ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ
5 లక్షల టెలీ కన్సల్టేషన్లు పూర్తి చేసుకున్న ఈ-సంజీవని ఇప్పటివరకు 216 ఆన్ లైన్ ఔట్ పేషెంట్ సేవాకేంద్రాలు
Posted On:
12 OCT 2020 7:53PM by PIB Hyderabad
కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ వారి టెలీమెడిసిన్ కార్యక్రమం ఈ-సంజీవనికి అటు డాక్టర్లలోను, ఇటు రోగులలోను విపరీతమైన ఆదరణ పెరుగుతూ వస్తోంది. కొద్ది సమయంలోనే ఐదు లక్షల టెలీ కన్సల్టేషన్లు నమోదయ్యాయి. చివరి లక్ష కన్సల్టేషన్లు 17 రోజుల రికార్డు సమయంలో పూర్తికావటం విశేషం. వైద్య సేవలకు డిజిటల్ హంగులద్దటంలో భాగంగా ఈ-సంజీవని క్రమంగా భారత వైద్యసేవల వ్యవస్థకు ఒక సమాంతర వ్యవస్థగా రూపుదిద్దుకుంటోంది. ప్రతిరోజూ టెలీకన్సల్టేషన్ల సంఖ్య క్రమంగా పెరుగుతూ కొద్దిరోజులుగా అది రోజుకు 8,000 సంఖ్యకు దగ్గరవుతూ వస్తోంది. ప్రస్తుతం 26 రాష్ట్రాలు ఈ-సంజీవని సేవలు వాడుకుంటూ ఉండగా ఒకటి డాక్టర్ నుంచి డాక్టర్ కు అందే సంప్రదింపులు, మరొకటి డాక్టర్ నుంచి పేషెంట్ కు అందే ఆన్ లైన్ ఔట్ పేషెంట్ సలహాలు.
డాక్టర్లకు సలహాలివ్వటానికి కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ 2019 నవంబర్ లో ఈ-సంజీవని ప్రారంభించగా అది 1,55,000 ఆరోగ్య కేంద్రాలకు విస్తరించింది. అవి ఆయుష్మాన్ భారత్ పథకం కింద ప్రభుత్వం ఆమోదం పొందిన వైద్య కళాశాలల ఆస్పత్రులకు అనుబంధంగా పనిచేస్తాయి. వీటిని 2022 డిసెంబర్ నాటికి పూర్తిగా అమలుచేస్తారు.ఈ-సంజీవని వైద్యకేంద్రాలు ప్రస్తుతం 4,000 ఉండగా అంతే సంఖ్యలో ఇంకా ఈ పరిధిలోకి తీసుకువచ్చే పని కొనసాగుతోంది.
ఇక ఈ-సంజీవని ఒ.పి.డి. అయితే చాలా భారీ లక్ష్యాలతో కూడుకున్న కార్యక్రమం. ఇది ప్రపంచంలోనే అతిపెద్ద ఔట్ పేషెంట్ టెలీమెడిసిన్ కార్యక్రమంగా పేరుతెచ్చుకునే అవకాశముంది. మొదటి కోవిడ్ లాక్ డౌన్ ప్రకటించిన సమయంలో దేశమంతా మూతబడిన వేళ ఏప్రిల్ 13న దీన్ని ప్రారంభించారు. ఈ-సంజీవని ఒ.పి.డి. వలన రోగులు తమ ఇంట్లో ఉంటూనే ఆరోగ్య సంబంధమైన సలహాలు పొందగలిగే అవకాశం ఏర్పడింది. దాదాపు 100 మందికి పైగా టెలీమెడిసిన్ ప్రాక్టీషనర్లు లక్షకు పైగా టెలీ కన్సల్టేషన్లు పూర్తి చేశారు. వాళ్లలో కొంతమంది 10,000 కు పైగా కన్సల్టేషన్లు పూర్తి చేశారు. మరోవైపు 20% పైగా పేషెంట్లు ఈ-సంజీవని వేదిక వాడుకుంటు ఒకటి కంటే ఎక్కువసార్లు వైద్య సంప్రదింపులు జరిపారు.
ఈ-సంజీవని వేదికకు చాలా త్వరగా అలవాటు పడటంతో ఈ సేవలను స్పెషాలిటీ, సూపర్ స్పెషాలిటీ విభాగాలకు కూడా విస్తరింరించగలిగారు. జనరల్, స్పెషాలిటీ ఒపిడి లకు తోడుగా బఠిండాలోని ఎయిమ్స్ కేంద్రం రేడియేషన్ ఆంకాలజీ, సర్జికల్ ఆంకాలజీ, పీడియాట్రిక్ సర్జరీ, లాంటి అనేక సూపర్ స్పెషాలిటీ విభాగాలలో సంప్రదింపులకు అవకాశం కల్పించింది. ఈ కేంద్రం పొరుగు రాష్ట్రాలైన పంజాబ్, హర్యానా, చండీగఢ్, హిమాచల్ ప్రదేశ్ కు సేవలందించగలిగింది.
