తింపు పొందిన 13 విద్య మరియు పరిశోధన అభివృధి సంస్థలతో అవగాహనా ఒప్పందాలను కుదుర్చుకొన్నది. 2020 అక్టోబర్ 12 వ తేదీన దృశ్య శ్రవణ విధానంలో జరిగిన సమావేశంలో భారతదేశంలో భారతదేశంలో సూపర్ కంప్యూటింగ్ మౌలిక సదుపాయాలను నెలకొల్పుటకు జాతీయ స్థాయిలో జరుగుతున్నప్రయత్నాలలో భాగంగా ఈ ఒప్పందాలను కుదుర్చుకోవడం జరిగింది.
గుర్తింపు పొందిన విద్యా సంస్థలతో కుదిరిన ఒప్పందాలు " ఆత్మనిర్భర్ భారత్" ఏర్పాటుకు సహకరిస్తాయని కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ సహాయ మంత్రి శ్రీ సంజయ్ సామ్ రావు ధోత్రే అన్నారు. అధునాతన జాతీయ కంప్యూటింగ్ అభివృద్ధి కోసం ఏర్పాటైన కేంద్రం (C -DAC ) మరియు బెంగుళూరులోని భారత శాస్త్ర సంస్థ ( ఐ ఐ ఎస్ సి )లతో కలసి శాస్త్ర సాంకేతిక శాఖ (డి ఎస్ టి) మరియు ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ( డి ఈ ఐ టీ వై ) లు సాధించిన ప్రగతి పట్ల మంత్రి సంతృప్తి వ్యకం చేశారు.
వివిధ సంస్థలతో కుదిరిన 13 అవగాహన ఒప్పందాలు పథకం వేగవంతంగా అమలు జరుగుతున్నదని చెప్పడానికి నిదర్శనం అని శాస్త్ర సాంకేతిక శాఖ కార్యదర్శి ప్రొఫెసర్ అశుతోష్ శర్మ అన్నారు. కంప్యూటింగ్ వ్యవస్థ ఏర్పాటు దిశలో సాగుతున్న ప్రయత్నాలకు ఇవి సహకరిస్తాయన్నారు. " గత అయిదు సంవత్సరాలుగా పథకంలో అనేక మార్పులు చోటు చేసుకొన్నాయి. భారతదేశంలో సూపర్ కంప్యూటర్లను తయారు చేయడానికి అవసరమయిన హార్డువేర్ మరియు సాఫ్ట్ వేర్ ల రూపకల్పన మరియు తయారీకి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతున్నది. "ఆత్మనిర్భర్ భారత్" నిర్మాణం కోసం ప్రధాన మంత్రి ఇచ్చిన పిలుపు మేరకు ఈ కార్యక్రమాలు జరుగుతున్నాయి" అని ఆయన వివరించారు.
"జీవశాస్త్ర గణన, పరమాణు అంశాలు, భౌతిక వ్యవస్థ, జాతీయ భద్రత, రసాయన శాస్త్ర గణన, ప్రభుత్వ సమాచార విశ్లేషణలాంటి అంశాలకు సూపర్ కంప్యూటింగ్ కీలకంగా ఉంటుంది. కృత్రిమ మేధస్సు, యంత్రాల ద్వారా సమాచార వ్యాప్తి వల్ల ఇది తిరుగులేని పరికరంగా మారుతుంది. భవిషత్తులో ఎదురయ్యే సవాళ్ళను ఎదుర్కొని అవసరాలకు అనుగుణంగా భారతదేశాన్ని సిద్ధం చేసి దేశ ప్రజలకు సాధికారతను కల్పించడానికి ఈ పథకం దోహదపడుతుంది" అని ఆయన తెలిపారు.
"సిలికాన్ - ఫోటోనిక్స్ తో సహా ఎక్సా స్కేల్ చిప్పుల రూపకల్పన, ఎక్సా స్కేల్ సర్వర్ బోర్డులు, ఎక్సా స్కేల్ అనుబంధ పరికరాలు సి -డాక్ లో రూపొందించడానికి ఉపయోగపడే పరిజ్ఞానాన్ని స్వదేశంలో సిద్ధం చేయాలన్నది మా లక్యం. దీని ద్వారా స్వావలంభనను సాధించడానికి అవకాశం కలుగుతుంది." అని సి -డాక్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ హేమంత్ దర్బారి వివరించారు.
బెంగళూరు ఐ ఐ ఎస్ సి , బెంగుళూరు, కాన్పూర్, రూర్కీ, హైదరాబాద్, గువాహటి, మండి , ఖరగ్ పూర్, గోవా , పాలక్కాడ్ కేంద్రాలుగా పనిచేస్తున్న ఐ ఐ టి లు, ఎన్ ఐ టి గాంధీనగర్, నాబి మొహాలీ ,ఐ ఐ టి చెన్నైకి చెందిన ఎన్ ఎస్ ఎం నోడల్ సెంటర్స్ ఫర్ ట్రైనింగ్ ఇన్ HPC అండ్ AI లతో జరిగిన అవగాహనా ఒప్పందాల సంతకాల కార్యక్రమంలో కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ ప్రత్యేక కార్యదర్శి శ్రీమతి జ్యోతి అరోరా, కేంద్ర ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖ అదనపు కార్యదర్శి డాక్టర్ రాజేంద్ర కుమార్ పాల్గొన్నారు.
సూపర్ కంప్యూటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేసి దేశ వ్యాపితంగా విద్య, పరిశోధన అభివృద్ధి కార్యక్రమాలపై దృష్టి సారించి పనిచేస్తున్న 70 కి పైగా సంస్థలను మరింత పటిష్టం చేయడానికి ఈ పధకాన్ని రూపొందించడం జరిగింది. పధకంలో భాగంగా ఈ వ్యవస్థలను నిర్వహించడానికి ఆవరసమైన హై పెర్ఫార్మన్స్ కంప్యూటింగ్ (హె చ్ సి ) మానవ వనరులను కూడా అధివృద్ధి చేయడం జరుగుతుంది. దేశంలో శాస్త్ర సాంకేతిక రంగాలలో పనిచేస్తున్న వారికి ఈ పథకం సూపర్ కంప్యూటర్ వ్యవస్థను అందుబాటులోనికి తీసుకొని వస్తుంది. దీనివల్ల వివిధ అంశాలకు సంబంధించి దేశం ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించడానికి అవకాశం కలుగుతుంది.
4500 కోట్ల రూపాయల ఖర్చుతో ఏడు సంవత్సరాల పాటు అమలు చేసి ప్రపంచంలో సూపర్ కంప్యూటింగ్ రంగంలో భారతదేశాన్ని తిరుగు లేని శక్తిగా రూపొందించడం లక్ష్యంగా సిద్ధమైన ఈ పధకాన్ని కేంద్ర శాస్త్ర సాంకేతిక శాఖ మరియు ఎలక్ట్రానిక్స్ మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖలు సంయుక్తంగా అమలు చేస్తున్నాయి.
***
(Release ID: 1664137)