తమిళనాడు ప్రభుత్వం ఆయుష్, యోగ, నేచరోపతి ఒపిడి సేవలను ఈ-సంజీవని ద్వారా అందించింది. న్యూ ఢిల్లీలోని లేడీ హార్డింజ్ వైద్య కళాశాల డెంటల్, మాక్సియీ ఫేషియల్ సర్జరీకి సంబంధించి న్యూ ఢిల్లీ లోని రోగులకు ఒపిడి సేవలందించింది. కేరళ లో ఈ-సంజీవని తరహాలో 14 ఒపిడి లు ప్రారంభించగా అవి రాష్టీయ బాల్ స్వాస్థ్య కార్యక్రమం కింద జిల్లా స్థాయిలో ప్రాథమిక చికిత్సా కేంద్రాలకోసం పనిచేస్తున్నాయి. టెలీమెడిసిన్ వేదిక కోసం పనిచేసే ఈ 14 ఒపిడి లలో ఒక్కొక్కదానిలో ఒక సైకాలజిస్ట్, ప్రత్యేక బోధనానిపుణుడు, ఒక స్పీచ్ థెరపిస్ట్, ఒక ఫిజియోథెరపిస్ట్ ఉంతారు. బాలల ఎదుగుదల, వరి భవిష్యత్ ఆరోగ్యం ధ్యేయంగా వీరంతా ఉమ్మడిగా కృషి చేస్తారు. దేశవ్యాప్తంగా దాదాపు 20,000 మంది డాక్టర్లు, వైద్య సిబ్బంది ఈ రెండు రకాల ఈ-సంజీవని టెలీమెడిసిన్ లలో శిక్షణ పొందారు.
రాష్ట్ర ప్రభుత్వాల కృషికి తోడుగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వశాఖ అత్యాధునిక డిజిటల్ ఆరోగ్య వ్యవస్థను, మానవ వనరులను, మౌలిక సదుపాయాలను అందజెస్తోంది. దీనివలన ఈ-సంజీవనికు అలవాటు పడటం మరింతగా పెరుగుతుంది. సెంటర్ ఫర్ డెవలప్ మెంట్ ఆఫ్ అడ్వాన్స్ డ్ కంప్యూటింగ్ మొహాలీ శాఖ వారి సేవలను అందుకుంటూ ఆరోగ్య మంత్రిత్వశాఖ స్వయంగా ఆరోగ్య సిబ్బందికి సాంకేతిక సహకారం అందించటానికి కృషి చేస్తూ వచ్చింది.
ఈ-సంజీవని కింద అత్యధిక సంఖ్యలో కన్సల్టేషన్లకు రిజిస్టర్ చేసుకున్న మొదటి పది రాష్ట్రాల సమాచారం ప్రకారం తమిళనాడు (169977), ఉత్తరప్రదేశ్ (134992), హిమాచల్ ప్రదేశ్ (39326), కేరళ (39300), ఆంధ్రప్రదేశ (31365) ఉత్తరాఖండ్ (16442), మధ్యప్రదేశ్ (14965), గుజరాత్ (10839), కర్నాటక (9498), మహారాష్ట్ర (7895) నమోదు చేసుకున్నాయి.
eSanjeevani Teleconsultations (12 Oct 2020)
|
Sr No.
|
|
Teleconsultations
|
|
INDIA
|
500091
|
1
|
Tamil Nadu
|
169977
|
2
|
Uttar Pradesh
|
134992
|
3
|
Himachal Pradesh
|
39326
|
4
|
Kerala
|
39300
|
5
|
Andhra Pradesh
|
31365
|
6
|
Uttarakhand
|
16442
|
7
|
Madhya Pradesh
|
14965
|
8
|
Gujarat
|
10839
|
9
|
Karnataka
|
9498
|
10
|
Maharashtra
|
7895
|
11
|
Punjab
|
6427
|
12
|
Delhi
|
6158
|
13
|
Rajasthan
|
5321
|
14
|
Jharkhand
|
1882
|
15
|
Chandigarh
|
1538
|
16
|
Manipur
|
1484
|
17
|
Haryana
|
1465
|
18
|
Assam
|
568
|
19
|
Telangana
|
278
|
20
|
Jammu And Kashmir
|
182
|
21
|
Goa
|
55
|
22
|
Mizoram
|
51
|
23
|
Arunachal Pradesh
|
47
|
24
|
Chhattisgarh
|
23
|
25
|
Puducherry
|
9
|
26
|
Bihar
|
4
|
***
(Release ID: 1663873)
Visitor Counter : 179